28, జనవరి 2011, శుక్రవారం
హతవిథీ.. ఎంతటి దుర్గతి..
ఉదయాన్నే ఆఫీస్‌కు రెడీ అవుతూ టీవీ పెట్టిన నాకు.. జెమినీలో రౌద్రరసాన్ని పండించిన సీతయ్య సినిమా పలకరించింది. కాసేపు చూసి.. బ్రేక్‌లో ఛానల్స్ మార్చుతూ పోతుండగా.. మధ్యలో జెమినీ కామెడీ ఛానల్ అడ్డు పడింది. సరేలో ఏదో కామెడీ బిట్లు వేస్తారు కదా.. అని రిమోట్‌నొక్కడం ఆపే సరికి.. యాంకరమ్మ ప్రత్యక్షమయ్యింది. వెంటనే అవతలి నుంచి ఫోన్ కాల్. కాలర్ మంచి జోష్‌లో ఉన్నాడు.. సహపాటు ఎటూ లేదు కామెడీ బిట్ చూడు బ్రదర్ అంటూ రాగం అందుకున్నాడు.. సదరు మనిషి యాంకరమ్మకు బాగా పరిచయం అనుకుంటా.. ఏమండీ రఘుబాబు గారూ.. ఎలా ఉన్నారూ అంటూ పలకరించింది.
ఆయన ఏదో చెబుతుండగా.. అడ్డు తగిలిన యాంకరిణి ఈ పాట ఏదో సినిమాలోది.. సూపర్ హిట్ సినిమాలోది కదూ అంది. సదరు సింగర్ కూడా అవును గుర్తులేదు.. నోటికొచ్చింది పాడానన్నాడు. కాసేపు రాగాలు తీసి.. ఆ గుర్తొచ్చింది.. ఇది ఆకలి చరిత్ర సినిమాలోది కదూ అంది యాంకరిణి(బహుశా రక్తచరిత్ర ఎఫెక్టేమో). ఆ అయ్యిండొచ్చు అన్నాడు అవతలి మనిషి. ఆ తర్వాత కాసేపు బాతాఖాణీ కొట్టిన తర్వాత, బ్రేక్ ఫాస్ట్ అయ్యిందా అండీ అంటూ మదురంగా పలకరించాడు కాలర్. ఆ అయ్యిందంటూనే.. ఆ సినిమా పేరు ఆకలిరాజ్యం అంటూ అరిసింది యాంకర్. ఇది చూస్తూ బ్రేక్‌ఫాస్ట్ చేస్తున్న నాకు.. ఒక్కసారిగా కడుపులో తిప్పినట్లయ్యింది. ఆ తర్వాత కూడా వారి చర్చాగోష్టి సాగుతూ.. ఇద్దరికీ తెలియని విషయాలపై అనర్గళంగానే సాగడం మొదలయ్యింది. వారి దాటిని తట్టుకోలేక వెంటనే ఛానల్ మార్చేశా... కనీసం సినిమా పరిజ్ఞానం కూడా లేకుండా యాంకర్‌లుగా ఎలా లైవ్‌లోకి వచ్చేస్తారో నాకిప్పటికీ అర్థంకాదు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి