గ్రహాంతరవాసులు ఉన్నాయా?
గ్రహాంతర వాసులు ఎలా ఉంటాయో తెలుసా?
ఫోటోల్లో కనిపించినట్లు.. సినిమాల్లో చూపించినట్లు ఉంటాయా?
నాసా సీక్రెట్ టేపులంటూ నెట్ విహరించేవి నిజమైన దృశ్యాలేనా?
అసలు గ్రహాంతరవాసులు ఉన్నాయని చెప్పడానికి సాక్ష్యం ఉందా?
గ్రహాంతరవాసులు అనగానే.. చుట్టుముట్టే ప్రశ్నలివి. మీ అనుమానాలకు అర్థం ఉంది. అలా అడగడంలో న్యాయం ఉంది. ఎవరో కొంతమంది చూశామని చెప్పడమే తప్ప.. అందరికీ ప్రత్యక్షంగా ఈ ఏలియన్స్ కనిపించలేదు. కథల్లో, ఫిక్షన్ సినిమాల్లో సందడి చేయడమే తప్ప.. నేరుగా జనం మధ్యకు రాలేదు. అందుకే.. గ్రహాంతరవాసులనగానే, ఎప్పుడూ చెప్పే స్టోరీనే అనుకుంటారు. కానీ.. ఇది ఎప్పుడూ చెప్పే స్టోరీ కాదు.. సరికొత్త సాక్ష్యం. విశ్వజీవులు ఉన్నాయని చెప్పడానికి జనం ముందుకు వచ్చిన తాజా దృశ్యం.
ఈ వీడియోలో మీరు చూస్తోంది రష్యాలోని సైబీరియా ప్రాంతం. ఎక్కువగా మంచు గడ్డలతో ధృవప్రాంతాలను తలపిస్తూ ఉండే ప్రాంతం. ఇక్కడ తీసిన ఈ వీడియోనే ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనాన్ని సృష్టిస్తోంది. ఎందుకంటే.. ఇది సాధారణ వీడియో కాదు.. గ్రహాంతరవాసులు ఉన్నారనడానికి సాక్షీభూతమైన దృశ్యమాలిక. మంచు తొలిచినట్లు ఉన్న ఈ ప్రాంతంలోనే ఓ వింత జీవి మృతదేహం కనిపించింది. ఇది గ్రహాంతరవాసులదేనన్నది యుఎఫాలజిస్ట్‌ల నమ్మకం.
దాదాపు మూడు నాలుగు అడుగుల లోతున ఈ మృతదేహం పడిఉంది. దీని శరీరం చాలావరకూ పాడైపోయింది. ఒంటినిండా గాయాలున్నాయి. ఓ కాలు అసలుకే లేదు. అలాగే ఓ చెయ్యి కూడా లేదు. కొన్ని హాలీవుడ్ సినిమాల్లో చూపించినట్లే దీని ఆకారం ఉంది. చూస్తుంటే.. దీన్ని ఎవరో తీసుకొచ్చి పాతిపెట్టిన ఆనవాళ్లున్నాయి. దీనిపై మంచు ఉండడంతో.. దీని శరీరం పూర్తిగా పాడవ్వలేదు. దీన్ని చూశాకా అయినా.. గ్రహాంతర వాసులు ఉన్నాయని నమ్ముతారా..? మనం భూమికి వచ్చాయని విశ్వసిస్తారా..? ఇంకా మీకేమైనా అనుమానాలున్నాయా?
శవం తాజాగా వుంది. సినిమాల్లో వున్నట్టే వుందే! అంతకన్నా ఎక్కువగా వూహించలేక పోయారా?
అప్పట్లో హిట్లర్ సార్థ్యం లో జర్మనీ కొన్ని వృత్తాకారపు విమానాలపై పరీక్షలు చేసిందని ఒక వాదం. ఏమో ఆ దేహం అతనిదే కావచ్చేమో. విమానం లో వెలిపోతూ ఇలా పోయాడేమో ఎవరికి తెలుసు?