18, జనవరి 2011, మంగళవారం
జగన్ కలలకు హద్దుంది!
కలలు ఎవరైనా హద్దులు లేకుండా కంటారు. తమ భవిష్యత్తును ఊహించుకుని ఎవరికైనా చెప్పేటప్పుడూ అలానే వ్యవహరిస్తారు. పలానా సమయం నుంచి నాకు తిరుగులేదని చాటిచెబుతుంటారు. కానీ, వైఎస్ వారసుడు జగన్ మాత్రం ఎందుకో ఈ విషయంలో కాస్త వింతగా ప్రవర్తిస్తున్నారు. తన రాజకీయ భవిష్యత్తుకు తానే చివరితేదీని చెప్పేస్తున్నారు.అదే ముప్పై ఏళ్ల పాలన. మూడేళ్లు ఆగండి ముప్పై ఏళ్లపాటు స్వర్ణయుగాన్ని చూపిస్తానంటున్నారు జగన్. కేవలం మూడు దశాబ్దాలు మాత్రమే అని ఎందుకంటున్నారు..? ఆ తర్వాత జగన్ ఉండరా..? రాజకీయాలనుంచి రిటైర్ అయిపోతారా..? ఒక వేళ చెప్పినట్లే జరిగే ఆ స్వర్ణయుగం తర్వాత వచ్చేది ఏమిటి? రాతియుగమా..?
జగన్ మాటలకు ఆయన అనుచరులకూ మతిపోతోంది. అందుకే, బెజవాడలో ఆయన అనుచరులు ఓ వింత ప్రయత్నాన్ని కూడా చేశారు. జగన్ ఫోటోతో న్యూఇయర్ క్యాలెండర్ను తాజాగా విడుదల చేశారు. అందులో జగన్ పేరు కింద ముఖ్యమంత్రి వర్యులు. 2014-2044 అంటూ ప్రచురించారు. అంటే వాళ్లు కూడా జగన్ 30 ఏళ్ల తర్వాత ముఖ్యమంత్రిగా ఉండరని డిసైడ్ అయిపోయారన్నమాట.
ప్రాస కోసం పాకులాడి మూడేళ్లకు.. ముప్పైఏళ్లకు లింకు పెట్టిన జగన్కు.. ఈ క్యాలెండర్ దెబ్బకు గొంతులో పచ్చివెలక్కాయ పడ్డట్లే.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
65 యేళ్ళు రాగానే రిటైర్ అయిపోతా అంటూ వై.ఎస్ చెప్పిందే ఈయనకూడా చెప్పకనే చెబుతున్నాడేమో. ఆయన పాటించలేదు, ఈయనేమైనా పాటిస్తాడేమో చూద్దాం:)
idi atani raajakeeya anubhavaleami ki udaaharana