11, మార్చి 2010, గురువారం
ఏ"కాంత" సేవలు.. ఫోటోలతో
సాధారణ మనిషి నుంచి స్వామీజీగా మారిన నిత్యానంద సెక్స్ స్కాండల్.. కొత్త మలుపు తిరిగింది. వీడియో టేపులు బయటపడ్డప్పటి నుంచి.. అజ్ఞాతంలో ఉన్న సినీనటి రంజిత పెదవి విప్పింది. స్వామీజీని సెక్స్ స్కాండల్‌లో మరింతగా ఇరికించే కొన్నీమాటలూ చెప్పింది. ఇంతకీ రంజిత చెప్పిందేమిటి.. ఏ ఉద్దేశ్యంతో ఆమె ఈ ప్రకటన చేసింది..
రంజిత... ఆధ్యాత్మిక గురువు నిత్యానంద సెక్స్ టేపుల్లో ఉన్న అందరికీ కనిపించిన సినీనటి. తమిళ, మలయాళ, తెలుగు సినిమాల్లోనూ.. ప్రస్తుతం టీవీ సీరియల్స్‌లోనూ నటిస్తూ.. బిజిగా ఉన్న రంజిత.. ఒక్కసారిగా సెక్స్ టేపులో దర్శనమివ్వడం సంచలనం సృష్టించింది. అప్పటివరకూ అందరి మధ్యా గడిపిన ఆమె.. ఒక్కసారిగా తెరవెనకకు వెళ్లిపోయారు. ప్రస్తుతం కేరళలో ఓ స్నేహితురాలి ఇంట్లో తలదాచుకున్నట్లు సమాచారం. ఈ వీడియోలు బయటపడగానే... ఇందులో ప్రధాన వ్యక్తి అయిన నిత్యానందస్వామీజీ కూడా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అయితే.. ఈ వీడియోలు అబద్ధమంటూ.. ఆయన ఆశ్రమ ప్రతినిధులు మాత్రం ప్రకటించారు. అందులో ఉన్నది నిత్యానంద కాదనీ కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు. కొంతమంది కావాలనే.. ఇలా దొంగ వీడియోలు సృష్టించి నిత్యానంద ప్రతిష్టను దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారనీ ఆరోపించారు. కానీ... ఈ ప్రకటనల తర్వాతే... ఈ వ్యవహారంలో కీలక మలుపు తిరిగింది. వీడియో టేపుల్లో ఉన్న సినీనటి రంజిత నోరు విప్పింది. "నిత్యానంద వీడియోల్లో ఉన్నది నేనే. స్వామికి నేను సేవలు మాత్రమే చేశాను. కాళ్లు పట్టడం, మాత్రలు ఇవ్వడం, భోజనం అందించడం లాంటివే చేశాను. నాకు నిత్యానందపై గౌరవం, మర్యాద ఉన్నాయి. ఇది అందరికీ తెలిసిందే. అంతేకాదు చిన్న వయస్సు నుంచి నన్ను పీడించిన శ్వాశ సంబంధిత సమస్యను ఒక్కరోజులో స్వామి మాయం చేశారు. ఆనాటి నుంచి ఆయన భక్తురాలినయ్యాను. ఈ వీడియోను సగం మార్చి నీలిచిత్రంగా ఎవరో మార్చారు" అని రంజిత చెబుతోంది.
" వీడియోలో సగం వాస్తవం.. సగం కల్పితం అంటోంది సినీనటి రజిత. కానీ.. ఆమె మాటలు బట్టి చూస్తే.. ఈ వీడియోలో ఉన్నది నిత్యానందేనని అందరికీ తెలియడం కోసమే ఈ ప్రకటన చేసినట్లు తెలుస్తోంది. మొత్తంమీద.. నిత్యానంద పరువు.. రంజిత ప్రకటనతో పాతాళానికి పడిపోయింది."
నిత్యానంద పరమహాంస.. తమిళనటి రంజిత.. వీరితో పాటు.. మరో నటి రాగసుధ.. ఈ ముగ్గురికి సంబంధించిన వీడియో క్లిప్పులు... దేశంలోనే కాదు.. ప్రపంచమంతా సంచలనం సృష్టిస్తున్నాయి. నెట్‌లో విశృంఖలంగా విహరిస్తున్నాయి. ఎవరి నోట విన్నా.. నిత్యానంద రాసలీలల మాటే. 30 ఏళ్లపాటు శ్రమించి ఎంతో పెద్ద ఆధ్యాత్మిక సామ్రాజ్యాన్ని నిర్మించుకున్న నిత్యానంద.. ఇప్పుడు ఎవరికంటా కనపడకుండా దాక్కుంటున్నారు. దాదాపు 33 దేశాల్లో కేంద్రాలను ఏర్పాటు చేసుకొని.. భక్తులకు నిత్యం దర్శనం ఇచ్చే స్వామీజి.. ఇప్పుడు ఎక్కడున్నారో కూడా తెలియదు. అయితే.. తాను ఇల్లీగల్ పనేదీ చేయలేదంటూ సర్ది చెప్పుకుంటున్నారు స్వామీజీ. జనం ముందుకు వస్తే.. ఎవరన్నా ఏమన్నా చేస్తారనుకున్నారో ఏమో.. తన వెబ్‌సైట్‌లో తన ప్రసంగం ఉన్న ఓ వీడియోను పెట్టించారు. ఏది లీగలో.. ఏది ఇల్లీగలో నిత్యానందకు బాగా తెలిసినట్టుంది. అందుకే.. వీడియోలో కనిపించింది తాను కాదన్న విషయాన్ని కూడా ఎక్కడా చెప్పలేదు. పైగా.. ఈ పని చేసింది ఎవరో త్వరలోనే అందరికీ చెబుతామని.. ఆధారాలు సేకరించే పనిలో ఉన్నామని నిత్యానంద చెబుతున్నారు. త్వరలోనే పూర్తి వివరాలతో జనం ముందుకు వస్తామంటున్నారు.
లా వెబ్‌సైట్‌లో కనిపించి... భక్తులనుద్దేశించి నిత్యానంద ప్రసంగించిన రెండు రోజులకే.. కేరళలో ఉన్న రంజిత నోరు తెరిచింది. వీడియోలో ఉన్నది తానేనని ధృవీకరించింది. బెడ్‌పై పడుకున్న నిత్యానందకు.. మాత్రలు, ఆహారం అందించింది కూడా తానేనని చెప్పింది. ఇంతవరకూ చెప్పినా.. ఆ తర్వాత వీడియోలో ఉన్నవి మాత్రం కల్పితాలంటోంది. దీన్ని నమ్మాలా లేదా అన్నది పక్కన పెడితే.. నిత్యానందను మరింతగా ఇందులో ఇరికించాలన్న తపన రంజితలో కనిపిస్తోంది. నిత్యానంద వీక్‌నెస్‌ను క్యాష్ చేసుకోవడానికి పెద్ద కుట్ర జరిగినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
మార్ఫ్ చేశారా?
డియో మార్ఫింగ్... తలకాయలు ఒకరివి .. శరీరాలు మరొకరివి. ఫోటోల మార్ఫింగ్ ఎక్కువగా కనిపించినా.. అప్పుడప్పుడూ వీడియో మార్ఫింగ్ కూడా జరుగుతూ ఉంటోంది. ఒకరితో షూట్ చేసి.. ఆ స్థానంలో మరొకరిని ఉంచడమే.. ఇందులో ట్రిక్. ఇప్పుడు నిత్యానంద వీడియోల విషయంలోనూ ఇదే అంశం తెరపైకి వచ్చింది. వీడియోలను ఎవరో మార్ఫ్ చేశారని.. అందులో ఉన్నది స్వామీజీ కాదని.. నిత్యానంద అనుచరులు వాదిస్తున్నారు.
టు రంజిత కూడా.. సగం దృశ్యాలను ఎవరో ఇందులో కలిపారని చెబుతోంది. అయితే.. అదే డ్రస్సు.. అదే హావభావాలు.. అప్పటివరకూ మాత్రలు.... ఆహారం అందించడం... ఆ తర్వాత పడకపై శయనించడం.. ఎక్కడా నిత్యానంద ఎదురుగా ఉన్నమనిషిలో మార్పే లేదు.. పైగా మార్ఫింగ్ చేసిందని అనుమానించేలా ఒక్క సీన్ కూడా లేదు. మొత్తంమీద చూస్తే.. వీడియో అంతా మార్ఫింగ్ అని చెప్పకుండా.. సగం మాత్రమే మార్ఫింగ్ అని చెప్పడంలోనే.. సినీనటి రంజిత ఉద్దేశాన్ని అర్థం చేసుకోవచ్చు.
స్వామీజీలకు ఏకాంత సేవలు అవసరమా?
నిత్యానంద స్వామీజీలాంటి వాళ్లు మన దేశంలో వీధికొకరు. కాషాయ వస్త్రాలు ధరించుకొని.. జనాన్ని ఉద్దరించడం కోసం అవతరించిన స్వామీజీలు. హిందూమత ప్రచారం కోసం ఇలాంటి వాళ్లు అవసరమే అయినా.. భక్తుల నమ్మకాన్ని సాకుగా చేసుకొని.. అసభ్యకరమైన పనులకు తెగబడుతున్నారు. నిత్యానంద వీడియోలు ఇందుకో ఉదాహరణ మాత్రమే. మంత్రతంత్రాలతో జనాన్ని లోబర్చుకుంటూ వీరు చేస్తున్న పనులు.. స్వామీజీ అంటేనే అపనమ్మకాన్ని కలిగించేలా ఉంటున్నాయి..
పదులు.. వందల్లో మొదలయ్యే స్వామీజీల అనుచరులు కొన్ని సంవత్సరాల్లోనే లక్షల్లోకి చేరుతున్నారు. ఎక్కడికక్కడ ఆశ్రమాలు వెలుస్తున్నాయి. కొంతమంది స్వామీజీల లగ్జరీ వైభోగాలు.. కోటీశ్వరులను మించిపోయి ఉంటాయి. భక్తులకు నీతిబోధలు చేస్తూ.. సమాజంలో మంచిని పెంచాల్సిన ఈ స్వాములు.. తెరచాటున మాత్రం ఎన్నో అక్రమాలకు పాల్పడుతున్నారు. తమ దగ్గరకు వచ్చే భక్తులను లోబరుచుకుంటున్నారు. ఏకాంత సేవలు చేయించుకుంటున్నారు. బాడీ మసాజ్ దగ్గర నుంచి మొదలుపెడితే.. లైంగిక వాంఛలు తీర్చే వరకూ.. అన్నీ చేయాల్సిందే. సేవలు మాత్రమే చేశానని రంజిత చెబుతుంటే.. ఆమె చేసిన సేవలేంటన్నది.. నక్కీరన్ పత్రిక కవర్ పేజీగా ప్రచురించింది. అన్నీ వదిలేసిన సన్యాసికి.. ఇలాంటి సేవలు అవసరమా..
ప్రత్యేక ఆశ్రమాలు పెట్టుకొని.. నరమానవుడు ప్రవేశించకుండా.. ఏకాంత మందిరాలు కట్టుకునే స్వామీజీలపై కన్నేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అటు భక్తులు కూడా.. కనపడ్డ ప్రతీ స్వామినీ నమ్మేసి.. సర్వం అర్పించుకోకుండా ఉండాలి. ఎందుకంటే వాళ్లూ మనలాంటి మనుషులే. కాకపోతే.. కాషాయరంగు వేసుకున్న వాళ్లు.. అంతే.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి