21, అక్టోబర్ 2010, గురువారం
రాజభవనం అంటే ఇదే..!
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన భవనం ఇది. దీనికి యజమాని మనదేశంలో అత్యంత సంపన్నుడిగా గుర్తింపు దక్కించుకున్న రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబాని. ఈ ఆకాశహర్మ్యం పేరు.. ఆంటిలియా. ఈ పేరు పెట్టడానికి కూడా ప్రత్యేక కారణం ఉంది. ఆంటిలియా అన్నదిఅట్లాంటిక్ మహా సముద్రంలో ఉన్న ఓ అద్భుతదీవి పేరు. దాన్నే తన ఇంటికి పెట్టుకున్నారు ముఖేశ్. మొత్తం 27 అంతస్థులున్న ఈ భవనం పొడవు 570 అడుగులు. దీన్ని నిర్మించడానికి రెండు బిలియన్ డాలర్ల ఖర్చుపెట్టినట్లు అధికారిక అంచనా. ఈ ఖరీదైన భవనంలోకి అక్టోబర్ 28న అంబానీ గృహప్రవేశం చేయనున్నారు. ఈ భవనంలోని మొదటి ఆరు అంతస్థులు కేవలం పార్కింగ్ కోసమే ఉపయోగిస్తున్నారు. ఇందులో 160 కార్లు పట్టే వీలుంది. ఈ పార్కింగ్ ప్లేస్ పైన అతివిలాసవంతమైన లాబీ ఉంది. ఆంటీలియాకు ఉన్న మరో ప్రత్యేక మూడు హెలీపాడ్లు, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్‌తో ఉండడం విశేషం. ఒకటికన్నా ఎక్కువ స్విమ్మింగ్‌పూల్స్, ఓ హెల్త్‌క్లబ్, సెలూన్, ఎనిమిదో ఫ్లోర్లో ప్రత్యేకంగా 50 సీట్ల మినీ థియేటర్ ఉన్నాయి. ఈ బిల్డింగ్‌లో నిర్మించిన బాల్రూమ్.. న్యూయార్క్‌లోని మాండరిన్ ఇన్ బాల్రూంను పోలినట్లు ఉంటుందట. ముఖేశ్ అంబానీ తల్లి, భార్య, పిల్లలు అంతా కలిపి ఐదుగురి కోసమే ఇంత విలాసవంతమైన భవనాన్ని నిర్మించారు. ఈ ఐదుగురుండే భవనాన్ని మెయింటైన్ చేయడం కోసం 600 మంది ఫుల్‌టైం స్టాఫ్ పనిచేయాల్సి ఉంటుంది. పునాది పడక ముందు నుంచి ఎన్నో వివాదాలు ఆంటిలియాను చుట్టుముట్టాయి. అన్నింటినీ అధిగమించిన ముఖేశ్ అంబానీ, అక్టోబర్ 28 నుంచి ఇందులోనే నివసించనున్నారు. మొత్తానికి డబ్బున్నోళ్లు ఏది చేసినా చెల్లుబాటవుతుందన్న విషయాన్ని ఆంటిలియా మరోసారి నిరూపించింది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
చూడటానికి నయనానందమే అయినా మనసులో ఏదో బాధ. మన దేశంలోనూ, ఇంకా సబ్ సహారన్ దేశాలలోనూ ఒక పూట తిండికి కూడా నోచుకోని పేదలు కొన్ని కోట్లలో ఉండగా తమ గొప్పతనాన్ని చాటుకోవడానికి ఇలాంటివి చెయ్యడం క్షమించరాని పని. ఈ లెక్కన బిల్ గేటెస్ తనకోసం ఎంత పెద్ద భవణాన్ని కట్టుకొని ఉండాల్సింది? కానీ ఆయన తన సంపాదనలో 70% దానధర్మాలకే నని డిక్లేర్ చేసాడు, అల్రడీ చాలా చాలా చేస్తూనే ఉన్నాడు.
ముఖేష్ ఎంత కష్టపడి సంపాదించినా ఈ దేశ ప్రజల వద్ద నుండే కదా ఈ ప్రతిఫలాన్నంతా పొందింది. ఇంకా వారికోసం ఎంతో చేసే అవకాశం ఉన్నా ఇల విలాసాలకోసం డబ్బు వృధా చెయ్యడం మాత్రం నాకైతే అస్సలు నచ్చలేదు. ఒకప్పుడు టాటా కూడా ఇలానే ఆలోచించి తన డబ్బుతో తనవరకు తాను విలాసంగా బ్రతికియుంటే మన దేశంలో పారిశ్రామికీకరణ అంటూ ఈ రేంజ్ కు చేరుకుని యుండేదా?
Hope RSReddy will donate 50% of his wealth following footsteps of American Gates. :P
స్వంత పేరుతో కాకుండా అఙాత పేరుతో సెటైర్లు వ్రాసే మహానుభావులకు సిద్ధాంతాలగురించి చెబితే చెవిటి వాడి ముందు శంఖం ఊదినట్లే అవుతుందేమో! కానీ బ్రదర్, వాళ్ళ దగ్గర ఉన్న ఒక మంచి లక్షణం మాత్రమే వ్రాసాను. వాళ్ళలా డెవలప్ కావాలని కలలు కనే మనం కొన్ని సిద్ధాంతాల విషయంలో కాస్త వెనకబడే ఉన్నామేమో?
మరో విషయం: నేను బిల్ గేటెస్ లాంతి కొందరి గురించే వ్రాసాను. అందరు అమెరికన్ల గురించీ కాదు. ఎందుకంటే, వాళ్ళు పిల్లలకు ఆస్తులు పంచివ్వకపోవడం వెనక సిద్ధాంతం కన్నా ఎవడి జల్సాలకు సరిపడా వాడు సంపాదించుకునేంతకంటే ఎక్కువ తెలివితేటలు వాళ్ళలో లేవు+అది వాళ వారసత్వంలో ఒక భాగమైపోయింది. అఫ్కోర్స్ తద్వారా వాళ్ళ పిల్లల్ని హై స్కూల్ లెవల్ నుండే స్వంత కాళ్ళ మీద నిలబడేలా కూడా చేస్తోంది-అదే సాంప్రదాయం.
Dear Friend!
I didn't mean to criticize u. Pl.see my Post on American Economy in my Blog @ 1) http://dare2questionnow.blogspot.com/2010/10/economics-very-interesting_26.html
&
2) http://dare2questionnow.blogspot.com/2010/08/is-our-planned-economy-really-failure.html
I am not supporting their policies either. I am only putting the facts before.
Thanks & Regards
Dear Friends!
CNN Hero of the Year కు సంబంధించిన ఒక మోటివేషనల్ కధనాన్ని నా బ్లాగులో వ్రాసాను @ http://dare2questionnow.blogspot.com/2010/10/catch-he-brings-hot-meals-to-indias.html. వీలుంటే మీ బ్లాగులో పెట్టండి, లేదా మీ మిత్రులందరికీ మెయిల్ చెయ్యండి.