ఆడోళ్లకే కష్టాలన్నీ అనే మాటలు ఎన్నో విన్న నాకు.. అంత త్వరగా కష్టాలు వచ్చి పడతాయని అనుకోలేదు. కష్టాలంటే.. ఇవేవో ఆర్థికబాధలో.. శారీరక బాధలో.. లేక కుటుంబ బాధలో కాదు.. మానసిక బాధలు. మగాడిగా పుట్టినందుకు.. పెరిగే వయస్సును కంట్రోల్ చేయలేం కదా.. అలాగే నాకూ వయస్సు పెరుగుతూ వచ్చింది. కనపడ్డ పెద్దవాళ్లందరినీ అంకుల్ అని పిలవడం నాకు చిన్నప్పటినుంచీ ఉన్న అలవాటు. అయితే.. ఈ అంకుల్ పదమే నన్ను మానసికంగా వేదనకు గురిచేస్తందన్న విషయం అనుభవంలోకి వచ్చాక గానీ బోధపడలేదు. విద్యార్థి దశ నుంచి ఉద్యోగి దశలోకి వచ్చే కీలక సమయంలో వచ్చిన పెనుమార్పులు ఎన్నో ఉంటాయి. అప్పటివరకూ అల్లరి చిల్లరగా తిరిగిన మనం కొత్తగా బాధ్యతలు నెత్తిన వేసుకొని.. బతుకుబండిని లాగడానికి ఎన్నో పాట్లు పడుతుంటాం. నాదీ అదే పరిస్థితి. అయితే.. ఇదే సమయంలో మనకు పెరుగుతున్న వయస్సు విషయాన్ని మాత్రం పట్టించుకోం. ముఖ్యంగా 21 నుంచి 28 మధ్య ప్రతీ ఏడాది మనకు వయస్సు విషయంలో ఒకేలా ఉంటుంది. ఈ సోది అంతా ఎందుకు గానీ.. అసలు విషయంలోకి వచ్చేస్తా…
అంకుల్ అన్న పదం నన్ను బాధపెట్టిందని చెప్పాను కదా.. అప్పటిదాకా.. అన్నయ్యా, తమ్ముడు.. నాని… అన్న పిలుపులే విన్న నాకు.. ఓ రోజు సడన్షాక్ తగిలింది. ఉదయాన్నో ఓ ఎగ్జిక్యూటివ్ బ్యాగ్ భుజాన తగిలించుకుని.. వీర లెవల్లో ఉద్యోగం వెలగబెట్టడానికి ఆఫీస్‌కు బయల్దేరా. నేను ఉద్యోగంలోకి చేరి అప్పటికి మూడేళ్లు. నాతోటి వాళ్లంతా ఇంకా ఎంబీఏలు, ఎంసీలు చేస్తున్న సమయమది. కొంతమంది నాలానే చిన్నా చితకా జాబ్లూ చేస్తున్నారనుకోండి. ఆరోజు అలా రోడ్డుమీద నేను వెళుతుండగానే.. ఓ అమ్మాయి స్కూటీపై వేగంగా వచ్చి నాపక్కన ఆగింది. బహుశా టెన్త్గానీ, ఇంటర్ గానీ చదువుతుండొచ్చు. నేను ఆ అమ్మాయిని చూసేలోగానే.. ఆమె నోటినుంచి తూటాల్లాంటి మాటలు దూసుకొచ్చాయి.. “అంకుల్ ఎస్.ఆర్.నగర్‌కు ఎలా వెళ్లాలి?” అంటూ.. నన్ను అంకుల్ అంటుందేమిటిరా… అనుకునేలోపే.. మళ్లీ అదే మాట అడిగింది. ఇక చేసేదేముంది.. దారి చూపించా… ఇది మొదటిసారి. ఆరోజే కాదు.. ఈరోజుకీ నేను ఆ సంఘటన తలుచుకున్నప్పుడల్లా తెగ ఫీలవుతుంటా.. అప్పుడే అంకుల్ని అయిపోయానా అని…
ఇక రెండోది. ఇది జరిగిన దాదాపు ఆరునెలల కనుకుంటా… సిటీబస్సెక్కి ఆఫీసుకు బయల్దేరా.. హైదరాబాద్ సిటీ బస్ అంటే తెలిసిందే కదా.. చాలా రష్‌గా ఉంది. నిలబడ్డా.. చివరిగా ఉండే పొడవైన సీటులో కాలేజీ స్టూడెంట్లు చాలామంది కూర్చున్నారు. వారిలో దాదాపుగా అందరికీ మీసాలు,గడ్డాలు కూడా మొలిశాయి. వాళ్లలో ఒకడు సడన్‌గా నన్నడిగాడు.. “అంకుల్, టైం ఎంత?” ఇక చూసుకోండి నాకు ఒళ్లు కాలిపోయింది. కానీ వాడిని ఏమీ అనలేక టైం మాత్రం చెప్పి మొఖం వెనక్కి తిప్పుకున్నా…
ఇక్కడినుంచి మొదలు.. ఈ అంకుల్ అన్న పదం నన్ను ఎక్కడోచోట ఏదోరకంగా ఏడిపిస్తూనే ఉంది. ఓ వైపు.. వయస్సు మెళ్లగా ముదురుతోందని తెలుసు.. అయినా.. నాలో ఇప్పటికీ స్టూడెంట్ లక్షణాలు పోలేదు. ఇదిలా ఉంటే.. నాకు పెళ్లి కూడా కొంతకాలం క్రితమే అయ్యింది. బ్యాచ్‌లర్ జీవితం నుంచి ఫ్యామిలీ జీవితానికి మార్పు వచ్చింది. ఇంట్లోకి ఉదయాన్నే పాలు తేవడం నా డ్యూటీనే. పాల కౌంటర్ దగ్గర ఓ కుర్రాడుంటాడు. పద్దెనిమిది, పంతొమ్మిదేళ్ల వయస్సుండొచ్చు. మొదటి రెండు రోజులుగా బాగానే ఉన్నా.. మూడో రోజు వెళ్లేసరికి.. అంకుల్ ఎన్ని కావాలంటూ.. అడిగేశాడు.. మళ్లీ అప్సెట్. వీడుకూడా అంకుల్ అని పిలిచేశేడేంటా అని… ఏదో చిన్నచిన్న పిల్లలు పిలిస్తే పెద్దగా పట్టించుకోనక్కరలేదు కానీ.. మరీ.. పద్దెనిమిదేళ్లు దాటిన వాళ్లూ.. అంకుల్ అని పిలుస్తుంటేనే కాస్త బాధగా ఉంటోంది. ఈ పాలబూత్ కుర్రాడు రోజు అంకుల్ అని పిలవడం కామన్ అయిపోయింది. ఇక ఏం చేస్తాం.. నేనూ ఆ పిలుపుకు క్రమంగా అలవాటు పడుతున్నాను. మగాడిగా పుట్టాక.. ఈ మాత్రం కష్టాలు తప్పవు కదా…
26, జులై 2010, సోమవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ayyo... ninnu uncle annadi evaru tammudu....
కామెడి, నాకు 15 ఏల్ల వయసునుంచే జనాల చేత అంకుల్ అని పిలిపించుకోవటం అలవాటు ఐపోయింది, పక్కింటోల్లు, ఎదిరింటోల్లు, తమ పిల్లల్ని నా కన్న చిన్న వాళ్ళుగా చెప్పుకోవాలని అంకుల్ అని అలవాటు చేసారు, లైట్ తీసుకోండి
మీరు అనవసరంగా బాధపడుతున్నారు. ఈ రోజుల్లో అందరూ అందరినీ అంకుల్, ఆంటీ అనే పిలుస్తున్నారు. పిల్లలు ఆఖరికి కూరగాయలబండివాడిని కూడా కూరగాయల అంకుల్ అంటున్నారు. వయసుకి, దానికి సంబంధం లేదు. అది ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. సో, డోంట్ వర్రీ...బీ హేపీ...
అంతగా పట్టించుకోనక్కర లేదు. వయసుతో సంబంధం లేకుండా పిలిచేస్తుంటారు కొందరు :)
హ హా ! నాకు ఆంటీ కన్నా ఎవరన్నా 'అక్కా !' అని వరస పెట్టి పిలిస్తే చికాకు. ఎందుకో చెప్పలేను. ముఖ్యంగా చదువుకునే రోజుల్లో, కాలేజీ లోనూ, ట్యూషన్లలోనూ - చాలా కోపం వచ్చేది. అదృష్టవశాత్తూ, ఇప్పుడు ఆంటీ అంటున్నారు అనిపిస్తుంది.
ఎవరన్నా 'అక్కా !' అని వరస పెట్టి పిలిస్తే చికాకు. ఎందుకో చెప్పలేను
____________________________________
అందుకే నేను అందరితో చెప్తూ ఉంటా - ఆడవాళ్ళని ఎప్పుడూ అక్కా అని పిలవద్దు, చెల్లాయ్ అని పిలవమని
హాయ్ అంకుల్!
మా మేనకోడలు తన చిన్నప్పుడు, దొడ్లు కదగడానికి వచ్చిన ఆవిణ్ణి "దొడ్లాంటీ వచ్చింది" అనీ, రాత్రి మాదాకోళం కి వచ్చే ముష్టాణ్ణి "ముష్టంకుల్ వచ్చాడు" అనీ అంటే, చక్కగా నవ్వుకొనేవాళ్లం!
మన సంస్కృతి యెంత గొప్పదో కదా!
హ హ సుజాత గారు చెప్పినట్టు నాకూ అక్కా అని పిలిస్తే చిరాకుగా ఉండేది.మా జూనియర్లకి చెప్పేదాన్ని మర్యాద మాటల్లో ఉంటే చాలు అక్కా తొక్కా అని పిలవక్కర్లేదు అని. కానీ నాకు ఆంటీ అని పిలిచినా చిరాకే. ఇప్పుడు చిన్నచీతకా,ముసలిముతకా అందరూ అంటీలే, అంకుల్సే. నాకన్నా ఓ పదిహేనేళ్ళు పెద్ద అయిన వాళ్ళు కూడా నన్ను ఆంటీ అని పిలిచారు.ఇలాంటి అనుభవం అందరికీ అవుతుందిలెండి. సో డొంట్ వర్రీ, బీ హేపీ టు బి ఏన్ అంకుల్.
హేమిటో ఈ అంకుల్ బాగా ఇచిత్రంగా వున్నాడు కదా సుజాతక్కయ్యా, సౌమ్య అక్కయ్యా ?
బాబూ తమ్ముళ్ళూ, అన్నయ్యలూ, కాస్త ఆడాళ్ళ కష్టాలు కూడా చూడాలమ్మా! ఏదీ ఈ కింది లింకు ఒకసారి చూడండమ్మా చిట్టి తమ్ముళ్ళూ!
http://manishi-manasulomaata.blogspot.com/2008/06/blog-post_26.html
@కృష్ణశ్రీ..
ఏమండీ.. మీ ఫొటో చూస్తుంటే.. మీరే మాకు తాతయ్యలా ఉన్నారు.. అసలే అంతా అంకుల్ అంటున్నారని కలవరపడుతుంటే.. మీరు కూడా అంకుల్ అంటే నేనేమైపోను...
వా..వా..వా..వా..
@krishna
ఏంటకుల్.. అనకుండానే అనేసినట్టున్నావ్.. నీకు అనుభవముందా ఏమిటి
@ సత్యం
హహ్హహహ్హ.. అనుభవమా ? దానిని మాన భంగం అనాలేమో? దీని మీద నేను కూడా ఒక టపా రాస్తాను లెండీ. మన బాడీ తో పడ్డ కష్టాలు అన్ని ఇన్ని కావు!
nenu konchem ituvantide post veddamani anukunnanu repu veddamle ani baddakinchanu. naku matram reverse. na age ni evvaru sarigga gurthincharu ani benga naku, mikemo reverse. em cheddam :(
ఇంగ్లీష్ మీడియం చదువులు ఇంతె నండి
ప్రపంచంలొ ఉన్న మగాళ్ళు అందరు అంకుల్స్
ప్రపంచంలొ ఉన్న ఆడొళ్లందరు ఆంటీస్
తప్పదు ! అనుభవించాల్సిందె !
దయచేసి ఇలా పిలిచేవాళ్ళకి అందరు చెప్పండి
తరువాత వాళ్లైన సేవ్ అవుతారు . కృతఘ్నతలు.