2012 సినిమా చూసినవారికి లేదంటే తెలుగు న్యూస్ ఛానెళ్లు పదేపదే చూసేవారికి యుగాంతం ఎంత భయంకరంగా ఉంటుందో కనిపించే ఉంటుంది. అది నిజమా.. అబద్దమా అన్న సంగతి పక్కన పెడితే, ఆకాశం నుంచి విరుచుకుపడుతున్న అగ్నిగోళాలు.. ఎగసిపడుతున్న సముద్రాలు, కుప్పకూలుతున్న భవనాలు... మాడి మసైన భూగోళం కనిపించే ఉంటాయి. అయితే..
హాలీవుడ్ సినిమా కావడంతో అంతా అమెరికా సీనరీలే కనిపిస్తాయి. ఎంతో ఖర్చుపెట్టి తీసిన ఈ గ్రాఫికల్ సీక్వెన్స్ కు లోకల్ టచ్ ఇచ్చారు హైదరాబాద్ అబ్బాయిలు. IACG కి చెందిన కొంతమంది ఓ అద్భుతమైన మల్టీమీడియా వీడియోను తమ క్రియేటివిటీతో సృష్టించారు. 2012లో యుగాంతం నిజంగా సంభవిస్తే హైదరాబాద్ ఎలా ఉంటుందన్నదే వీరి కాన్సెప్ట్. సెంటిమెంట్లు, ఫీలింగ్స్ పక్కన పెట్టి చూస్తే హాలీవుడ్ గ్రాఫిక్స్ ను తలదన్నేలా ఉంది మనవాళ్లు తయారు చేసిన వీడియో. ఇక్కడ రెండు వీడియోలను ఇస్తున్నాను. కాస్త తీరిక చేసుకుని చూసి.. మీకు ఏదినచ్చిందో చెప్పండి.
హైదరాబాద్ వీడియో
2012 మూవీ ట్రైలర్
29, అక్టోబర్ 2010, శుక్రవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి