3, ఏప్రిల్ 2010, శనివారం
సానియాకు సవతుల పోరు..
సానియా ఏంటి.. సవతుల పోరేంటి అనుకుంటున్నారు. అసలు పెళ్లే కాకుండా సవతులు ఎలా వచ్చారనుకుంటున్నారు. అదంతా... సానియా వలచి వరిస్తున్న వరుడు.. షోయబ్ మాలిక్ ప్రేమ మహత్యం. కనపడ్డ ప్రతీ అమ్మాయితో లవ్ ఎఫైర్‌లు సాగించిన షోయబ్ మాలిక్.. సానియాకు పెద్ద చిక్కే తెచ్చిపెట్టాడు. హైదరాబాద్‌కు చెందిన ఆయేషా మాత్రమే కాదు.. మరో ఇద్దరు ముగ్గురూ.. షోయబ్ ఖాతాలో ఉన్నట్లు తెలుస్తోంది... మొత్తం స్టోరీ చదవితే ... మ్యాటర్ మీకే అర్థమవుతుంది..
షోయబ్ మాలిక్‌కు పెళ్లయ్యిందా...?
మాలిక్ భార్య హైదరాబాదీ అమ్మాయి ఆయేషానేనా?
మొదటి భార్యకు విడాకులివ్వకుండానే.. రెండోపెళ్లికి మాలిక్ సిద్దమయ్యాడా?
షోయబ్‌కు సానియా రెండో భార్య అవుతుందా..?
అందరినీ వెంటాడుతున్న ప్రశ్నలివి. హైదరాబాదీ అమ్మాయి ఆయేషాకు తనకూ పెళ్లే కాలేదని ఇటీవలి కాలంలో తరచుగా చెబుతున్నాడు.. షోయబ్ మాలిక్. కానీ.. కొంతకాలం క్రితం తన భార్యది హైదరాబాదే అంటూ.. కొన్ని ఇంటర్వ్యూలలో చెప్పిన సంగతిని మరిచిపోతున్నాడు. 2004 సెప్టెంబర్ 25న షోయబ్ మాలిక్ ఓ టీవీకి ఇంటర్వూ ఇచ్చాడు. అందులో.. తన పర్సనల్ లైఫ్‌కు సంబంధించిన వివరాలు బయటపెట్టాడు.. ఆయేషా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్లు... తనది హైదరాబాద్ అని చెప్పాడు.
ఇంతటితోనే ఆగలేదు.. మార్చి 30, 2005న హైదరాబాద్‌లో ఇండియా (ఎ) కు పాకిస్తాన్‌కు మధ్య క్రికెట్ మ్యాచ్ జరిగింది. ఇందులో ఆల్‌రౌండర్ ప్రతిభ కనబరిచిన షోయబ్ మాలిక్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అప్పుడు మరోసారి హైదరాబాద్ పైన.. తన భార్య ఆయేషా పైనా మరోసారి ప్రేమను కురిపించాడు.. మాలిక్. తన భార్య ఉండే సిటీలో అవార్డు దక్కించుకోవడం ఆనందంగా ఉందన్నాడు.
షోయబ్ మాలిక్ మాటలను బట్టి చూస్తే.. హైదరాబాదీ అమ్మాయి ఆయేషాతో ఎప్పుడో పెళ్లి అయిపోయిందన్న విషయం అర్థమవుతుంది. కానీ.. ఇలా అవకాశం వచ్చినప్పుడల్లా.. ఆయేషా తన భార్యేనని చెప్పిన షోయబ్ మాలిక్.. హైదరాబాద్ టూర్లో భాగంగానే... తన టీం మెంబర్లందరినీ తీసుకొని.. అత్తగారింటికి విందుకు కూడా వెళ్లాడు. అక్కడ చాలా సేపు ఉండి సందడి చేశాడు. అయితే.. క్రమంగా షోయబ్ మాలిక్ మాట మారిపోవడం మొదలయ్యింది. తన భార్య పేరు ఆయేషా అని చెప్పిన షోయబ్ మాలిక్... చివరకు.. ఆయేషా ఎవరో తనకు తెలియదని బుకాయించడం మొదలుపెట్టాడు. ఆయేషాకు దూరంగా ఉంటూ వచ్చిన మాలిక్.. చివరకు తనకు పెళ్లే కాలేదన్నాడు. ఇప్పుడు మరో హైదరాబాదీ అమ్మాయి సానియాతో నిఖాకు సిద్ధమైపోయాడు.
ఆయేషా - షోయబ్‌ల పెళ్లి జరిగిందా..?
హైదరాబాద్‌లో తన భార్యగా చెప్పుకుంటున్న ఆయేషా... తనకు తెలిసిన ఆయేషా కాదని వాదిస్తున్నాడు షోయబ్ మాలిక్. దానికి చూపుతున్న కారణం.. ఆయేషా పాస్‌పోర్ట్‌లో మహా సిద్ధిఖీ అని పేరుండడమే. కానీ వాస్తవం మాత్రం వేరు.. ఆయేషా అసలు పేరు మహా సిద్ధిఖీ. ఇంట్లో ముద్దుగా ఆయేషా అని పిలుస్తుంటారు. ఆ పేరుతోనే.. షోయబ్‌కు ఆమె పరిచయం అయ్యింది. ఇద్దరూ తొలిసారి 2000 సంవత్సరంలో దుబాయ్‌లో కలుసుకున్నారు. అప్పటి నుంచి తరచుగా ఫోన్లలో మాట్లాడుకుంటూ.. పరిచయం పెంచుకున్నారు. అదికాస్తా ప్రేమగా మారడంతో.. పెళ్లి కూడా చేసుకున్నారు. ఈ పెళ్లి ఫోన్ ద్వారా జరిగింది. జూన్ 03, 2002న నిఖా అయ్యింది. దీనికి సంబంధించి నిఖానామా కూడా పాకిస్తాన్‌లోని సియాల్ కోటలో రిజిస్టర్ అయ్యింది. అక్కడి ఖాజీనే ఈ వివాహాన్ని జరిపించాడు. ఇరు పక్షాల అంగీకారం తర్వాత.. పెళ్లి జరిగిందని నిఖానామాలో రాశారు... షోయబ్ మాలిక్- మహా సిద్దిఖీల పేర్లు ఇందులో స్పష్టంగా ఉన్నాయి. పెళ్లి సమయంలో ఇచ్చే మెహర్‌గా 500 రూపాయలను షోయబ్ ఆయేషాకు ఇచ్చాడు. సంతకాల కోసం.. ఈ నిఖానామాను ఆయేషా దగ్గరకి పంపించాడు. ఇందులో షోయబ్ మాలిక్ సంతకం కూడా ఉంది. దీన్ని రిజిస్టర్ చేయడానికి 180 రూపాయలు చెల్లించినట్లు కూడా ఈ నిఖానామాలో ఉంది. షోయబ్ మాలిక్‌కు మహా సిద్ధిఖీకి నిఖా జరిగిందని చెప్పడానికి ఇదే ప్రధాన సాక్ష్యం.
మౌనం వీడిన ఆయేషా..
సానియా పెళ్లి వ్యవహారంతోనే.. ఆయేషా వివాదం తెరపైకి రాలేదు. 2007 నుంచి తనను భార్యగా అంగీకరించడం లేదంటూ ఆయేషా పోరాడుతోంది. వీరిద్దరి మధ్యా వివాదం చెలరేగుతున్నా.. ఎప్పుడూ ఆమె పెదవి విప్పలేదు. మౌనంగానే ఉన్నారు. ఇప్పటికీ.. తనను భార్యగా అంగీకరించకపోవడంతో.. చివరకు ఆ మౌనాన్ని ఆయేషా వీడారు. పెళ్లికి సంబంధించిన ఆధారాలు బయటపెట్టడమే కాదు.. పబ్లిక్‌లో తనకు తలాక్ చెప్పాలనీ డిమాండ్ చేశారు. మాలిక్‌కు.. ఆయేషాకు మధ్య పరిచయం.. పెళ్లి.. వివాదానికి సంబంధించిన మాటలను ఆమె మాటల్లో.. (టైమ్స్ నౌ ఛానల్‌కు శుక్రవారం ఆమె ఇచ్చిన ఫోన్ ఇన్‌లో ముఖ్యభాగం)
" మా ఇద్దరికీ పెళ్లి జరగలేదని షోయబ్ బావ అన్నట్లు ఓ ఛానల్‌లో చూశాను. కానీ, వాస్తవంగా.. మా పెళ్లి జరిగినట్లు షోయబే స్వయంగా ఒప్పుకున్నాడు. అతని భార్యను మాత్రమే కాదు.. నిఖా కూడా జరిగింది. ఈ ప్రపంచానికి సాక్ష్యాలుగా చూపించడానికి పేపర్లు కూడా ఉన్నాయి. నా దగ్గర నిఖా పేపర్లున్నాయి. ఇరు వైపులా సాక్షులు కూడా ఉన్నారు. సియాల్‌కోట్ కోర్టు మ్యారేజ్ బ్యూరోలో పేపర్లు రిజిస్టర్ చేస్తానని నాతో చెప్పాడు. కానీ అలా చేయలేదు.
ఎవర్నీ కలవకూడదని నన్ను కట్టడి చేశాడు. ఓ సారి నువ్వు బరువు తగ్గితే.. 58 కేజీలకు వస్తే.. చూడడానికి బాగుంటావన్నాడు. నేనెలా ఉంటానో తెలిసిపోతుందని... ఇతర క్రికెటర్లతో కూడా నన్ను మాట్లాడవద్దని చెప్పాడు.
దుబాయ్‌లో 2000 సంవత్సరంలో మేం కలిశాం. ఇది ఇంటర్నెట్ ద్వారా జరిగిన పరిచయం కానే కాదు. అతను ఏమనుకుంటున్నాడో తెలియదు. నా బరువు వల్లే సమస్య అనుకుంటా.
సానియా మేలు కోరుకుంటున్నా. హైదరాబాద్‌లో ఆమెకు నేను అతిపెద్ద ఫ్యాన్‌ను. తనకు నేనేమీ వ్యతిరేకం కాదు. ఇప్పటికే నేనెంతో మానసిక వేదన అనుభవించాను. ఇంకా భరించే ఓపిక లేదు. నాకు డైవోర్స్ కావాలి. మీ పెళ్లయ్యిందా.. అని అనుమానంగా అడిగే పరిస్థితి నాకు మళ్లీ రాకూడదు."
షోయబ్ రాసలీలలు
మన దేశానికి చెందిన బాలీవుడ్ తారలతో.. ఎన్నో ఎపైర్లు నడిపాడు షోయబ్ మాలిక్. మాజీ మిస్ ఇండియా సయాలీ భగత్‌తో చాలా కాలం ప్రేమాయణం సాగించాడు. ఆల్రెడీ ఆయేషాను పెళ్లి చేసుకున్న మాలిక్... సైలెంట్ సానియానూ బుట్టలో వేసుకున్నాడు. వీరు మాత్రమే కాకుండా.. మరో అమ్మాయి కూడా షోయబ్ జీవితంలో ఉందంటూ.. తాజాగా పాకిస్తాన్ ఛానల్ ఒకటి ప్రకటించింది. అంబర్ అనే ఈ
అమ్మాయితో షోయబ్‌కు చాలాకాలంగా సంబంధం ఉందని తెలిపింది. ఆమె షోయబ్ కుటుంబానికి దగ్గరి బంధువని ..... దుబాయ్‌లో ఉంటుందని ఛానెల్ వెల్లడించింది. ఇద్దరూ పెళ్లి చేసుకుందామని భావించారని ..... ఇందుకు మాలిక్ కుటంబం కూడా అంగీకరించదని సమాచారం. సానియాతో ఎంగేజ్‌మెంట్ తర్వాత కూడా ఇద్దరి మధ్య ఫ్రెండ్‌షిప్ కొనసాగుతోందని... వీరి వ్యవహారం ఆయేషాకు కూడా తెలుసని పేర్కొంది.
సానియాకు అవసరమా?
వంద కోట్ల జనాభా.. సానియా అంటే పిచ్చ అభిమానం. దేశంలో ఎంతలేదన్న 15 కోట్ల మందికి పైగా ముస్లింలు ఉన్నారు. వీరిలో కనీసం కోటి మంది ఉన్నత వర్గాల వారే. వీరిలో ఒక్కరూ సోనియాకు నచ్చలేదు. పోయి పోయి.. పాకిస్తాన్ వ్యక్తిని చేసుకొంటోంది. పాక్ అబ్బాయిని చేసుకోవడం తప్పనడం లేదు. కానీ.. అమ్మాయిలతో ఎఫైర్లు పెట్టుకున్న వ్యక్తిని.. అందులోనూ ఓ హైదరాబాదీ అమ్మాయిని మోసం చేసిన వాడినా సానియా పెళ్లి చేసుకోవడం. ఈ వ్యవహారం ఎక్కడిదాకా దారితీస్తుందో తెలియదు కానీ.. షోయబ్ మాలిక్ సానియాతో అన్నా ఆగుతాడా అంటే... అదీ డౌట్‌గానే కనిపిస్తోంది. ముస్లిం లా ప్రకారం... నలుగురిని చేసుకునే అవకాశం ఉండడంతో.. సానియా తర్వాత మరో ఇద్దరిని మాలిక్ పెళ్లి చేసుకున్నా ఆశ్చర్య పోనక్కరలేదు. ప్రస్తుతం ఆయేషా నిఖానామా బయటపడడంతో.. షోయబ్ మాలిక్‌కు సానియా రెండోపెళ్లామే అవుతుంది. ఇంత బతుకూ బతికి.. రెండో భార్యగా సెటిల్ అవ్వడం అంటే.. కాస్త సిగ్గుచేటే.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
అది ఇస్లాం మతం యొక్క లోపం. ఆ మతం ప్రకారం ఒక పురుషుడు నలుగురు స్త్రీలని పెళ్ళి చేసుకోవచ్చు, ఎంత మంది ఉంపుడుగత్తెలనైనా ఉంచుకోవచ్చు. అందుకే సానియా బలయ్యింది.
Let her marry whom ever she wants. Why are you worried?
You feel for not been consulted before? oh!
స్వకృతాపారాధ౦ ఇక ఆమె కర్మ..
@అజ్ఞాత: అదెం కుదరదు. ఆ "పిల్ల" తెలిసో తెలీకో పొరపాటు చేస్తోంది. కాబట్టి ఆ "పిల్ల"ను ఉధ్ధరించడం మన గురుతర బాధ్యత.