12, ఫిబ్రవరి 2010, శుక్రవారం
డిసెంబర్ 31 గడువు..
Categories :
జస్టిస్ శ్రీ కృష్ణ కమిటీ విధివిధానాలపై సస్పెన్స్ వీడిపోయింది. కమిటీ అధ్యయనం చేయాల్సిన ఏడు అంశాలను కేంద్ర హోంశాఖ ఇవాళ ప్రకటించింది. తెలంగాణ ఏర్పాటుతో పాటు.. ఆంధ్రప్రదేశ్‌ను యదాతథంగా ఉంచడంపైనా.. కమిటీ విచారణ చేయనుంది.
శ్రీకృష్ణ కమిటీ అధ్యయనం కోసం తయారు చేసిన విధివిధానాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రత్యేక తెలంగాణ ఏర్పాటుతో పాటు రాష్ట్రాన్ని యదాతథంగా ఉంచడంపై కమిటీ అధ్యయనం చేస్తుంది. రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి.. ఇప్పటివరకూ జరిగిన అభివృద్ధిని సమీక్షించడంతో పాటు.. వివిధ ప్రాంతాల్లో డెవలప్మెంట్ ప్రోగ్రెస్‌ను కమిటీ పరిశీలిస్తుంది. మహిళలు, విద్యార్థులు, మైనార్టీలు, ఎస్సీ,ఎస్టీ, బీసీలపై.. ఇటీవలికాలంలో జరిగిన అభివృద్ధిపైనా కమిటీ దృష్టి పెడుతుంది. ఈ మూడు అంశాలకు సంబంధించి కీలకమైన విషయాలను జస్టిస్ శ్రీకృష్ణ కమిటీ గుర్తిస్తుంది. రాష్ట్రంలో పరిస్థితిని చక్కదిద్దడంతోపాటు.. అందరి సంక్షేమం కోసం రాజకీయ పార్టీల నుంచి సలహాలు స్వీకరించి.. రోడ్‌మ్యాప్‌కు ప్రణాళికను కమిటీ రూపొందిస్తుంది. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికోసం.. ట్రేడ్యూనియన్లు, రైతుసంఘాలు, మహిళ,విద్యార్థి సంఘాలతో సంప్రదింపులు జరుపుతుంది. కమిటీ ప్రాధాన్యం ఉందని భావించిన ఇతర అంశాలపైనా సలహాలు, సూచనలను చేస్తుంది. ఇలా ఏడు అంశాలతో విధివిధానాలను రూపొందించిన ప్రభుత్వం.. కమిటీ కాలపరిమితిని డిసెంబర్ 31 వరకూ విధించింది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
iyyakuMTe EM chestaaru