30, డిసెంబర్ 2009, బుధవారం
ఢిల్లీ పిలిచింది
రాష్ట్రంలో బుధవారం రోజు కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. తెలంగాణ ఉద్యమకారులు, జేఏసీ ప్రకటించిన బంద్ విజయవంతమయ్యింది. తెలంగాణ అన్ని జిల్లాల్లోనూ జనజీవనం స్తంభించిపోయింది. ఇక.. సాయంత్రం అయ్యేసరికి ఢిల్లీలోనూ స్పందన కనిపించింది. రాష్ట్రంలో చెలరేగిన ఆందోళనలకు ఎలాగైనా తెరవేయాలని భావిస్తున్న కేంద్ర ప్రభుత్వం వ్యూహాత్మకంగా చర్చలకు పిలిచింది. రాష్ట్రంలోని ప్రధాన పార్టీలైన.. కాంగ్రెస్, టీడీపీ,టిఆర్‌ఎస్, బీజేపీ, పీఆర్పీ, ఎంఐఎం, సీపీఐ, సీపీఎం పార్టీలను చర్చలకు ఆహ్వానించింది. జనవరి 5న హోమంత్రిత్వశాఖ ఆద్వర్యంలో చర్చలు జరుగుతాయి. దీంతో..ప్రస్తుతం ఆందోళనలు ఆగిపోయేలా కనిపిస్తున్నాయి. అన్ని పార్టీలు ఈ ప్రకటనపై హర్షం వ్యక్తం చేశాయి. అయితే.. సమావేశానికి వెళ్లడానికి ముందే.. తెలంగాణపై స్పష్టమైన ప్రకటనను అన్ని పార్టీలు చేయాలని ఓయూ జేఏసీ హెచ్చరించింది. వివాదం సమసిపోవడంతో.. నూతన సంవత్సర వేడుకుల యధాతథంగా జరిగే అవకాశం ఉంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి