12, డిసెంబర్ 2009, శనివారం
సమైక్య నినాదం ఎవరిది?
తెలంగాణ ఏర్పాటును వ్యతిరేకిస్తూ.. ఆంధ్రా రాయలసీమల్లో సమైక్యవాదం ఊపందుకొంది. వారి ఉద్యమాన్ని మనం తప్పుపట్టలేం. తెలంగాణ కోసం.. ఎంతోకాలంగా పోరాటం జరుగుతున్నా.. ఇంతకాలం మాట్లాడకుండా కూర్చున్నవారు.. ఇప్పుడే ఎందుకు రోడ్డెక్కాల్సి వచ్చింది. ఈ విషయాన్ని పక్కన పెడితే ఇక్కడ గుర్తించాల్సిన అంశం.. తెలంగాణ. ఒక్క ఆంధ్రాప్రాంతంలో మాత్రమే సమైక్య పోరాటం సాగుతోంది. అదే తెలంగాణలో ఒక్కరు కూడా.. సమైక్య రాష్ట్రాన్నే కొనసాగించాలని పోరాటం చేయడం లేదు. ఒకే భాష అయినప్పటికీ.. భిన్నసామాజిక నేపథ్యం.. సంస్కృతి ఉన్న రెండు ప్రాంతాలు కలిసి ఉండాలంటే.. రెండు ప్రాంతాల ప్రజలకూ ఇష్టం ఉండాలి. కానీ.. సమైక్యకు తెలంగాణలో ఎవరూ సముఖంగా ఉన్నట్లు కనపడడం లేదన్నది తాజా పరిణామాలతో తేలిపోయింది. అయినా.. ఆంధ్రా, రాయలసీమ వాళ్లు మాత్రం.. సమైక్యాంధ్ర కావాలంటూ డిమాండ్ చేయడం విడ్డూరమే. ప్రజల సంగతి పక్కన పెడితే.. కాంగ్రెస్ కానీ, తెలుగుదేశం కానీ.. ఇతర సంస్థలకు చెందిన వారు గానీ.. తెలంగాణలో.. సమైక్యరాగాన్ని వినిపించడం లేదు. ఓ కీలకమైన ప్రాంతానికి ఇష్టం లేకుండా.. సమైక్యంగా ఎలా ఉంటారు...
ఒక్కసారి తేడా వచ్చాక.. ఎన్ని సర్దుబాట్లు చేసుకున్నా విబేధాలు మాత్రం సమసిపోవు. చిన్న చిన్న కుటుంబాల్లోనే సమస్యలు వచ్చి వేరు పడిపోతున్నారు. చివరకు తల్లిదండ్రులకు ఒక్కడే కొడుకు ఉన్నా.. వేరు కుంపటి పెట్టుకుంటున్నారు. అలాంటిది.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైతే సమస్యేమిటి? అయినా.. తెలంగాణ ఇప్పటికిప్పుడు రాష్ట్రంగా తయారవ్వడం లేదు.. ఆంధ్రప్రదేశ్ ఏర్పడకముందే రాష్ట్రంగా ఉంది. మరో విషయం.. తెలంగాణ ప్రజలు.. తెలంగాణ నాయకులు తిడుతూ ఉంటే.. కలిసే ఉంటామనడానికి ఆంధ్ర,సీమ వాసులకు పౌరుషం లేదా.. ఆంధ్రా,సీమల్లో పటిష్టమైన నాయకత్వం లేదా.. వనరులు లేవా.. ఇదంతా కొంతమంది రాజకీయ నాయకులు తమ స్వలాభాల కోసం సృష్టిస్తున్న వివాదం మాత్రమే. ఆత్మగౌరవానికి విలువిచ్చే మనం.. ఇలా తిట్లు తింటూ ఉండడం కరక్టేనా..
అయినా.. ఆంధ్రా, రాయలసీమ ప్రజలు ఇక్కడ పోరాడాల్సింది సమైక్యం కోసం ఎంతమాత్రం కాదు.. వారి హక్కుల కోసం. వారికి రావల్సిన నిధుల కోసం.. తెలంగాణ ఏర్పడితే.. రాయలసీమ, ఆంధ్రాలు కలిసే ఉండాలా లేదా అనేదానిపైన తక్షణ నిర్ణయం తీసుకోవడం కోసం. ఇవన్నీ చేయకుండా.. రాజకీయ నాయకులు చెబుతున్నట్లు గుడ్డిగా అడుగులేస్తే.. మిగిలేది ఏమీ ఉండదు.. బూడిద తప్ప...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
హ్య్దరాబాదు ఇచ్చి తెలంగానా తీసుకో.. ఎవ్వరూ మాత్లాడను కూడా మాట్లాడరు. ఇక పౌరుషమంటావా.. ఎవరి మీద చూపించాలి పౌరుషం. కాష్మీర్ కూడా భారత్ నుండి విదిపోతానని అంటుంది. కాష్మీరీలు చాలామంది భారత్ ను వ్యతిరేకిస్తారు. అందుకని పౌరుషానికి పోయి కాష్మీర్ ఇస్తారా? అలా ఇస్తే దాన్ని పౌరుష మంటారా లేక తెలివి తక్కువ తనమంటారా. సీమ వాసులు , ఆంధ్రావాసులు,తెలంగానా వాసులూ అందరూ పౌరుష వంతులే. తెలివి తక్కువగా ప్రవర్తించకుండా ఆగుతున్నారంతె..
అజ్ఞాత,
హైదరబదు తొ కూడిన సమైక్యవాదం అన్నమాట, సమైక్యవాదం అంటే అంతా ఒక్కటె అనుకుంటున్నా నేనైతే,
మీవి అన్ని పై పై మాటలు, హ్య్దెరబదు మాత్రమే తీసుకెంటె అది సమైక్యంధ్రా ఎలా అవుతుంది..
ఫణి
సమైక్యాంధ్ర అంటే హైదరాబాద్ మీద ప్రేమ. హైదరాబాద్ మీద ప్రేమ అంటే తెలంగాణా మీద ద్వేషం.
రైల్వేలో మన రాష్ట్రానికి ఎప్పుడూ అన్యాయమే జరుగుతోంది కాబట్టి,ఆంధ్రపదేశ్ని ప్రత్యేక దేశంగా ప్రకటించాలి లాంటి వితండవాదనలు ఏదో రకంగా మొండిగా సమైక్యవాదాన్ని సమర్దించటం కోసమే గానీ వాదనలో పస లేదు.జై ఆంధ్ర అంటాను జైతెలంగాణా అంటాను.విడిపోతే తప్పేంటి అనే వెంకయ్యనాయుడులాగా సమైక్యవాదులు ఎందుకు కలిసుండాలో కారణాలతో సహా స్పష్టంగా చెప్పాలి.మన పక్కనే ఉన్న యానాం ను రాష్ట్రంలో కలపాలని అడగకుండా సమైక్యవాదులు ఎందుకు విడిచిపెడుతున్నారో అర్ధం కావటం లేదు.ఆంధ్రప్రదేశ్లోని తూర్పుగోదావరి జిల్లాలో కాకినాడ దగ్గర 30చ.కి.మీ.విస్తీర్ణం ఉన్న కేంద్రపాలిత ప్రాంతం యానాం . దాదాపు 30వేల జనాభా.యానాం పర్యాటక ప్రాంతం. యానాం వార్తలు తూర్పుగోదావరి పేపర్లలోనే వస్తాయి.యానాంకు రాజధాని పాండిచ్చేరి సుదూరంగా తమిళనాడులో870కి.మీ దూరంలో ఉంది .యానాం 1954 దాకాభారత్ లో ఫ్రెంచ్ కాలనీగా ఉంది.నేడు పుదుచ్చేరి కేంద్ర పాలిత ప్రాంతంలో భాగం.1954లో లో విమోచనం చెంది స్వతంత్రభారతావనిలో విలీనంచెందినా 1956 లో భాషా ప్రాతిపదికన తెలుగు రాష్ట్రంలో కలవలేదు.1948లో హైదరాబాద్ ను పోలీసు చర్యజరిపి ఇండియాలో కలిపారు.1949 లో అప్పటికి ఒక ఫ్రెంచి కాలనీ గా ఉన్న చంద్రనాగూర్, సమీపంలోని బెంగాల్ రాష్ట్రంలో విలీనం అయింది. కాకినాడ మునిసిపల్ కౌన్సిల్ కూడా యానాన్ని కలపాలని తీర్మానం చేసింది. 870కి.మీ దూరంలోని తమిళ పుదుచ్చేరి నుండి పాలన కష్టంగా ఉంది.పుదుచ్చేరికి యానాం ప్రజల ప్రయాణం ఆంధ్రలోని కాకినాడ నుండి జరుగుతుంది.దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని యానాంలో ఏర్పాటు చేయాలని యానాం కాంగ్రెస్ తీర్మానించింది.ఇండోర్ స్టేడియం,కళ్యాణమండపం,ధవళేశ్వరం-యానాం మంచినీటి ప్రాజెక్టులకు రాజశేఖరరెడ్డి పేరు పెడతామని పుదుచేరి రెవిన్యూ మంత్రి మల్లాడి కృష్ణారావు చెప్పారు. తెలుగుజాతి సమైఖ్యత,భాషాప్రయుక్తరాష్ట్ర ప్రధాన ఉద్దేశ్యం యానాం ఆంధ్రప్రదేశ్ లో కలిస్తే నెరవేరుతుంది.తెలుగుతల్లి బిడ్డలందరూ ఒకేరాష్ట్రంగా ఉంటారు.సమైక్యాంధ్ర కోసం ఇప్పుడు ఉద్యమాలు జరుగుతున్నాయి గనుక భౌగోళికంగా సామీప్యత, 100% తెలుగు ప్రజలున్న యానాం ను ఇప్పటికైనా తమిళ పుదుచ్చేరి నుండి విడదీసి సమైక్యాంధ్రలో కలపాలి.కలిస్తే బాగుంటుందని ఆశ.యానాంను తెలుగు ప్రాంత పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెయ్యాలి.
ఆనాడు తొందరపడి ఇతర రాష్ట్రాల్లో కలిపేసిన తెలుగు ప్రాంతాలు ఇవిః
ఒడిసా – గంజాం,బరంపురం,కోరాపుట్,పర్లాకిమిడి.
కర్నాటక – చిత్రదుర్గ,కోలార్,బళ్ళారి.
మహారాష్ట్ర – చంద్రపూర్,గచ్చిబోల్
చత్తీస్గడ్ – బీజాపూర్,బస్తర్,దంతెవాడ.
తమిళనాడు – హోసూరు,దేవనపల్లి,కృష్ణగిరి,డెంకణికోట.
పాండిచేరి -యానాం
సమైక్య ఆంధ్ర(ఆంధ్రప్రదేశ్)కే బీటలు పడుతుంటే,ఇక పై తెలుగు ప్రాంతాలతో కలిసిన మహా తెలుగునాడు(విశాలాంధ్ర)ఆవిర్భవిస్తుందా?
యానాం విషయంలో యాగీ చేయాల్సిన అవసరం లేనే లేదు.అది పుదుచ్చేరిలోవుండడంవల్ల పుదుచ్చేరిలో తెలుగువారికీ, తెలుగుభాషకూ బలం, గౌరవం ఎక్కువ అవుతాయి. అదే మంచిది. పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా వుండిన సుబ్బయ్య కూడ తెలుగువాడే ననుకుంటాను. అది అంతా అరవమయం కాకుండా వుండాలంటే యానాం పుదుచ్చేరిలోనే వుండడం శ్రేయస్కరం.
యానాం 32,000 జనాభా ఉన్న చిన్న పట్టణం కనుకే సమైక్యవాదులు యానాంని విలీనం చెయ్యాలని డిమాండ్ చెయ్యడం లేదు. దక్షిణ ఒరిస్సాలోని పరలాకిమిడి 42,000 జనాభా ఉన్న చిన్న పట్టణం. దాన్నైనా విలీనం చెయ్యాలని డిమాండ్ చెయ్యరు. హైదరాబాద్ 40,00,000 పైగా జనాభా ఉన్న నగరం కనుకనే సమైక్యవాదులు కోరుతున్నారు.
avunu ra nuvu matram vurukuntava enti hyd lekunta telanga istamante nuve ela ante memu kuda alane vuntam kada