21, సెప్టెంబర్ 2010, మంగళవారం
ప్రేమకు బలి
ప్రేమ జీవితాన్నిస్తుంది..
ప్రేమ సరికొత్త అనూభూతిని అందిస్తుంది..
ప్రేమలో పడితే అందాల ప్రపంచాన్ని చూడొచ్చు..
ఇవన్నీ పాత మాటలు... పాత ఊహలు..
ఇప్పుడు ప్రేమించడం పాపమవుతోంది.
ప్రేమించడం నేరమవుతోంది..
ప్రేమిస్తే ప్రాణం పోతోంది
ప్రేమ హంతకులను తయారు చేస్తోంది..
హత్యలు చేయిస్తోంది..
జీవితాలను నాశనం చేస్తుంది
కుటుంబాల్లో శోకాన్ని నింపుతోంది.
ప్రాణం పోసే ప్రేమకథలు సినిమాల్లోనే సాధ్యమేమో.. నిజజీవితంలో మాత్రం ప్రాణాలను బలితీసుకొంటోంది. ప్రేమ అన్న పదం క్రమంగా వికృతమవుతోంది. ప్రేమించినా, ప్రేమించకపోయినా.. అమ్మాయిల జీవితాలను మాత్రం ఈ రెండక్షరాల పదం బలికోరుతోంది. ప్రేమికుల మధ్య మొదలవుతున్న అనుమానాలు.. ప్రాణాలు తీయడానికి తెగించేలా చేస్తున్నాయి. క్షణికావేశంలో హంతకులుగా మార్చుతున్నాయి. అందంగా మొదలయ్యే ప్రేమకథలను విషాదాంతం చేస్తున్నాయి..
మీరూ ప్రేమలో పడ్డారా.. ?
అయితే జాగ్రత్త..
మీ ప్రాణం ఎప్పుడైనా పోవచ్చు..
మీపై వచ్చిన అనుమానం మీ ప్రాణాలను తీసేయవచ్చు..
నిన్నటి దాకా ప్రేమించినవారే.. మీ పాలిట మృత్యుదేవతలు కావచ్చు..
దివ్య కేసు పాఠం కావాలి
హైదరాబాద్ వనస్థలిపురంలో జరిగిన హత్య.. అందరికీ ఓ గుణపాఠం. కాలేజ్డేస్ను జాలీడేస్ అనుకుని ఎంజాయ్ చేయాలనుకునేవారందరికీ ఇది వార్నింగ్ లాంటిదే.
దివ్య అనే ఇంజనీరింగ్ స్టూడెంట్ను .. శేఖర్ దారుణంగా హత్య చేశాడు. బేస్‌బాల్ బ్యాట్‌తో తలపై మోది ప్రాణం తీశాడు. ఈ హత్యను శేఖర్ ఎందుకు చేశాడు..? దివ్యను చంపాల్సిన అవసరం ఏమిటి? అసలు శేఖర్ దగ్గరకు దివ్య ఎందుకు వచ్చింది..? వీటన్నింటికీ సమాధానం ఒక్కటే. ప్రేమ. అవును, ఆ ప్రేమే దివ్య ప్రాణాలను బలితీసుకొంది.. ఆ ప్రేమే.. శేఖర్‌ను హంతకుడిగా మార్చింది..
దివ్యకు, శేఖర్‌కు మూడేళ్ల పరిచయం ఉంది. ఇద్దరూ ఒకే కాలేజ్‌లో చదువుకున్నారు. పరిచయం కాస్తా ప్రేమగా మారింది. శేఖర్ ఇంజనీరింగ్ ఇటీవలే పూర్తి చేస్తే .. దివ్య ప్రస్తుతం ఫైనలియర్ చదువుతోంది. ఇక వ్యక్తిగత జీవితాల విషయానికి వస్తే.. వనస్థలిపురంలో శేఖర్ ఒంటరిగా ఉంటున్నాడు. తల్లిదండ్రులు ముంబైలో ఉండడంతో ఇక్కడ శేఖర్ ఆడిందే ఆట.. పాడిందే పాట.. అడ్డూ అదుపూ లేని విలాస జీవితం శేఖర్ సొంతం. దివ్యది దాదాపు అదే పరిస్థితి. తల్లిదండ్రులు కోల్‌కతాలో ఉండడంతో, హైదరాబాద్‌లో మేనమామ ఇంట్లో ఉంటోంది. ఒక్కమాటలో చెప్పాలంటే ఇద్దరినీ కంట్రోల్ చేసే వారు లేనేలేరు. శేఖర్‌ను ప్రేమించిన దివ్య.. కొంతకాలంగా తన క్లాస్‌మేట్‌తో చనువుగా ఉంటోంది. ఈ విషయం తెలుసుకున్న శేఖర్ ప్రేయసిపై కసిపెంచుకున్నాడు. ప్రేమను కాస్తా పగగా మార్చుకున్నాడు. ఆదివారం రోజు రాత్రి నమ్మించి దివ్యను ఇంటికి రప్పించుకున్న శేఖర్... దారుణంగా హత్య చేశాడు.
వరసగా సంఘటనలు
రాష్ట్రంలో ప్రేమోన్మాదం జడలు విప్పింది. ప్రేమ పేరుతో సాగుతున్న దాడులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ప్రేమమత్తులో పడుతున్న యువత, దాన్ని దక్కించుకోవడం కోసం హింసాత్మక పద్దతులకు తెగబడుతోంది. ప్రేమ దక్కకపోతే ప్రాణం తీయడానికీ సిద్ధమవుతోంది. కొన్నేళ్లుగా జరుగుతున్న సంఘటనలు చూస్తుంటే.. మన రాష్ట్రంలోనే ఈ పరిస్థితి ఎక్కువగా ఉన్నట్లు కనిపిస్తోంది.
విశాఖపట్నానికి చెందిన రామలక్ష్మి ఇలానే ఓ ఉన్మాది చేతిలో ప్రాణం పోగొట్టుకోబోయింది. రామలక్ష్మిని ప్రేమిస్తున్నానంటూ వెంకటేష్ అనే వ్యక్తి వెంటపడ్డాడు. రామలక్ష్మి కుటుంబసభ్యులు హెచ్చరించినా పద్దతిమార్చుకోలేదు. చివరకు ఆమెను ప్రేమిస్తున్నానని చెప్పాడు. దీనికి నిరాకరించడంతో వెంటనే బ్లేడ్ తీసుకొని గొంతు కోశాడు. ఇదేనా ప్రేమంటే... ప్రేమ దక్కకపోతే చంపాల్సిందేనా...
రామలక్ష్మి అదృష్టం బాగుండి ప్రాణాలతో బయటపడింది కానీ, ఇలా మానవమృగాల చేతుల్లో ప్రేమకు బలైన వారు ఎంతోమంది ఉన్నారు. అత్యంత ఘోరంగా ఇలా ఈ లోకాన్ని వదలివెళ్లిపోయింది విజయవాడ శ్రీలక్ష్మి. ఆమె చేసిన నేరమల్లా.. మనోహర్ అనే నరరూప రాక్షసుడిని ప్రేమించకపోవడమే. ఆ చిన్న కారణంతోనే, క్లాస్‌రూం లోకి వెళ్లి ఆమెను నరికి చంపాడు. దీనివల్ల మనోహర్ సాధించిందేమిటి? హంతకుడయ్యాడు.. జైల్లో ఊచలు లెక్కపెడుతున్నాడు.. ఇదేనా అతను కోరుకున్నది..
గుంటూరు జిల్లాలో ప్రసన్నలక్ష్మిదీ ఇదే పరిస్థితి. సుభానీ అనే దుర్మార్గుడు ప్రేమించమంటూ ఆమె వెంటపడ్డాడు. ఒప్పుకోకపోవడంతో క్లాస్‌రూంలో నరికి చంపాడు. అంతేకాదు, వరంగల్‌లో ఇలా ప్రేమోన్మాదుల దాడికి ఏ పాపమూ తెలియని ఓ అమాయకురాలు ప్రాణం కోల్పోయింది. ప్రణీతను ప్రేమించమంటూ వెంటపడ్డ ఓ కుర్రాడు.. చివరకు యాసిడ్‌దాడికి ఒడిగట్టాడు. ఈ దాడిలో ప్రణీత తీవ్రంగా గాయపడగా, ఆమె స్నేహితురాలు స్వప్నిక ప్రాణం కోల్పోయింది. పోనీ, ఈ యాసిడ్ దాడితో వారేమైనా సాధించారా అంటే లేదు.. పోలీసుల ఎన్కౌంటర్లో ప్రాణాలు కోల్పోయారు.
ఈ మధ్య సంచలనం సృష్టించిన కేసు అనూషది. ప్రేమంటూ వేధించిన ఓ రాక్షసుడు చివరకు ఆమె కుటుంబంపై దాడి చేశాడు. అనూష తల్లిదండ్రులను హతమార్చాడు. అనూష గొంతు కోశాడు. అతి చిన్న వయస్సులో ఆమెకు అనంత కష్టాలను తెచ్చిపెట్టాడు. ఆమెకు జీవింతాతం గుర్తుండిపోయే చేదు జ్ఞాపకాలను మిగిల్చాడు.
ఇలా వెలుగులోకి వచ్చిన సంఘటనలు కొన్ని మాత్రమే. మరెంతో మంది ప్రేమోన్మాదులు చేతుల్లో చిక్కి ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘటనలన్నీ చూస్తే ప్రేమంటేనే భయం పుడుతుంది. వాస్తవంగా... ఇలా దాడులకు తెగబడ్డవారు అనుభవించిన శిక్షలు చూస్తే మరెవరూ ఆపని చేయకూడదు. కానీ, దాన్ని పట్టించుకునే స్థితిలో ఎవరూ ఉన్నట్లు కనిపించడంలేదు. అందుకే, వరసగా ఇంకా ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. సినిమాల ప్రభావమో, మోడ్రన్ లైఫ్ ఎఫెక్టో .. ప్రేమ మత్తులో చిక్కుకుంటున్న ఈతరం, దాని వల్ల వచ్చే నష్టాలను మాత్రం గుర్తించడం లేదు. ప్రేమించమని వేధిస్తే ఏమవుతుందో అర్థం చేసుకోవడంలేదు. హత్య చేయాలనుకునే ముందూ తమ భవిష్యత్తు గురించి ఆలోచించడం లేదు. క్షణికావేశంలో నిర్ణయాలు తీసుకొని నేరస్తులుగా మారిపోతున్నారు. తాము ప్రేమించిన వారి కుటుంబాల్లో అంతులేని విషాదాన్ని నింపుతున్నారు.
తల్లిదండ్రులూ జాగ్రత్త!
తల్లిదండ్రులకు ఓ హెచ్చరిక.. మీ పిల్లలను పట్టించుకోకపోతే మీకే నష్టం.. వాళ్లు కాలేజ్కే వెళుతున్నారని భ్రమలో ఉండకండి. క్లాస్‌ల పేరుతో ప్రేమపాఠాలు చెప్పించుకోవడానికి వెళ్లొచ్చు. మీ పిల్లలపై కాస్త నిఘా పెట్టండి. లేదంటే, ఏ ఉన్మాద ప్రేమికుడి చేతిలోనే మీ అమ్మాయి ప్రాణం కోల్పోవచ్చు. మీ అబ్బాయి ఏ అవకాశ వాద ప్రేమికురాలి చేతికో చిక్కి మరణించవచ్చు.. ఎందుకంటే.. ఇప్పుడు మొదలవుతున్న ప్రేమకథల్లో చాలావరకూ ముగిసేది దాదాపుగా ఇంతే. ఇలాంటి సంఘటనలు జరగకూడదంటే, జాగ్రత్తలు తీసుకోవాల్సింది పేరెంట్స్ మాత్రమే. మీరు మీ పిల్లలను ఎలా పెంచుతున్నారన్నదానిపైనే, వారి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.
ఏదైనా కావాలని బలంగా కోరుకున్నప్పుడు అది దక్కకపోతే, ఎంతో వేదన పడాల్సి ఉంటుంది. మానసికస్థితిపై అది తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. ఇటీవలి కాలంలో జరుగుతున్న ఉన్మాద దాడులకు ఇలాంటి మానసికస్థితే కారణం. ఆవేశానికి లోనవుతూ.. విచక్షణను మర్చిపోతూ ఇలాంటి దాడులు చేస్తున్నారు. కానీ, దాని వల్ల తమ భవిష్యత్తులో ఏం కోల్పోవాల్సి వస్తుందో అర్థం చేసుకోలేకపోతున్నారు. ఒకవేళ మీరు ప్రేమలో విఫలమైతే ఒంటరిగా ఉండడానికి ప్రయత్నించకండి. నలుగురిలో ఉండండి. కుటుంబంతో ఎక్కువ సమయం గడపండి. బాధను క్రమంగా మర్చిపోతారు. అంతే తప్ప, దక్కనివారిపై దాడి చేయాలనుకోవద్దు. అది మీ జీవితాన్నే నాశనం చేస్తుంది.
ఇక ఎవరినైనా ప్రేమించమంటే.. వారు కాదన్నారనీ బాధపడవద్దు. ఎందుకంటే వారికీ మనసుంటుంది. వారికీ ఇష్టాఇష్టాలుంటాయి. మీరు నచ్చకపోతే అది వారి లోపం అనుకోండి. అంతే తప్ప, కక్ష తీర్చుకోవాలనుకోవద్దు.
అమ్మాయిలు కూడా ఈ ఫాస్ట్ కల్చర్‌లో చాలా జాగ్రత్తగా ఉండాలి. కాలేజ్‌లో చేరేది చదువుకోవడానికే తప్ప, ప్రేమించుకోవడానికి కాదు. చదువు పూర్తై మంచి ఉద్యోగం దొరికితే ఆ తర్వాత నచ్చినవాడిని ఎంచుకోవడానికి కావల్సినంత సమయం ఉంటుంది. ఫ్రెండ్షిప్ను లవ్షిప్గా మార్చకంరడి. కాలేజ్ ఫ్రెండ్స్ ఎవరైనా ఒంటరిగా రమ్మంటే, వెళ్లేముందు కాస్త ఆలోచించండి. అప్పుడే మీ ప్రాణాలకు సేఫ్టీ. లేదంటే, అదే మీకు చివరి మజిలీ.
పేరెంట్స్ కూడా పిల్లలకు అన్నీ అందిస్తున్నామా లేదా అనే ఆలోచిస్తారు తప్ప.. తమ పిల్లలు ఇంటి బయట ఎలా ఉంటున్నారన్న విషయాన్ని గుర్తించరు. చేస్తే అతి గారాభం.. లేదంటే కఠిన దండన. ఈ రెండూ సరికాదు. వారి మనస్సును తెలుసుకుంటూ, జాగ్రత్తలు తీసుకోవాలి. చదువుకునే సమయంలో వీలైనంతవరకూ ఒంటరిగా వదలకండి. మీతో పాటే ఉంచుకోవడమే మేలు. పిల్లల నుంచి పెద్దల దాకా అంతా కలిసికట్టుగా కదిలితే తప్ప.. ఇలాంటి దారుణాలకు అడ్డుకట్ట పడదు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
mee post baagundi... one sided ga lekunda undi.. its very much correct that everybody should realise the seriousness of the issue and take steps to curb it.. parents.. girls and boys.. everybody!
parents should keep an eye on their children when they go out.. and children too realise the importance of studies and career...
prema ki pelli ki time chala undi... eh time lo cheyyavalasindi aa time lo cheyyali...
and young age is not for love.. its for studies and shaping their career...
రాధ గారూ..
చాలా బాగా చెప్పారు. కానీ, ఈ పోస్ట్ రాసిన తర్వాత కూడా ఇదే తరహాలో వైజాగ్‌లో ఓ కుర్రాడు తనను ప్రేమించడంలేదన్న కోపంతో ఓ అమ్మాయి గొంతు కోశాడు. నిజంగా ఇలాంటి సంఘటనలు చూస్తుంటే గుండె కదిలిపోతోంది. ఇంత మూర్ఖంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారో అర్థం కావడం లేదు..
mee post ni chaduvu thunta naku 4yrs back tv9 lo telecst ayina o news gurthosthundi..vizag loni o internet cafe lo collegestudents{oka ammai oka abbai}rasaleelalu perutho o news telecate ayindi..appatlo au vartha sanchalanam create chesindi.intlo papayilala unde pillalu, gadapa datithe ela untaro andariki kallaku kattinattu chupinchindi au news.. but appatlo a parent kuda au news ni sahinchaleka poyaru..evariki varu tama pillalu bangaram ani sardicheppukunnaru..ontariga oka ammai, abbai room ki velle stayiki edigipoyarani parents grahinchalekapotunnaru..aina ikkada tappu parents di kadu.. tamani taamu control chesukolekapothunna youth di..evariki varu oka geetha geesukovali.elanti situation lonu danni cross cheyakudadu..appude prema aina jeevitham aina nilabaduthundi..
బాగా వ్రాసారు బాస్. నేను కూడా నా బ్లాగు: http://dare2questionnow.blogspot.com/ లో "పిచ్చి తల్లులూ..... ఆవేదన, ఆక్రోశం కాదు. అప్రమత్తత అవసరం." అనే శీర్షికతో ఇదే టైపు ఒక టపా వ్రాసాను. వీలైతే ఓ లుక్కెయ్యండి.