28, ఆగస్టు 2011, ఆదివారం
బచావో జగన్ పార్టీ
అవును.. బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ కాదట. బచావో జగన్ పార్టీ అట. ఈ కామెంట్ చేసింది కాంగ్రెస్ నేత పి.సుధాకర్ రెడ్డి. లోక్ సభలో కాంగ్రెస్ అంటే సుష్మా ఇచ్చిన వివరణకు ఆయన ఇలా కౌంటర్ ఇచ్చారు. సీబీఐ అంటే అంతా కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటారని, కానీ తాను మాత్రం కాంగ్రెస్ బచావో ఇన్ స్టిట్యూషన్ అంటానని లోక్ పాల్ బిల్లుపై చర్చ సందర్భంగా సుష్మ వ్యాఖ్యానించారు. అదే సమయంలో కాంగ్రెస్ ఎంతటి పవిత్రగంగో అర్తం కావడం లేదని, అందులో నేతలు ఉన్నంతకాలం శుద్ధిగా ఉంటారని, బయటకు రాగానే వారిపై సీబీఐ దాడులు, అవినీతి ఆరోపణలు వెల్లు వెత్తుతాయని సుష్మ విమర్శించారు. ఇందులో భాగంగానే జగన్ పై సీబీఐ దాడులను ఉటంకించారు. జగన్ ను వెనుకేసుకొచ్చిన బీజేపీ.. ఇప్పుడు బచావో జగన్ పార్టీగా మారిందంటూ సుధాకర్ రెడ్డి విమర్శించారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి