రహమాన్ పాటలు డౌన్‌లోడ్‌కు క్లిక్ చేయండి
సంగీతానికే సరిగమలు నేర్పిన ఘనుడు... స్వరమాంత్రికుడు.. మ్యూజిక్ మొఘల్.. ఎ.ఆర్.రహమాన్. జనవరి 6తో 43 వసంతాలు పూర్తి చేసుకున్నాడు... భారతీయులందరికీ గర్వకారణమైన రహమాన్. రోజా నుంచి మొదలు.. ప్రతీ సినిమాలోనూ తనదైన పంథాను చూపిస్తూ.. అందరినీ ఆకట్టుకొంటున్నాడు. ఇంతింతై వటుడింతై.. అన్నట్లు.. తమిళ సినిమా నుంచి మొదలైన రహమాన్ ప్రస్తానం.. ఇప్పుడు హాలీవుడ్ దాకా చేరింది. భారతీయ సంగీతానికి ప్రపంచకీర్తి కిరీటాన్ని తొడిగించిన ఘనత రహమాన్‌కు మాత్రమే దక్కుతుందనడం ఏమాత్రం అతిశయోక్తి కాదు.
మాతు జే సలాం అంటూ రహమాన్ పెదవి విప్పితే.. దేశం మొత్తం వందేమాతరం అంటూ గొంతుకలిపింది. జయహో అంటూ పిలుపునిస్తే.. యావత్ భారతం శృతి కలిపింది. మంచి ఉత్సాహంలో అయినా.. విరహంలో అయినా.. చివరకు విషాదంలో అయినా.. ముందుగా పాడుకోవాలనిపించేది.. రహమాన్ స్వరపరిచిన గీతాలే. అందుకే.. ఆయన తొలినాళ్లలోనే రూపొందించిన.. ఎన్నో పాటలు.. ఇప్పటికీ జనం నాలుకలపై నాట్యమాడుతున్నాయి. రహమాన్‌కు ఎనలేని కీర్తి పతాకాన్ని తెచ్చిపెట్టాయి.
రహమాన్ బ్యాక్‌గ్రౌడ్..
1966 జనవరి 6న చెన్నైలోపుట్టిన రెహమాన్ తలిదండ్రులు కరీమా బేగం, ఆర్కె శేఖర్. పుట్టినప్పుడు రెహమాన్ పేరు దిలీప్‌కుమార్. తండ్రి మలయాళీ సినిమాల్లో మ్యూజిక్ కంపోజర్‌గా చేసేవారు. రెహమాన్ జీవితంలో విషాదం ఏమిటంటే ఆయన తొమ్మిదో ఏటనే తండ్రిని కోల్పోయారు. రెహమాన్ తన11వ ఏటనే ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయారాజా దగ్గర కీబోర్డు ప్లేయర్‌గా చేరారు. ఆక్స్ఫర్డ్ యూనివర్శిటీలోని ట్రినిటీ కాలేజి నుంచి వెస్ట్రన్ క్లాసికల్ మ్యూజిక్‌లో డిగ్రీ తీసుకున్నారు.
పంచాతన్ రికార్డ్ ఇన్ పేరుతో 1989లో సొంత స్టూడియోను ప్రారంభించారు. రోజా చిత్రానికి సంగీత దర్శకత్వం వహించడం ద్వారా సినీ అరంగేట్రం చేశాడు. ఈ సినిమాకో రజితకమలం జాతీయ ఫిలింఫేర్ అవార్డు వచ్చింది. రంగీలాతో బాలీవుడ్‌లోకి ఎంటరయ్యారు. ఇండియన్ మ్యూజిక్‌లో ఆయన కొత్త ట్రెండ్‌ను ప్రారంభించారు. సంగీతంలో టెక్నాలజీని ప్రవేశపెట్టింది ఆయనే. అదే రెహమాన్ స్టైల్. తమిళంలో కధాలన్ చిత్రానికి ఎంతో చక్కటి మ్యూజిక్‌ను సమకూర్చారు. దీన్నే హిందీలో హంసె హై ముకాబా గా రూపొందించారు. పలు హిట్ చిత్రాలకు అద్భుతమైన సంగీతబాణీల్ని సమకూర్చారు. ఆయనకు ప్రపంచ గుర్తింపుని తెచ్చిపెట్టిన చిత్రం స్లమ్ డాగ్ మిలియనీర్. ఈ చిత్రానికి ఆయన అందించిన సంగీతానికి అంతా జయహో అని కీర్తించారు. అంతేకాదు తొలి ఆస్కార్ అవార్డ్ అందుకున్న ఘనతనుకూడా సంపాదించుకున్నాడు. రెహమాన్.
6, జనవరి 2010, బుధవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
"మ్యూజిక్ మొఘల్" చాలా బాగ ఉన్నది.
వెరి గుడ్ ..... విజయ్