13, ఏప్రిల్ 2010, మంగళవారం
హమ్మయ్య పెళ్లయ్యింది
మన దేశంలో మాత్రమే కాదు.. పొరుగునున్న పాకిస్తాన్‌తో పాటు.. ప్రపంచంలోని ఎన్నో దేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఓ పెళ్లి ఎట్టకేలకు జరిగింది. పెళ్లి కొడుకు.. పెళ్లి కూతర్లకే కాదు.. ఇప్పుడు మీడియాకు.. టీవీలకు అతుక్కుని చూస్తున్న ప్రేక్షకులకు కూడా ఎంతో రిలీఫ్. అవుతుందా... లేదా అంటూ సస్పెన్స్ థ్రిల్లర్ డైలీ సీరియల్‌గా సాగిన ఆ స్టోరీకి.. ఇప్పుడు శుభం కార్డు పడింది..
ఇక పెళ్లి కథలోకి వెళితే..
వధువు.. సానియా మీర్జా..
వయస్సు.. 23 సంవత్సరాలు..
బ్యాక్‌గ్రౌండ్.. భారత నెంబర్‌వన్ ఉమెన్ టెన్నిస్ ప్లేయర్..
సింగిల్స్‌లో 1 WTA టైటిల్‌ను, డబుల్స్‌లో 8 WTA టైటిల్స్‌ను, మిక్స్డ్ డబుల్స్‌లో ఆస్ట్రేలియన్ ఓపెన్‌ను గెలుచుకున్న ఏకైక ఇండియన్ ఉమెన్ ప్లేయర్..
2003లో కెరీర్ మొదలుపెట్టి.. అతితక్కువ సమయంలోనే భారత అత్యున్నత పురస్కారాలను దక్కించుకున్న టెన్నిస్ సంచలనం సానియా మీర్జా. ఆమె ప్రతిభకు 2004లో అర్జున అవార్డు, 2006లో పద్మశ్రీ అవార్డు వరించాయి. ఇలా ఎన్నో రికార్డులు సృష్టించిన సానియా.. అటు ఆటతోనూ.. ఇటు అందంతోనూ.. దేశవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకొంది.
ఇండియా మొత్తంమీద చూస్తే... బాలీవుడ్ తారలకు సరిసమానంగా క్రేజ్ ఉన్న ఏకైక స్పోర్ట్స్ ఉమెన్.. సానియామీర్జా. చేసుకుంటే సానియానే పెళ్లి చేసుకోవాలని కలలు కన్నవారు ఎంతోమంది. ఏడాదిన్నర క్రితం నిఖా జరిగినప్పుడే.. కొంతమంది హైదరాబాద్ వచ్చి మరీ నానా హడావిడి చేశారు. అయితే... చైల్డ్‌హుడ్ ఫ్రెండ్ షోహ్రబ్తో నిశ్చితార్థాన్ని పెళ్లిదాకా రానివ్వకుండా రద్దు చేయించిన సానియా, తన హృదయాన్ని మాత్రం పాక్ క్రికెటర్‌కు ఇచ్చేసింది.
ఇక వరుడు మరెవెరో కాదు.. పాకిస్తాన్ క్రికెటర్ ప్లేయర్ షోయబ్ మాలిక్. వయస్సు.. 28 ఏళ్లు. ఈ పాక్ ప్లేయర్‌కు కూడా క్రేజ్ ఎక్కువగానే ఉంది. చూడడానికి స్మార్ట్‌గా కనిపించే షోయబ్.. క్రికెట్ కూడా అంతే స్మార్ట్‌గా ఆడతాడు. అతి తక్కువ కాలంలో.. పాక్ టీంలో కీలక ప్లేయర్‌గా అవతరించాడు. 1999లో టీం లోకి వచ్చిన షోయబ్.. 2007 నాటికల్లా కెప్టెన్సీ ఛాన్స్‌ను అందిపుచ్చుకున్నాడు. అంటే.. పాతికేళ్లకే పాక్ క్రికెట్ పగ్గాలను చేపట్టాడు. ఓ మ్యాచ్‌లో షోయబ్ పెర్ఫామెన్స్ చూసిన సానియా మీర్జా.. అతని ఫ్యాన్ అయిపోయింది. ఇద్దరిమధ్యా మొదలైన దోస్తానా కాస్తా.. లవ్గేమ్గా మారింది. చివరకు షాదీగా సుఖాంతమయ్యింది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
మీ గుండెలమీద కుంపటి దించుకున్నారు, బరువు భాధ్యతలు తీరినయ్
ఇక తకతై తలాక్..తలాక్.. తలాక్! ఎప్పుడో..
పెళ్ళి జరగడం తో శుభం కార్డ్ పడిందనుకున్నారా?అసలు కధ ఇప్పుడే మొదలవుతుంది సార్..