4, జనవరి 2010, సోమవారం
ఉస్మానియా డిక్లరేషన్
Categories :
విద్యార్థి మహా గర్జనలో తెలంగాణ సాధనకోసం ఉస్మానియా విశ్వవిద్యాలయ డిక్లరేషన్‌ను ప్రవేశపెట్టారు. పూర్తి డిక్లరేషన్ మీకోసం...
తెలంగాణ రాష్ట్రం కోసం ప్రజలు దశాబ్దాలుగా పోరాడుతున్నారు. 1969లో ఉద్యమం ప్రభుత్వ ఉద్యోగులు, విద్యార్థులకే పరిమితంగా నడిచింది. కానీ ఈ రోజు ఉద్యమం గ్రామ గ్రామానికీ పాకింది. ఆ రోజు ఉద్యమంలో పోలీసు నిర్బంధంతో నాలుగువందల మంది బలయ్యారు. ఈ రోజు తీవ్ర పోలీసు నిర్భంధాన్ని కూడా విద్యార్థులు ఛేదించి మహా గర్జనను విజయవంతం చేసుకున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలు, మనోభావాలు, ఉద్యమ తీవ్రతను కేంద్ర ప్రభుత్వం గుర్తించాలి. ఈనెల 5న కేంద్రప్రభుత్వం ఏర్పాటుచేసిన అఖిలపక్ష సమావేశంలో తెలంగాణకు అనుకూల నిర్ణయం రాకుంటే ఉద్యమం ఉద్ధృతమవుతుంది. అదే రోజున జాతీయ రహదారులన్నీ దిగ్భందిస్తాం. రైల్‌రోకోలు చేపడతాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు నిర్దిష్ట గడువు ప్రకటించాలి. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా మా ఉద్యమాన్ని కొనసాగిస్తాం. తెలంగాణ విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో కుల, మతాలకు అతీతంగా పేద, నిరుపేద ప్రజలు, అణగారిన కులాలు, ఆదివాసీలు, మైనారిటీల జనాభా దామాషా ప్రకారం.. అభివృద్ధి ఫలాల్లో వారి వాటా వారికి దక్కే వరకు పోరాడుతాం. ప్రజల ఆకాంక్షను దృష్టిలో పెట్టుకుని కేంద్రం పార్లమెంటులో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకోసం బిల్లు పెట్టాలి'
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి