4, డిసెంబర్ 2011, ఆదివారం
కాంగ్రెస్ పై అలిగిన చిరంజీవి..
Categories :
congress . POLITICS . prajarajyam . TOP
అవిశ్వాసం సమయంలో కాంగ్రెస్‌లో అలజడి సృష్టిస్తున్నారు పీఆర్పీ ఎమ్మెల్యేలు. తమకు కాంగ్రెస్‌లో సరైన స్థానం లభించడం లేదని అలిగారు. తీర్మానం సభలో చర్చకు వచ్చే సమయం దగ్గర పడుతున్న సమయంలో.. తమ వ్యూహాలకు పదును పెడుతున్నారు. కాంగ్రెస్‌లో విలీనం అయినప్పటికీ, తమను ఇంకా వేరుగానే చూస్తున్నారన్న భావనలో ఉన్న పీఆర్పీ ఎమ్మెల్యేలు.. అవిశ్వాసాన్నే అస్త్రంగా మలుచుకోవాలనుకుంటున్నారు. సభలో ఓటింగ్ ఎలా వేయాలన్నదానిపై చిరంజీవితో సమావేశమై చర్చలు జరిపారు. కాంగ్రెస్ సర్కార్‌కు వ్యతిరేకంగా ఓటేద్దామంటూ కొంతమంది ప్రస్తావించినట్లు సమాచారం..
పరిస్థితి తీవ్రతను గమనించిన కాంగ్రెస్ పార్టీ, పీఆర్పీనేతలను కలుపుకొని వెళ్లవడానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ చిరంజీవి నివాసానికి వెళ్లి, ఎమ్మెల్యేలతో చర్చలు జరిపారు. కాంగ్రెస్ పార్టీలో పీఆర్పీ ఎమ్మెల్యేలకు అన్యాయం జరుగుతోందని ఒప్పుకున్న బొత్స.. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. అవిశ్వాసం సమయంలో ప్రభుత్వానికి అండగా ఉండాలని కోరారు.
కాంగ్రెస్ పార్టీలో విలీనం అయినప్పటికీ, ఈ అసెంబ్లీ సమావేశాల్లో పీఆర్పీగానే కొనసాగుతుండడంతో, అవిశ్వాసంపై విప్ జారీ చేయకూడదనే చిరంజీవి భావిస్తున్నారు. అదే జరిగితే, పీఆర్పీ ఓట్లన్నీ, కాంగ్రెస్‌కు పడకపోవచ్చు. అటు జగన్ వర్గం, ఇటు పీఆర్పీ ఓట్లు వ్యతిరేకంగా పడితే మాత్రం.. ప్రభుత్వం అవిశ్వాస గండాన్ని దాటడం కష్టమే..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి