6, ఫిబ్రవరి 2010, శనివారం
హైస్కూల్‌లో హై రొమాన్స్
టాలీవుడ్‌ను మరో టీనేజ్ లవ్ స్టోరీ పలకరించనుంది. హైస్కూల్ పేరుతో రూపొందిన ఈ సినిమాకు నరసింహ నంది దర్శకత్వం వహించారు. టెన్త్ క్లాస్ చదువుతున్న విద్యార్థే ఈ సినిమాలో హీరో. కార్తీక్ ఈ పాత్రలో నటించాడు. హీరో ఇంటికి ఎదురుగా ఉండే సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ పాత్రలో కిరణ్‌రాథోడ్ నటించింది. ఇక స్టోరీ వివరాల్లోకి వెళితే..
అపార్ట్‌మెంట్‌లో కిరణ్‌రాథోడ్ ఒంటరిగా ఉంటుంది. ఆమె అందానికి ఫ్లాటైపోయి.. లవ్‌లో పడతాడు ఈ టెన్త్‌క్లాస్ అబ్బాయి. ఇద్దరిమధ్యా వయస్సులో చాలా తేడా ఉన్నప్పటికీ.. అదేమీ పట్టించుకోడు. ఆమెను రహస్యంగా అబ్జర్వ్ చేస్తూ ఫాలో అవుతాడు.. నిత్యం ఆమె ధ్యాసలోనే గడుపుతుంటాడు. ఓ పూర్తిస్థాయి లవ్‌స్టోరీ తరహాలో ఈ సినిమాను దర్శకుడు నరసింహ తీశారు.అయితే.. కథ క్లైమాక్స్ వచ్చేసరికి మాత్రం.. అనుకోని పరిస్థితులు హీరోకు ఎదురవుతాయి. యుక్తవయస్సులోకి వస్తున్న సమయంలోనే అమ్మయిల పట్ల ఆకర్షణకు లోనైతే ఎలాంటి దుష్పరిణామాలు ఎదురవుతాయో.. ఈ సినిమాలో చూపించే ప్రయత్నం చేశామంటున్నారు దర్శకుడు.
టాలీవుడ్‌కు అవసరమా..
1940లో ఒక కుగ్రామం లాంటి జాతీయ స్థాయిలో ప్రాంతీయ ఉత్తమ చిత్రాన్ని తీసిన దర్శకుడి నుంచి.. మరో ఉత్తమ చిత్రాన్ని ఆశించడం సహజమే. అయితే.. ఈ సినిమా విషయంలో మాత్రం.. కాస్త అంచనాలు తలకిందులు కావచ్చు.
హైస్కూల్.. చాలా చక్కని పేరు. కానీ.. సినిమాలో మాత్రం అంత చక్కదనం ఉన్నట్లు కనిపించడం లేదు. పదోక్లాస్ అబ్బాయికి.. 30 ఏళ్ల అమ్మాయికి మధ్య రొమాన్స్ పెడితే ఎలా ఉంటుందో.. అలానే ఉంది. కుర్రాడి ప్రేమను ఘాటుగా చూపించడానికి.. హాట్‌హాట్ సన్నివేశాలనే ఇందులో తీశారు. ముద్దుముచ్చట్లకూ సినిమాలో కొదవ లేదు. స్టోరీ లైన్‌ను సీన్లు చాలాచోట్ల క్రాస్ చేసేశాయి. ఇక పాటల విషయానికొస్తే.. సాహిత్యంలో శృంగార రసాన్ని ఓ పాలు ఎక్కువే పోశారు.
అందుకే కాబోలు... ఈ సినిమాకు సర్టిఫికేషన్ ఇచ్చే విషయంలో సెన్సార్ బోర్డు కాస్త వెనుకడుగు వేసింది. సినిమాలోని దాదాపు సగం సీన్లకు కట్స్ చెప్పినట్లు సమాచారం. హైదరాబాద్ సెన్సార్ బోర్డు నిర్ణయంతో అసంతృప్తి చెందిన దర్శక నిర్మాతలు.. ఢిల్లీలోని ట్రిబ్యునల్‌ను ఆశ్రయించారు. హైస్కూల్‌లోని కొన్ని సీన్లను కట్‌చేసి.. A సర్టిఫికెట్‌ను ట్రిబ్యునల్ ఇచ్చింది. సెన్సార్ సర్టిఫికెట్ రావడంతో.. త్వరలోనే ఈ సినిమాను విడుదల చేయనున్నారు. అసలు.. క్లీన్ యు సర్టిఫికెట్ లభిస్తున్న సినిమాల్లోనే ఎన్నో అసభ్యకర సన్నివేశాలు.. డైలాగ్‌లు ఉంటుంటే.. సగం సినిమా కట్స్‌ను తృటిలో తప్పించుకున్న హైస్కూల్ ఎలా ఉంటుందన్నది ప్రేక్షకులే ఊహించుకోవాలి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి