17, డిసెంబర్ 2010, శుక్రవారం
వైఎస్ మాట తప్పారా?
Categories :
మహానేత.. కాంగ్రెస్‌ను అధికారంలోకి తీసుకొచ్చిన గొప్పనేత. వైఎస్ కాంగ్రెస్ ఆస్తి. నిన్నా మొన్నటిదాకా దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ను అందరూ కాంగ్రెస్ నేతలు పోటాపోటీగా చెప్పుకొచ్చారు. కానీ, జగన్ వేరు కుంపటి పెట్టడంతో వైఎస్‌పై దాడి మొదలయ్యింది. మొదటి దాడిని మొదలుపెట్టారు రాష్ట్రమంత్రి బొత్స సత్యనారాయణ. ఓ కీలక హామీ విషయంలో వైఎస్ మాట తప్పారంటున్నారు బొత్స. అదేమిటంటే..
రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్తు. ఇది ఎన్నికల మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ. ఈ హామీనే ఓ రకంగా రైతుల ఓట్లు కాంగ్రెస్‌కు పడేలా చేసింది. రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రమాణస్వీకారం చేసిన సమయంలో ఈ ఫైలుపైనే వైఎస్ సంతకం చేశారు. కానీ, ఈ హామీ హామీగానే ఉండిపోయింది తప్ప అమలుకు నోచుకోలేదు. ఎప్పటికప్పుడు ఈ విషయంలో ప్రభుత్వం కప్పదాటు ధోరణినే ప్రదర్శించింది. అయితే, డిసెంబర్ 17న మాత్రం ఈ విషయానికి సంబంధించి కీలక విషయాన్ని బయటపెట్టారు రాష్ట్రమంత్రి బొత్ససత్యనారాయణ. తొమ్మిది గంటల విద్యుత్తు సరఫరా ఫైలుపై అసలు వైఎస్ సంతకమే పెట్టలేదని తేల్చిచెప్పారు. దానికి ఫైళ్లే సాక్ష్యమన్నారు. ఆ సంతకం ఎందుకు పెట్టలేదో జగనే చెప్పాలంటూ కౌంటర్ కూడా వేశారు. ఇంతకీ వైఎస్ కీలకమైన ఆ ఫైల్‌పై సంతకం ఎందుకు పెట్టలేదు.. ప్రమాణస్వీకారం చేసిన సమయంలో చేసిన సంతకం వట్టిదేనా..? జనాన్ని నిజంగానే వైఎస్ మోసం చేశారా..? ఇంతకాలం కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ విషయంపై ఎందుకు మౌనంగా ఉన్నారు..? వైఎస్‌ను ఏకిపారేసే ఆయన వ్యతిరేకులూ ఈ విషయాన్ని ఎందుకు పట్టించుకోలేదు.. రైతులంటే ఎవరికీ లెక్కలేదా.. ఇప్పట్లో ఎన్నికలు లేవన్న ధీమానా...!
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఏదో కాగితం మీద సంతకం పెట్టేసి అది 9 గంటల విద్యుత్ ఫైల్‌కి చెందిన కాగితం అని చెప్పుంటాడు.
ys nijanga 9 gantalu vidut file meda santhakam chese unnataru.botsa avakasi vadi