29, డిసెంబర్ 2009, మంగళవారం
పార్టీ చేస్తే.. అంతుచూస్తాం..
కులమతాలు.. వర్గ విభేదాలు లేకుండా.. అంతాకలిసి జరుపుకునే ఏకైక పండుగ న్యూఇయర్. ప్రపంచ వ్యాప్తంగా జరిగే ఈ సంబరాల్లో.. మనదీ కీలకమైన పాత్రే. అయితే.. ఈసారి మాత్రం.. జోరుగా పార్టీలు సాగే సూచనలు కనిపించడం లేదు. ప్రతీ ఏడాది.. డిసెంబర్‌లో న్యూఇయర్ ఈవెంట్స్ అంటూ.. భారీగా ప్రకటనలిచ్చే హోటల్స్ , రిసార్ట్స్ అన్నీ ఈ సారి కామ్‌గా ఉన్నాయి. టాలీవుడ్ స్టార్లతో సందడి చేసే ప్రోగ్రామ్స్‌కూడా పెద్దగా లేవు. చాలావరకు తెలుగు సినిమా హీరో, హీరోయిన్లు ఈ సారి సెలబ్రేషన్స్‌కు దూరంగా ఉన్నారు. పైగా... ఉస్మానియా యూనివర్సిటీ జేఏసీ కూడా.. రిసార్టులు, పబ్‌లు, హోటళ్లకు న్యూఇయర్ వేడుకలు నిర్వహించకూడదని హెచ్చరికలు చేసింది. పొరపాటున చేస్తే.. దానికి తగ్గ ఫలితం అనుభవించాల్సి వస్తుందంటోంది. దీంతో.. న్యూఇయర్ సెలబ్రేషన్స్‌పై నీలినీడలు కమ్ముకున్నాయి.
ఏడాది క్రితం దాకా జోరుగా పార్టీలు..
హైదరాబాద్ కాస్మోపాలిటన్ సిటీగా మారడంతో.. ఐదారేళ్లుగా.. న్యూఇయర్ సెలబ్రేషన్ కనీవినీ ఎరుగని రీతిలో జరుగుతున్నాయి. 2008, 2009ల్లో ఈ ఉత్సవాలు.. చాలా ఘనంగా జరిగాయి. నగరంలోని అన్ని హోటల్స్.. రిసార్టులు... ప్రత్యేకంగా కార్యక్రమాలు రూపొందించాయి. టాలీవుడ్ హీరోలు, హీరోయిన్లతో కొన్ని షోలు జరిగితే.. డీజేలు.. స్పెషల్ గెస్ట్‌లతో మరికొన్ని చోట్ల సెలబ్రేషన్స్ జోరుగా సాగాయి. గత ఏడాది హైదరాబాద్‌లోని దాదాపు అన్ని రిసార్ట్‌లు, హోటల్స్ ఇలా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించాయి. అన్‌లిమిటెడ్ ఎంజాయ్‌మెంట్‌తో పాటు.. ఫుడ్, లిక్కర్ కూడా.. అందించడంతో.. ఈ ప్రోగ్రామ్స్‌కి రెస్పాన్స్‌కూడా భారీగానే వచ్చింది. దాదాపు నెల రోజుల ముందు నుంచే బుకింగ్స్ ప్రారంభించి.. భారీగానే సొమ్ము చేసుకున్నాయి. ఇక పబ్‌ల సంగతి సరేసరి. లాస్ట్ టు ఇయర్స్‌కీ.. సిటీలోని అన్ని పబ్‌లు హౌస్‌ఫుల్ అయ్యాయి. డీజేల మ్యూజిక్‌కి.. స్టెప్పులు వేస్తూ.. జెనెక్స్.. స్పెషల్‌గా న్యూయర్‌కి వెల్‌కమ్ చెప్పారు.. మొత్తంమీద చూస్తే.. గత ఏడాది డిసెంబర్ 31న దాదాపు 300 కోట్ల రూపాయలకు పైగా.. బిజినెస్ జరిగిందే.. సెలబ్రేషన్స్ ఏస్థాయిలోజరిగాయో ఊహించుకోవచ్చు.
తెలంగాణ ఎఫెక్ట్
తెలంగాణ సాధన కోసం... కేసీఆర్ నిరాహారదీక్ష.. ఆ తర్వాత.. సీమాంధ్రలో ఆందోళనలు.. మళ్లీ.. తెలంగాణలో పోరాటం.. వీటన్నిటి ఫలితంగా.. రాష్ట్రంపై ఉద్యమ ప్రభావం తీవ్రంగా పడింది. ముఖ్యంగా.. హైదరాబాద్ కేంద్రంగా... తెలంగాణ ఆందోళనలు కొనసాగుతుండడంతో.. సిటీలో శాంతిభద్రతల సమస్య తీవ్రంగా ఉంది. ఎప్పుడు.. ఎక్కడ గొడవ జరుగుతుందో అన్న ఆందోళన నగరవాసులది. దీనికి తోడు.. బుధవారం బంద్‌కు తెలంగాణ జేఏసీ సంఘాలు పిలుపునివ్వడంతో.. దాని ప్రభావం నూతన సంవత్సర వేడుకలపై పడే అవకాశాలే ఎక్కువ. ఇప్పటికే.. చాలా హోటల్స్.. రిసార్ట్ తమ ప్రోగ్రామ్స్‌ను రద్దు చేసుకున్నాయి. క్రిస్‌మస్ రోజుకే.. న్యూయర్ బుకింగ్స్ దాదాపుగా పూర్తయిపోతాయి. కానీ ఈసారి ఆ పరిస్థితి లేదు. న్యూయర్ ప్రోగామ్స్‌కు సిటీ నుంచి సరైన రెస్పాన్సే లేదు..ఈ ఏడాది హైదరాబాద్‌లో బిగ్గెస్ట్ ఈవెంట్ అంటే.. శివార్లలోని లియోనియోదే. టాలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్.. చక్రి, హీరోయిన్లు.. శ్రద్దాదాస్, నవనీత్ కౌర్‌లతో స్పెషల్ ప్రోగ్రాంను డిజైన్ చేసింది. సినీతారలు పాల్గొంటున్న ఏకైక షో కూడా ఇదొక్కటే కావడం విశేషం. డిసెంబర్ 31కి.. ఎక్కువమందే తమ రిసార్ట్స్‌కు వస్తారని అంచనా వేస్తోంది లియోనియో యాజమాన్యం. వీరితో పాటు.. మరికొన్ని స్పెషల్ ఈవెంట్లను కూడా.. ఇయర్ ఎండ్‌కి ప్రజెంట్ చేస్తామంటోంది. న్యూఇయర్ బిజినెస్‌పై ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. అందుకే.. పెద్దగా ఖర్చుపెట్టడానికి కూడా ఆసక్తి చూపించడం లేదు. వీలైనంతవరకూ.. ఏదోలా నెట్టుకొచ్చేద్దాం అన్న అభిప్రాయమే రిసార్ట్స్‌లో కనిపిస్తోంది. నగరవాసులనుంచి పెద్దగా రెస్పాన్స్ లేకపోవడంతో.. హైప్రొఫైల్ కార్యక్రమాలకు బదులు.. రెగ్యులర్ కస్టమర్లను ఆకట్టుకోవడానికే ప్రయత్నిస్తున్నాయి. న్యూఇయర్ ప్రోగ్రామ్స్ టికెట్ రేట్స్ గతంతో పోల్చితే భారీగా తగ్గిపోయాయి. కస్టమర్లను ఆకట్టుకోవడానికి రిసార్ట్స్‌లో నైట్ స్టేకు అవకాశం ఇస్తామంటున్నాయి. పికప్ అండ్ డ్రాపింగ్ కూడా చేస్తామంటూ కొన్ని సంస్థలు ప్రకటనలిస్తున్నాయి.. టాలీవుడ్ స్టార్లు, బాలీవుడ్ సింగర్లతో జోరుగా నడిచే.. న్యూఇయర్ సెలబ్రేషన్స్.. ఈసారి డిజే షోలకు పరిమితం కానున్నాయి. దాదాపు.. అన్ని ప్రోగ్రామ్స్‌కూడా.. డిజేలే నిర్వహిస్తున్నారు. ఈ సారి.. మహా అయితే.. 150 కోట్లకు మించి హైదరాబాద్‌లో న్యూఇయర్ బిజినెస్ జరగదని అంచనా. గత ఏడాది ఖర్చులో ఇది సగం మాత్రమే. పైగా.. వరుస బంద్‌లు ధర్నాలతో.. ఎలాంటి సమస్యలు వస్తాయో అన్న ఆందోళన జెనెక్స్‌ది. అందుకే.. వీలైనంతవరకూ.. అవుట్‌సైడ్ పార్టీలకు దూరంగా ఉండాలనుకుంటున్నారు. దీనికి తోడు.. ఇప్పుడు జేఏసీ ఇచ్చిన పిలుపు ఎలాగూ ఉంది. బయట అడుగు పెడితే.. సేఫ్‌గా తిరిగి వస్తారన్న గ్యారెంటీ లేదు.. సో.. వీలైనంతవరకూ.. ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకోవడానికి ట్రై చేయండి.. లేదంటే.. నానా కష్టాలు తప్పకపోవచ్చు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి