6, ఏప్రిల్ 2010, మంగళవారం
సానియా స్టోరీలో మరో ఇద్దరు...
Categories :
షోయబ్.. ఆయేషా వ్యవహారం అనూహ్య మలుపులు తిరుగుతోంది. ఆయేషా ఆరోపణలను సమాధానం ఇస్తానని... అయితే.. ముందు ఆమె మీడియా ముందుకు రావాలని సవాల్ విసిరాడు. అంతేకాదు.. మరో రెండు క్యారెక్టర్లూ.. ఈ స్టోరీలోకి కొత్తగా ప్రవేశించాయి. అంతేకాదు.. షోయబ్ మాటలు మరో గందరగోళాన్ని సృష్టించాయి. మొత్తం వ్యవహారాన్ని చూస్తుంటే.. ఆయేషాను బయటకు రప్పించడానికే.. షోయబ్ గాలం వేస్తున్నట్లు కనిపిస్తోంది.
ఆయేషా చేసిన ఆరోపణలకు.. మీడియాకు సమాధానం ఇచ్చాడు మాలిక్. ప్రతీ ప్రశ్నకూ సమాధానం చెబుతాన్న మాలిక్.. ఆయేషాను కార్నర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. ఆయేషా ఎవరో.. మహా ఎవరో ముందు తేలాలన్నాడు. హైదరాబాద్ వచ్చినప్పుడల్లా.. మహా అపాతోనే తిరిగానే తప్ప.. ఆయేషాను ఇంతవరకూ చూసిందే లేదన్నాడు. అపా అంటే అక్క అని అర్థం. మహాను అక్కా అని పిలిచేవాడినన్న షోయబ్.. ఆమెతో తనకు వివాహబంధం లేదని చెప్పడానికి ట్రై చేశాడు.
తనకు వేరొకరి ఫోటోలు పంపించి.. నిఖా మరొకరితో జరిపించారన్నది షోయబ్ ముందు నుంచీ చేస్తున్న ఆరోపణ. మరి ఆ ఫోటోలు ఏమయ్యాయి? దీనికీ.. షోయబ్ మీడియాకు సమాధానమిచ్చాడు. ఆమెకు పెళ్లైపోయినందున.. ఆ ఫొటోలు బయటపెట్టనన్నాడు. అసలు ఆయేషా అని చెప్పుకుంటున్న మహిళ ఎవరో బయటకు రావాలని డిమాండ్ చేశాడు. ఇంట్లో కూర్చుని ఆరోపణలు చేయడం మాని.. ధైర్యం ఉంటే మీడియా ముందుకు రావాలంటూ సవాల్ విసిరాడు. అప్పుడే తనకూ ఈ విషయంలో క్లారిటీ వస్తుందన్నాడు.
ఇక ఈ కేసుకు మరో ట్విస్ట్ ఇస్తూ.. రీమా, మోనాలు ఏమయ్యారంటూ ప్రశ్నించాడు. వీరిద్దరూ ఎవరన్నది మాత్రం సస్పెన్స్‌లో పెట్టాడు. మహాతో పాటే వీరిద్దరూ ఉండేవారంటూ ప్రస్తావించాడే తప్ప పూర్తి వివరాలు మాత్రం బయటపెట్టలేదు. వీరిగురించి తెలిస్తే తప్ప.. మోసం చేసింది ఎవరన్నది తెలియకపోవచ్చు.
అయితే.. ఈ మొత్తం వివాదంతో సానియా మీర్జా బాగా టెన్షన్ పడినట్లు కనిపిస్తోంది. అప్సెట్ అయ్యానని ఒప్పుకున్న సానియా.. పెళ్లి మాత్రం యధావిధంగా ఏప్రిల్ 15నే జరుగుతుందని ప్రకటించింది.
కొత్త క్యారెక్టర్లెవరో.. షోయబ్-ఆయేషా విషయంలో వారి పాత్ర ఏమిటో ఇప్పుడు బయటపడాల్సి ఉంది. మరోవైపు.. నిఖానామాలో షోయబ్ సంతకం ఫోర్జరీనా కాదా అన్నదీ తేలాల్సి ఉంది. షోయబ్, ఆయేషా కలిసి ఉన్న ఫోటోలు నిజమా కాదా.. అన్నది బయటపడాలి. అప్పుడే.. ఈ వివాదం పరిష్కారం అవుతుంది. సానియా పెళ్లి కథ సుఖాంతమవుతుంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి