
మీ అందాన్ని మెరుగుపరుచుకోవడానికి మెరుగైన చిట్కా
గుండె జబ్బులకు చెక్ చెప్పే గొప్ప చిట్కా
అందమే ఆనందం..ఆనందమే జీవిత మకరందం.. అంటారు కొందరు. ఆరోగ్యమే మహా భాగ్యం అంతకంటే విలువైనది ఏముంటుంది అంటారు మరికొంతమంది.. ఏది ఏమైనా ఈ రెండూ మనిషి జీవితంలో చాలా విలువైనవే... కానీ ఈ రెండింటినీ అందుకోవడమే మనిషికి చాలా కష్టమైన పని. దానికోసం వేల రూపాయలు తగలేయడానికి సిద్ధంగా ఉంటారు. లాఫింగ్ థెరపీలు, బ్యూటీ థెరపీలకు ఖర్చు పెడుతూ పర్సు ఖాళీ చేసుకుంటారు. కానీ, ఈ రెండిటికి పెద్దగా ఖర్చు పెట్టకుండానే సాధించుకోవచ్చంటున్నారు. అది మాయాకాదు మంత్రం కాదు.. అంతా క్యారెట్ మహిమ.
ఓ క్యారెట్ మీ జీవితాన్ని మార్చేస్తుంది... ప్రతి రోజూ నాలుగు క్యారెట్లు తింటే రెండంటే రెండు నెలల్లో మీ శరీరం ఆకర్షణీయంగా తయారవుతుందని పరిశోధనలు చేసి మరీ నిరూపించారు బ్రిటీష్ శాస్త్రవేత్తలు. గుండె జబ్బుల్ని ఆమడ దూరంలో ఉంచవచ్చనీ చెబుతున్నారు. చూడగానే తినాలనిపించే క్యారట్‌లో అందాన్ని ఆకర్షణను పెంచే గుణాలున్నాయట. క్యారట్‌తో పాటు సీజనల్ ఫ్రూట్స్, ప్లమ్స్ తింటే ఇంకా బెటరట.. బ్రిటన్‌లోని బ్రిస్టల్ యూనివర్సిటీకి చెందిన సెయింట్ ఆండ్రూస్ నేతృత్వంలో ఓ బృందం అనేక వందల మందిపై
పరిశోధనలు చేసి ఈ విషయాన్ని ప్రకటించింది. మరి మార్కెట్ కు వెళ్లి క్యారెట్స్ కొనుక్కొస్తారా..!
నోట్ - అందం కోసం తపించే ఆడవాళ్లు మాత్రమే కాదు.. అందంగా, ఆనందంగా ఉండాలనుకునే మగ మహరాజులు దర్జాగా ఈ చిట్కా ఫాలో కావచ్చు.
కామెంట్‌ను పోస్ట్ చేయండి