ఆంధ్రా తెలంగాణ ఉద్యమాలు ఉధృతమైన నేపథ్యంలో రెండు ప్రాంతాలకు సంబంధించి కొన్ని వాస్తవాలను ఇక్కడ ఇస్తున్నాం...
భౌగోళిక విస్తీర్ణంలో దేశంలో నాలుగో పెద్ద రాష్ట్రం ఆంధ్రప్రదేశ్
జనాభా పరంగా చూస్తే ఐదో అతిపెద్ద రాష్ట్రం
ఎంపీల లెక్కల్లో చూస్తే.. మనది నాలుగోస్థానం. (లోక్‌సభకు 42 , రాజ్యసభకు 18 )
42 ఎంపీల్లో 33 మంది అధికార కాంగ్రెస్ పార్టీ వారే.
రాష్ట్రం విడిపోతే...(42)
ఆంధ్రాకు 25
తెలంగాణకు 17
ఆంధ్రా ప్రాంతానికి ఉపయోగపడే సముద్రతీరం 972 కి.మీ.. (దేశంలోనే తొలిస్థానం)
కేజీ బేసిన్లో విస్తారమైన సహజవాయు నిక్షేపాలు
మొదటి ఎస్సార్సీ
భాషాప్రయుక్త రాష్ట్రాల కోసం డిసెంబర్, 1953 లో ఫజల్ అలీ ఛైర్మన్‌గా రాష్ట్రాల పునర్విభజన కమిషన్ ఏర్పాటు
సెప్టెంబర్ 30, 1955న ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన ఫజల్ అలీ
- ఒకవేళ రెండు రాష్ట్రాలను విలీనం చేయాలని భావిస్తే మాత్రం.. ఇప్పటికిప్పుడే ఆ ప్రయత్నం చేయకూడదని రిపోర్ట్‌లో పేర్కొంది. ఆంధ్రా ప్రజల్లో విశాలాంధ్రకు సంపూర్ణ మద్దతు ఉన్నప్పటికీ.. తెలంగాణలో మాత్రం.. ఈ విషయంలో అనిశ్చితి నెలకొందని ఫజల్ అలీ గుర్తించారు. అందుకే.. 1961లో జరిగే ఎన్నికల తర్వాత.. హైదరాబాద్ అసెంబ్లీలో విశాలాంధ్రకు అనుకూలంగా తీర్మానం ప్రవేశపెట్టాలని... మూడింట రెండొంతుల మెజార్టీతో విజయం సాధిస్తేనే.. రాష్ట్రాల విలీనానికి అంగీకరించాలని స్పష్టంగా చెప్పారు.
మార్చి 6, 1956
ఓ అమాయకురాలైన తెలంగాణకు.. తుంటరి అబ్బాయి లాంటి ఆంధ్రాకు ముడిపెడుతున్నామన్న నెహ్రూ
తెరపైకి పెద్దమనుషుల ఒప్పందం
ఆంధ్రా,తెలంగాణ బడ్జెట్లను ప్రత్యేకంగా నిర్వహించాలి
తెలంగాణ ప్రాంతంలో విద్యవైద్య సౌకర్యాలను పెంచాలి.
ఉద్యోగాల విషయంలోనూ ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలి.
తెలంగాణ ప్రాంతంలో ముల్కీ నిబంధనలను అమలు చేయాలి. ఆంధ్రా ప్రాంతం వారు.. తెలంగాణకు వచ్చి 12 ఏళ్లు ఉంటే గానీ, స్థానికులుగా గుర్తించకూడదు.
ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి పదవులను చెరో ప్రాంతం తీసుకోవాలి.
ఇక తెలంగాణ అభివృద్ధి విషయంలో నిర్ణయాధికారాలు తీసుకొని.. ప్రభుత్వానికి సిఫార్సులు చేయడానికి రీజనల్ కౌన్సిల్‌ను ఏర్పాటు చేయాలి.
హామీలను ఆంధ్రా శాసనసభలో స్వయంగా ప్రకటించిన నీలం సంజీవరెడ్డి
నెరవేరని హామీలు
53 సంవత్సరాల కాలంలో.. 15 మంది రాష్ట్రానికి ముఖ్యమంత్రులైతే.. ఇందులో ముగ్గురు మాత్రమే తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు. ఈ ముగ్గురూ కలిసి సరిగ్గా ఏడేళ్లపాటూ పాలించింది లేదు. (పి.వి.నర్సింహారావు, అంజయ్య, మర్రి చెన్నారెడ్డి) (జలగం వెంగళరావు కాకుండా)
ఏడాదికే కనుమరుగైన ప్రత్యేక బడ్డెట్
రాష్ట్రానికి అయ్యే వ్యయాన్నిఆంధ్రా,తెలంగాణ ప్రాంతాల మధ్య వేరువేరుగానే పంచాలి
ఏర్పాటు కాని రీజనల్ కమిటీ
1969లో వచ్చిన ఆరు సూత్రాల పథకం కూడా తెలంగాణలో మార్పులను తీసుకురాలేదు
ఒక్క సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్‌లో ఏర్పడినా దీనివల్ల.. ఇక్కడి ప్రాంతానికి జరిగిన మేలేమీ లేదు
నిజాం హయాంలో తెలంగాణలో ఏర్పాటైన కంపెనీలు
1921 లో సింగరేణి
1937లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ
1942లో ఆల్విన్ మెటల్ వర్క్క్
1943లో ప్రాగా టూల్స్
1946లో సిర్ఫూర్ పేపర్ మిల్స్
1947లో హైదరాబాద్ ఆస్బెస్టాస్
రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఈ కంపెనీలన్నీ మూతబడ్డాయి
2:1 నిష్పత్తిలో ఆంధ్రా, తెలంగాణ ప్రాంతాల మధ్య ఉద్యోగాల పంపకం జరగాలి.
రాష్ట్రంలో మొత్తం 14 లక్షల మంది ప్రభుత్వోద్యోగులుంటే.. అందులో తెలంగాణ వారి వాటా కేవలం 2.5 లక్షలు
తెలంగాణకు ఇప్పటివరకూ దక్కని అడ్వకేట్ జనరల్ పదవి
రాష్ట్ర ఆదాయంలో దాదాపు 45 శాతం తెలంగాణ ప్రాంతం నుంచే
ఇక్కడ ఖర్చు పెడుతున్న మొత్తం కేవలం 28 శాతం మాత్రమే
నీటి పారుదల... వ్యవసాయం
సాగుకు అనువైన భూమి తెలంగాణలో 64 లక్షల హెక్టార్లు
కోస్తాంధ్రలో 46 లక్షల హెక్టార్లు
నిజామాబాద్ జిల్లాలో శ్రీరాం సాగర్ కట్టడం మొదలుపెట్టి 46 సంవత్సరాలు
1956-2002 మధ్య సాగునీటి రంగానికి రాష్ట్ర ప్రభుత్వ కేటాయింపులు రూ.12,104 కోట్లు
1955-56 నుంచి 2001-02 మధ్య 27.47 లక్షల హెక్టార్ల నుంచి 55 లక్షల హెక్టార్లకు పెరిగిన సాగువిస్తీర్ణం
90 శాతం నిధులు మేజర్, మీడియం ఇరిగేషన్‌కే కేటాయింపు
మైనర్ ఇరిగేషన్‌కు కేవలం 10 శాతం నిధులే కేటాయింపు
1955-56లో చెరువులు, కుంటల కింద 10.68 లక్షల హెక్టార్ల సాగు.. 2001-02 నాటికి 5.67 లక్షల హెక్టార్లకు తగ్గిపోయింది. దీనివల్లే తెలంగాణలో సాగు పడిపోయింది.
2003- 04 నాటికి ఉభయ గోదావరి, కృష్ణా,గుంటూరు జిల్లాల్లోనే కాలువల కింద 6.93 లక్షల హెక్టార్ల సాగు
2004-05 నాటికి ఇది 8.34 లక్షల హెక్టార్లకు పెరిగిన సాగు (రాష్ట్రంలో సాగవుతున్న భూమిలో ఇది 60 శాతం)
జలయజ్ఞం కింద
26 ప్రాజెక్టులు పూర్తి
సాగులోకి 59 లక్షల హెక్టార్లు
ఆంధ్ర ప్రాంతంలో 43 లక్షల హెక్టార్లు
తెలంగాణలో 16 లక్షల హెక్టార్లు
తెలంగాణలో చేపట్టినవన్నీ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంలే
24, డిసెంబర్ 2009, గురువారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
Write about Jai Andhra udyamam in 1973 also. I saw Vundavaali talking about it the other day in TV
out of 45 % how much income is coming from hyd..........
ముసుగులో గుద్దులాట ఎందుకు. అంధ్రప్రదెశ్ అంటే హైదరబాదు..హైదరబాదు అంతే అంధ్రప్రదెశ్ . హైదరాబాదు కాకుండా రాష్త్రంలో ఒక్క జిల్లా ఐనా లేదా పట్టణమైన self sufficient ఐనది చూపించండి చూద్దాం! వూల్లో దోమలకి పొగవేయడానికి కూడా డబ్బులు హైదరాబాదు నుంచి మంజూరు అవ్వాలి.ఈ రాష్త్రంలో వుద్యోగాలు create చేయబదుతున్న ఏకైక పత్తనం హైదరబాదు. ఇప్పుడు ఈ రాష్త్రాన్ని రెండుగా చేసినా , మూడుగా చేసిన అందరికి హైదరబాదులో సమాన వాటా దక్కాలి. అంతేనా కాదా? ఇప్పుడు జరుగుతున్న సమైక్యవాద పోరాటం అందుకే!
kukat pally, SR nagar and Vanasthalipuram meedi(Andradi). Migilina Hyd maadi(telangaanadi).
1921 లో సింగరేణి
1937లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ
1942లో ఆల్విన్ మెటల్ వర్క్క్
1943లో ప్రాగా టూల్స్
1946లో సిర్ఫూర్ పేపర్ మిల్స్
1947లో హైదరాబాద్ ఆస్బెస్టాస్
ఇవి మూతపడలేదు. ఇప్పటికీ నడుస్తున్నాయి. వేఱే పేర్లతో నడుస్తున్నాయి. ఇవి నష్టాల్లో పడితే వీటిని వేఱే కంపెనీలు కొనుక్కోవడం జఱిగింది.
సుబ్రమణ్యం గారూ..
రాష్ట్రంలో ప్రైవేటు షుగర్ కంపెనీలు లాభాల్లో ఉన్నప్పుడు.. ఒకప్పుడు దేశంలోనే పెద్దదైనా నిజాం షుగర్స్ ఎలా నష్టాల బాట పట్టింది. కంపెనీని లాభాల్లోకి తీసుకొచ్చే అవకాశం ఉన్నా.. కేవలం యాభైకోట్లకే.. ఆంధ్రా ప్రాంతానికి చెందిన డెక్కన్ షుగర్స్‌కు చంద్రబాబు ఎందుకు అమ్మాల్సి వచ్చింది?
ఇక ఆల్విన్ కంపెనీలోని రిఫ్రిజిరేటర్స్ విభాగాన్ని మాత్రమే వోల్టాస్‌కు అమ్మారు. దేశంలో పదిశాతం మార్కెట్‌ను కలిగి ఉన్న ఆల్విన్ వాచ్ డివిజన్ పూర్తిగా మూత పడిపోయింది.
కేంద్ర అధీనంలో ఉన్న కంపెనీలు లాభాల్లో ఉన్నప్పుడు రాష్ట్ర పరిధిలోని సంస్థలు మాత్రం నష్టాల్లోకి ఎందుకు వెళ్లాయి. ప్రాగాటూల్స్ కూడా ప్రస్తుతం పనిచేయడం లేదు.
Some guys are asking how much % of income is coming from HYD. Please disclose this also. If they want discard the HYD income from Telangana, you people should ready to discard income from Vishakapatnam also and some other cities.
ముస్లిం ఫోరమ్ ఫర్ తెలంగాణా వాదన ఇలా ఉందిః
* మజ్లిస్ పార్టీ ఒక్కటే తెలంగాణా ముస్లిములకు ప్రతినిధి కాదు.తెలంగాణా ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడితే ముస్లిములకు భద్రత ఉండదని మజ్లిస్ పార్టీ చేసే వాదన నిజంకాదు.అలాగైతే తెలంగాణా లోని మిగతా జిల్లాల ముస్లిములు తెలంగాణా కావాలని ఉద్యమాలు ర్యాలీలు ఎందుకు చేస్తున్నారు?సమైక్య రాష్ట్రంలో ముస్లిములకు వచ్చిన 4% రిజర్వేషన్లు జనాభా ప్రాతిపదికన తెలంగాణాలో పెరిగే అవకాశం ఉంటుంది.తెలంగాణా ఏర్పడితే ముస్లిములకు ఉద్యోగాలు,పదవులు జనాభా దామాషాలో పెరుగుతాయి.ఇక్కడ 224 ఏళ్లుగా ఉర్దూ అధికార భాషగా ఉంది.ప్రభుత్వ అధికారిక లావాదేవీలు ఉర్దూ భాషలోనే జరిగేవి.ఉర్దూ స్థానిక ప్రజాభాష కాబట్టి మళ్ళీ ఉర్దూకు మంచి ఆదరణ పూర్వ వైభవం వస్తుంది.గల్ఫ్ దేశాలకు వెళ్లి జైళ్లలో మగ్గుతున్న వేలాదిమంది ముస్లిం యువకులు తిరిగి వచ్చి ఇక్కడే ఉద్యోగాలు,వ్యాపారాలు సంపాదించుకుంటారు.హైదరాబాద్ చుట్టూ రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఆక్రమించిన వేలాది ఎకరాల వక్ఫ్ భూములు,ముస్లిం ఆస్తులు విడిపించి పేదముస్లిములకోసం వినియోగించవచ్చు.ఇరుకు సందుల్లో పాతబస్తీల్లో దుర్భర దారిద్య్రంలో జీవిస్తున్నముస్లింలను ఫుట్‌పాత్‌లపైనుండి సొంత గృహాల్లోకి తేవచ్చు.విద్యావంతులైన ముస్లిములు రౌడీషీటర్లు, ఐఎస్ఐ ఏజెంట్లు లాంటి నిందలు తొలగించుకొని బాధ్యతాయుతమైన తెలంగాణా సోదరులందరితో సమాన అవకాశాలు సాధిస్తారు.
ఆనాడు తొందరపడి ఇతర రాష్ట్రాల్లో కలిపేసిన తెలుగు ప్రాంతాలు ఇవిః
ఒడిసా – గంజాం,బరంపురం,కోరాపుట్,పర్లాకిమిడి.
కర్నాటక – చిత్రదుర్గ,కోలార్,బళ్ళారి.
మహారాష్ట్ర – చంద్రపూర్,గచ్చిబోల్
చత్తీస్గడ్ – బీజాపూర్,బస్తర్,దంతెవాడ.
తమిళనాడు – హోసూరు,దేవనపల్లి,కృష్ణగిరి,డెంకణికోట.
పాండిచేరి -యానాం
సమైక్య ఆంధ్ర(ఆంధ్రప్రదేశ్)కే బీటలు పడుతుంటే,ఇక పై తెలుగు ప్రాంతాలతో కలిసిన మహా తెలుగునాడు(విశాలాంధ్ర)ఆవిర్భవిస్తుందా?