29, జనవరి 2012, ఆదివారం
మద్యం వ్యాపారులకు మూడింది
మద్యం సిండికేట్లపై రెండోరోజూ ACB దాడులు కొనసాగాయి. మొదటిసారి జరిపిన దాడుల్లో లభించిన ఆధారాల మేరకు ACB పక్కాగా దాడులు నిర్వహించింది. నెల్లూరు జిల్లాలో భారీగా అరెస్టులు చోటుచేసుకున్నాయి. సింగరాయకొండ ఎక్సైజ్ సీఐ గురవయ్య, సిండికేట్ అధ్యక్షుడు వెంకట్రావు, కోవూరు ఎక్సైజ్ ఎస్సై విజయకుమార్,బుచ్చిరెడ్డిపాళ్యం సిండికేట్ అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
ప్రకాశం జిల్లాలో మద్యం వ్యాపారి వెంకట్రావు ఇంట్లో సోదాలు నిర్వహించిన అధికారులు తర్వాత అరెస్ట్ చేశారు. ఆదాయానికి మించి ఆస్తులున్న ఎక్సైజ్ సీఐ గురవయ్యని అదుపులోకి తీసుకున్నారు...
ఇక ఉత్తరాంధ్రలో రెండ్రోజుల సోదాల్లో ముగ్గురు ఎక్సైజ్ అధికారులు, ఓ హెడ్‌కానిస్టేబుల్ సహా 11మందిని అరెస్ట్ చేశారు. సోదాల్లో ఎక్సైజ్ సిబ్బందితో పాటు మీడియా ప్రతినిధులకు నెలవారి కమిషన్లు అందినట్లు పక్కా ఆధారాలు లభించాయి. వ్యాపారుల అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ మద్యం డీలర్లు ACB కార్యాలయానికి తరలివచ్చారు. ప్రభుత్వం వేధిస్తోందని ఆరోపించారు.
వరంగల్‌లో ఎనిమిదిమంది వ్యాపారులతో పాటు ఓ ఎక్సైజ్ సీఐని అరెస్ట్ చేసిన ACB వారికి MGMలో వైద్య పరీక్షలు నిర్వహించింది. తర్వాత వారిని హైదరాబాద్ తరలించింది. ఇంతకాలం దర్జాగా సిండికేట్లతో దోచుకున్న అక్రమార్కులు ఎప్పుడు ACB విరుచుకుపడుతుందా అన్న ఆందోళనతో కాలం గడుపుతున్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి