ఆ నలుగురూ.. ఆ నలుగురూ.. చిత్రసీమలో ఎక్కడ విన్నా ఆ నలుగురి మాటే.. ఆ నాలుగు కుటుంబాల ప్రస్తావనే.. చిత్రపరిశ్రమ ఆ నాలుగు కుటుంబాల చేతుల్లోనే చిక్కుకుపోయిందంటూ ఆవేదన... మూడు రిలీజ్లు.. ఆరు షూటింగ్‌లతో.. నిత్యం కళకళలాడుతుంటుంది.. తెలుగు సినిమా ఇండస్ట్రీ. పెద్ద హీరోల నుంచి.. డెబ్యూ స్టార్లదాకా.. ఎవరి సినిమాలను తీసుకునే పనిలో ఎప్పుడూ హడావిడిగా ఉంటారు. ప్రమోషన్లు.. ఆడియో రిలీజ్ ఫంక్షన్లు.. సినిమా రిలీజ్లు... ఇలా ఏదో ఓ విశేషం.. ప్రతీరోజూ ఉంటూనే ఉంటుంది. ఇక సమ్మర్ హాలిడేస్ వచ్చేస్తుండడంతో.. ఈ హడావిడి మరికాస్త పెరిగింది. ఇలా సమ్మర్ కోసం తెలుగు సినిమా ఇండస్ట్రీ సిద్ధమవుతున్న తరుణంలో.. మరోసారి తన మాటలతో హడావిడి చేశాడు.. దర్శకరత్న దాసరి. ఓ సినిమా షూటింగ్ ప్రారంభోత్సవానికి హాజరైన ఈ ఓల్డేన్ డేస్ గోల్డెన్ డైరెక్టర్.. ఆ నాలుగు కుటుంబాలంటూ.. మరోసారి వివాదాల కుంపటిని రాజేశాడు.
మూడు నాలుగు కుటుంబాల చేతుల్లోనే సినిమా ఇండస్ట్రీ చిక్కుకుపోయిందన్న దాసరి.. అంతటితో ఆగలేదు.. సినీ ఇండస్ట్రీని విముక్తం చేయలేకపోతే ప్రజల్లోకి వెళతానంటూ గంభీరస్వరంతోనే ప్రకటించాడు. ఇక దాసరికి.. మరో సీనియర్ నటుడు.. రాజకీయనాయకుడు.. బాబూమోహన్ నుంచి మంచి మద్దతు లభించింది. చిత్ర పరిశ్రమను కాపాడటానికి దాసరి బెబ్బులిపులిలా వస్తారంటూ ఆయన ప్రకటించారు.
తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఆ నలుగురూ.. అనగానే.. ఎవరికైనా గుర్తొచ్చే పేర్లు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్. మరి దాసరి నారాయణరావు సహా.. అందరూ టార్గెట్ చేసుకుంది ఈ నలుగురినేనా.. .లేక.. మరో నలుగురు ఎవరైనా ఉన్నారా.. అసలు సినిమా ఇండస్ట్రీని కంట్రోల్ చేస్తోంది. ఈ వివరాలు తెలియాలంటే.. అసలు తెలుగు సినిమా ఇండస్ట్రీ స్వరూపం తెలియాలి.
ఇండస్ట్రీ స్వరూపం
తెలుగు సినీ పరిశ్రమ దాదాపు ఎనభైఏళ్లు పూర్తి చేసుకొంది. మొదటి టాకీ భక్తప్రహ్లాదతో పోల్చితే.. ఇప్పటివరకూ సినీ ఇండస్ట్రీలో ఎన్నో మార్పులు వచ్చాయి. అయితే.. తెలుగు సినిమా ఓ ఇండస్ట్రీగా మారుతున్న సమయంలో వచ్చిన మార్పులే పరిశ్రమ అభివృద్ధి చెందడానికి ఎంతో దోహదపడ్డాయి. మన సినీ ఇండస్ట్రీ అనగానే.. అది దర్శకులు.. నిర్మాతలకు మాత్రమే పరిమితమైంది కాదు. మూడు విభాగాలకు చెందింది.
ఇక్కడ తొలిస్థానం నిర్మాతది. సినిమా తీయాలన్న ఆలోచన రాగానే.. అందుకు అవసరమైన మానవ వనరులు.. ఆర్థిక వనరులు సేకరించడం నిర్మాత పని. అంతేకాదు.. సినిమా పూర్తైన తర్వాత.. దానిని మార్కెటింగ్ చేసుకోవడమూ ఆయన పనే. ఇలా చిన్న సినిమాలతో మొదలుపెట్టి.. పెద్దపెద్ద నిర్మాతలుగా ఎదిగిన వారు మన ఇండస్ట్రీలో ఎంతోమంది ఉన్నారు.
ఇక రెండోస్థానం డిస్ట్రిబ్యూటర్లది. నిర్మాతనుంచి సినిమాను కొనుక్కోవడం.. ఏరియాల వారీగా సినిమాను పంపిణీ చేయడం వీరి పని. సినీపరిశ్రమ మద్రాసులో ఉన్న సమయంలోనే.... మన దగ్గర ప్రాంతాల వారీగా డిస్ట్రిబ్యూటర్లు ఏర్పడ్డారు. నైజాం, సీడెడ్, ఆంధ్రా ఇలా ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి ప్రత్యేకంగా డిస్ట్రిబ్యూటర్లు ఉన్నారు.
ఇక మూడోస్థానం ఎగ్జిబిటర్లది. అంటే.. థియేటర్ల యజమానులు. డిస్ట్రిబ్యూటర్ల నుంచి సినిమాను తెచ్చుకుని ప్రదర్శించడం వీరి పని. సినిమా కలెక్షన్లను బట్టి ఎవరివాటాలు వారికి ఉండేవి. ఈ మూడు విభాగాలూ.. ఒకదానితో మరొకదానికి సంబంధం ఉన్నప్పటికీ.... ఒకరి వ్యవహారంలో మరొకరు జోక్యం చేసుకునేది అప్పట్లే చాలా తక్కువ. సినిమా నిర్మాణానికి అడ్వాన్స్‌లు ఇవ్వాల్సిన సమయంలో మాత్రం డిస్ట్రిబ్యూటర్లు.. సినిమా ఎలా తీయాలన్న విషయంలో నిర్మాతపై ఒత్తడి తెచ్చేవారు. కానీ.. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సినిమా నిర్మాతలు.. డిస్ట్రిబ్యూటర్లు.. ఎగ్జిబిటర్ల మధ్య సరిహద్దు గీతలు చెరిగిపోయాయి. తెలుగు సినిమా నిర్మాతల్లో చాలామంది డిస్ట్రిబ్యూటర్లుగా పనిచేస్తున్నారు. అంతేకాదు.. వందలాది థియేటర్లను లీజుకు తీసుకొని ఎగ్జిబిటర్లుగానూ అవతారం ఎత్తారు. అంటే.. సినిమా విడుదల కావాలన్నా.. ఆ సినిమాకు మంచి ఏరియాలో ఉన్న థియేటర్ కావాలన్నా... అది ఆల్రౌండర్లుగా మారిన వారి చేతుల్లోనే ఉంటుంది. ఇప్పుడు ... చిన్నసినిమాల నిర్మాతలు గగ్గోలు పెడుతోంది వీరిపైనే. చిన్న సినిమాలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదంటూ.. ఆ నలుగురిపై ఆరోపిస్తోంది ఇందుకే.
అసలు ఆ నలుగురూ..
ఆ నలుగురూ అనడమే తప్ప.. నేరుగా.. సంబోధించడానికి ప్రతీ ఒక్కరూ భయపడతారు. అదే ప్రజెంట్ పొజిషన్. ఇండస్ట్రీలో టాప్ ఫోర్ ఫ్యామిలీస్ అనగానే... ముందు చిరంజీవి ఫ్యామిలీ ఉంటుంది. ఈ కుటుంబం నుంచి.. చిరంజీవిని కలుపుకుంటే నలుగురు టాప్ హీరోలు ఉన్నారు. వీరి సినిమాలకు కలెక్షన్లు కూడా ఎక్కువ. మగధీర టాలీవుడ్ రికార్డులను తిరగరాసింది. ఇక వరస సినిమాలతో అందరినీ ఆకర్షిస్తున్నాడు.. హీరో అల్లు అర్జున్.
రెండోది.. నందమూరి ఫ్యామిలీ. ఈ కుటుంబంలో నలుగురు హీరోలున్నా... ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువగా ఉంది బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్లకే. పైగా వీరిద్దరివీ హైబడ్జెట్ మూవీలే. బాలకృష్ణ సింహా రిలీజ్కోసం వెయిట్ చేస్తుండగా.. ఎన్టీఆర్ బృందావనం రెడీ అవుతోంది.
ఆ తర్వాత ఫ్యామిలీ అక్కినేనిది. నాగార్జున సహా.. నలుగురు యంగ్ హీరోలు ఈ ఫ్యామిలీలో ఉన్నారు. వరస సినిమాలతో నాగ్‌కు పోటీగా దూసుకొస్తున్నాడు చైతన్య. వీరిద్దరవీ హైబడ్జెట్ సినిమాలే.
ఇక నాలుగో ఫ్యామిలీ.. వెంకటేష్‌ది. సినీపరిశ్రమలో బలమైన కుటుంబం వెంకటేష్‌ది. తండ్రి, అన్నయ్యలు ఇద్దరూ పెద్ద ప్రోడ్యూసర్లు. ఈ కుటుంబం నుంచి ఈ మధ్యే.. హీరోగా రానా ఎంట్రీ ఇచ్చాడు. ఇద్దరు నిర్మాతలు.. ఇద్దరు హీరోల ఫ్యామిలీగా మారింది.
ఈ నాలుగు కుటుంబాల నుంచి.. లో బడ్జెట్ సినిమాలను ఎవరూ ఎక్స్పెక్ట్ చేయరు. వచ్చేవన్నీ హై బడ్జెట్ సినిమాలో. గతంలో వంద, రెండు వందల రోజులు ఆడిన సినిమాలూ ఉన్నాయి. అయితే.. ప్రస్తుతం యాభై రోజులు కలెక్షన్లు వస్తేనే.. గొప్ప కాబట్టి.. ఈ నాలుగు కుటుంబాల సినిమాలు కలెక్షన్ల కోసం కొత్త ప్లాన్ వేశాయి. నాలుగైదు వందల ప్రింట్లతో సినిమాలు విడుదల చేస్తున్నాయి. రామ్‌చరణ్ సినిమా మగధీర అయితే.. ఏకంగా వెయ్యికి పైగా ప్రింట్లతో విడుదలై కలెక్షన్ల వర్షం కురిపించింది. చిన్న సినిమాలకు ఇదే ఇప్పుడు సమస్యగా మారింది. ఈ సినిమాలు రిలీజ్ అయితే.. చిన్న సినిమాలను నిర్దాక్షిణ్యంగా తొలగిస్తున్నారనేది ప్రధాన ఆరోపణ
ఇక రాష్ట్రంలో దాదాపు 2500 థియేటర్లుండగా.. వీటిలో దాదాపు 1500కు పైగా థియేటర్లు సినీ ప్రముఖుల గుత్తాధిపత్యంలోనే ఉన్నాయి. వీరు కావల్సిన సినిమాలనే థియేటర్లలో ఆడించడం వల్ల.. చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం లేదు. ఇందులోనూ ఎక్కువ థియేటర్లు కంట్రోల్లో ఉంది... రామానాయుడు పెద్ద కుమారుడు సురేశ్‌బాబు చేతిలోనే. ఏషియన్ ఫిల్మ్స్, సురేశ్ బాబు కలిసి 700కు పైగా థియేటర్లను లీజుకు తీసుకుని నడిపిస్తున్నారు. ఇక మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, తిరుపతి ప్రసాద్‌లు కలిసిదాదాపు 400 థియేటర్లను నిర్వహిస్తున్నారు. ఇక రామోజీరావుకు చెందిన మయూరి డిస్ట్రిబ్యూషన్‌కు దాదాపు 300 థియేటర్లు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి. సిరిమీడియాకు 100 నుంచి 150 థియేటర్లున్నాయి. ఇక కలెక్షన్లకు కీలకమైన నైజాంలో దాదాపు 50 మెయిన్ థియేటర్లు సినీనిర్మాత, డిస్ట్రిబ్యూటర్ దిల్‌రాజు చేతిలో ఉన్నాయి.
వాస్తవానికి చూస్తే.. థియేటర్లను కంట్రోల్ చేస్తున్న సురేశ్‌బాబు, అల్లుఅరవింద్, రామోజీరావు, దిల్రాజులనే.. దాసరి టార్గెట్ చేసుకున్నారు. ఈ నలుగురు చేతుల్లో నుంచి ఇండస్ట్రీని విడిపిస్తే తప్ప.. చిన్న సినిమాలకు మేలు జరగదన్న మాట ఇప్పుడు చాలామంది చెబుతున్నారు. కానీ.. ఈ పెద్ద హీరోల సినిమాల వల్లే.. హాళ్లు నిండుతున్నాయన్న విషయాన్ని మాత్రం ఎవరూ గుర్తించడం లేదు.
8, ఏప్రిల్ 2010, గురువారం
సినీ ఇండస్ట్రీలో ఆ నలుగురూ..
Categories :
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
నాలుగొ వాడు 50 థియేటర్లు వున్న దిల్ రాజు ఎందుకవుతాడు.. 100-150 థియేటర్లు వున్న సిరిమీడియా దాసరి అవుతాడు కదా..
'సంభోదించడానికి' కాదు మహా ప్రభో! ’సంబోధించడానికి’.
దాసరి ’బొబ్బిలి పిల్లి’ సినిమా తీస్తే మంచిది.
ee madhya cinemalloo kanipinchaka povadam valanaa, etti podupu latho teeesina mestri dobbinandunaa, raajakiyallo kuda kcr, t g venkatesh, lagadapati lato noti doola niroopinchukoleka poyinanduvallana mana daasari vaaru raajakeeya com cinema nirudyogudayye soochanalu chaalaa kanapadutunnaayi. kaaka pote tala nerisina vaadu kaabatti konchem mundu gaa tErukoni aakulu pattukuntunnaadu. manchi cinemalu teesthey regardless of distributors and heroes prekshakulandaru choostaaru, telugu industry lo release ayina prati cinema choostunnaanu, kotta director lu kotta nirmathalu teeyadam cheta gaaka ilaanti posukolu kaburlu chepthunnaaru. chinnavaina malli malli choodaalanipinchey cinemalu for example gamyam, anasuya, godavari, happydays, anand ilaa enno movies ni aadarinchaaru andulo aa four families ki sambandhinchi oka paaleru kuda ledu. so ika daasari vaaru noru moosthey manchidi