4, డిసెంబర్ 2011, ఆదివారం
హాట్బాంబ్కు హాట్ వార్నింగ్
Categories :
entertainment . nude pose . pakistan . TOP . veena malik
పాకిస్తాన్ హాట్‌బాంబ్ వీణా మాలిక్ మరో వివాదంలో చిక్కుకుంది. ఓ మ్యాగజైన్‌కు న్యూడ్ ఫోజులు ఇచ్చి.. కావల్సినంత ప్రచారం పొందడమే కాదు.. అంతకన్నా ఎక్కువే విమర్శల పాలవుతోంది. పాకిస్తాన్ ప్రభుత్వం అయితే.. దేశం పరువు తీసిందంటూ ఆగ్రహంగా ఉంది. హాట్ హీరోయిన్ వీణామాలిక్.. FHM అనే మ్యాగజైన్ కవర్ పేజ్‌పై నగ్నంగా దర్శనమిచ్చింది. ఈ ఫోటోలను చూసి పాకిస్తాన్ వాసులు.. వీణామాలిక్పై భగ్గుమంటున్నారు. పాక్ హోం శాఖ మంత్రైతే.. వీణా మాలిక్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని తీవ్రస్వరంతో హెచ్చరించారు.
ఫోటోలపై వివాదం చెలరేగడంతో వీణ స్పందించింది. తాను నగ్నంగా ఫోటోలను దిగలేదంది. ఆ ఫోటోలు మార్ఫింగ్ చేశారని, మ్యాగజైన్ నిర్వాహకులపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించింది. అయితే, మ్యాగజైన్ ఎడిటర్ మాత్రం.. అవి వీణామాలిక్ అసలైన ఫోటోలే అని ప్రకటించారు. దానికి సంబంధించిన ఆధారాలు కూడా తన దగ్గర ఉన్నాయన్నారు.
వీణా మాలిక్ ఫోటోలు ప్రపంచవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారాయి. కొంతమంది ఆమెకు మద్దతు పలికితే, మరికొందరు మాత్రం ఆమె తెగింపును విమర్శిస్తున్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి