21, డిసెంబర్ 2010, మంగళవారం
కిరణ్‌సర్కార్ కూలుతుందా..?
జగన్ బలం బయటపడింది. కృష్ణమ్మ ఒడిలో రైతు సమస్యలకోసం దీక్ష చేపట్టిన జగన్, తన బల ప్రదర్శనకు విజయవాడను వేదిక చేసుకున్నారు. లక్షలాది మంది జగన్ అభిమానులు, రైతులు ఈ దీక్షలో పాల్గొనడానికి వచ్చినప్పటికీ, అందరి దృష్టీ పడింది మాత్రం ఎమ్మెల్యేలపైనే. దాదాపు 25మంది ఎమ్మెల్యేలు జగన్‌కు మద్దతుగా నిలిచారు. ఇందులో22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలే. పలువురు ఎమ్మెల్సీలు కూడా లక్ష్యదీక్షలో జగన్‌కు జై కొట్టారు. సినీనటులు రోజా, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, రాజాలు కూడా జగన్‌కు మద్దతుపలికారు. లక్ష్మీపార్వతి, మాజీ మంత్రులు మారెప్ప, ముద్రగడ, మాకినేని పెదరత్తయ్య, కొణతాల రామకృష్ణలు కూడా జగన్ వెంట దీక్షలో పాల్గొన్నారు. రాష్ట్ర ఎంపీలను కూడా జగన్ ప్రభావితం చేయగలిగారు. ఐదుగురు ఎంపీలు జగన్ దీక్షకు హాజరవుతారంటూ ప్రచారం జరుగుతోంది. మరోవైపు ఎమ్మెల్యేల సంఖ్య కూడా యాభైకి చేరవచ్చన్న అంచనాలు మీడియాలో మొదలయ్యాయి.
జగన్ బలం బయటపడడంతో కాంగ్రెస్‌లో కంగారు మొదలయ్యింది. తెలుగుదేశం పార్టీ కూడా అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడానికి పావులు కదుపుతోంది. ఒకవేళ జగన్‌కు నిజంగానే 50 మంది ఎమ్మెల్యేల మద్దతు దొరికితే మాత్రం రాష్ట్రంలో అనూహ్య పరిస్థితులు ఏర్పడవచ్చు. రాజకీయ సంక్షోభానికి దారి తీయవచ్చు. కిరణ్ సర్కార్ కూలవచ్చు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి