11, డిసెంబర్ 2009, శుక్రవారం
తెలంగాణ కాక..!
తెలంగాణ సమస్య మరిన్ని కొత్త సమస్యలకు ఆజ్యం పోస్తున్నది. ేకంద్రం ఒేక ఒక సంక్షిప్త ప్రకటన చేసిందో లేదో.. తెల్లారేసరికి రాష్ట్రం లోని మిగతా ప్రాంతాల్లో ఒక్కసారిగా భగ్గున అగ్గి రగిలింది. పార్టీలతో ప్రమేయం లేకుండా ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన బాట పట్టారు. హైదరాబాదు నుంచి ఢిల్లీ దాకా ఈ నిరసన జ్వాలలు వ్యాపించిన నేపధ్యంలో ఎవరి కర్తవ్యం ఏమిటి?
సర్వాధికారి.. ఏదీ దారి!
ఒక్కసారిగా తేనె తుట్టెని కదిపారు. అయిదేళ్ల పాటు హాయిగా ధిలాసాగా పాలన సాగింది. ఇంత పెద్ద కీలక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం రాలేదు. ఇంతటి వివాదాస్పద నిర్ణయం ఏదీ తీసుకోలేదు. యుపీయే కనీస ఉమ్మడి ఎజెండాలో తెలంగాణ చేర్చినా అయిదేళ్ల పాటు దాన్ని ముట్టుకోలేదు. మొన్నటికి మొన్న లోక్‌సభ ఎన్నికల్లో కూడా దాని జోలికి పోకుండానే ఎన్నికల గోదావరి ఈదారు. తెలంగాణపై తొలి నిర్ణయమైతే తీసుకున్నారు గాని తర్వాత రాబోయే సమస్యలపైనే అందరి దృష్టి ఉంది. కోరి కోరి తెలంగాణ బంతిని తన కోర్టులోకి ఆమే స్వయంగా లాక్కున్నారు. ఇక దాన్ని సక్రమంగా గోల్‌లోకి ఎలా వేస్తారన్నది చూడాలి. ఆంధ్ర, రాయలసీమ ఎంపీలను ఆమె ఎలా బుజ్జగిస్తారన్న దాని మీద భావి సంక్షోభం ఆధారపడిఉంది. ఒక వేళ ఎంపీలు స్ధానికంగా ప్రజా ఒత్తిడిని తట్టుకోలేని పరిస్థితులే వస్తే కేంద్రంలో యూపీయే ప్రభుత్వపు అస్థిత్వమే ప్రమాదంలో పడుతుంది.
ప్రతిపక్షం కూడా బలంగా లేని ఈ దశలో ఏరికోరి స్వపక్షంలోనే సంక్షోభాన్ని కొని తెచ్చుకున్నారా అనిపించేంతగా సమస్య తీవ్ర రూపం దాలుస్తున్నది. తెలంగాణా చిచ్చు ఒక్క ఈ రాష్ట్రానికే పరిమితం కాబోవడం లేదు. ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో కొనసాగుతున్న ఉద్యమాలు తీవ్రం కావచ్చు. ఒక బోడోలాండ్.. ఒక విదర్భ.. ఒక గూర్ఖాలాండ్.. వీటికోసం గొంతులు లేస్తున్నాయి. మొత్తానికి ప్రత్యేక రాష్ట్రాలకు సుముఖం అన్న సందేశాన్ని సోనియా పరోక్షంగా ఇచ్చినట్లయింది. అఖిల పక్షం పెట్టి అన్ని పార్టీల మనోభిప్రాయాలను తెలుసుకోండని అడగడం ఒక ఎత్తయితే..ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని నేరుగా ఢిల్లీకి పిలిపించి, తెలంగాణా తీర్మానాన్ని అసెంబ్లీలో పెట్టండని సూచించడం మరో ఎత్తు. తద్వారా సోనియా గాంధీ చాలా అడుగులు వేసేశారు. తీర్మానంతో సరిపుచ్చి కాలయాపన చేయడానికి ఆస్కారం లేదు. తాత్సారం చేస్తే ఒక జాతీయ పార్టీగా విశ్యసనీయత ప్రశ్నార్ధకమవుతుంది.
ముఖ్యంగా సోనియా గాంధీ మాట నీటి మూటవుతుంది. ఇది యావత్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ సమగ్రతను దెబ్బతీయొచ్చు. పార్లమెంటులో ప్రతిసారి ఇతర పక్షాల నుంచి ప్రశ్నలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈ పరిస్థితుల్లో ఆమె దీని మీద ఎలాంటి కార్యాచరణతో ముందుకెళ్తారో చూడాల్సిందే. సమస్యను ఒక్క కోణంలో నుంచే చూడటం వల్ల వచ్చిన అనర్ధమిది. ఒక ప్రాంతాన్ని ప్రసన్నం చేస్తే సహజంగానే మిగతా ప్రాంతాలు నొచ్చుకుంటాయి. ఈ ప్రాంతీయ సూత్రాన్ని ఏకపక్షంగా అమలు చేసి ఊహించని సంక్షోభంలో పడ్డారు. కోస్తా, రాయలసీమ ఎంపీలు ఇప్పటికే తమ మనోగతాన్ని ఆమె ముందుంచారు. బంతిని ఎటు నెట్టాలో ఎలా నెట్టాలో ఆమె చేతుల్లోనే ఉంది. ఆ బంతి ఎటు పోతుందనేది ఎవరి చేతుల్లోనూ లేదు.
నిమిత్తమాత్రం.. ఇదే మంత్రం
గోరు చుట్టు మీద రోకటి పోటంటే అది రోశయ్యకే అనుభవం. ముఖ్యమంత్రి అయిన మరుక్షణం నుంచి సమస్యలు, సంక్షోభాల సుడిగుండంలో మునుగుతూ.. తేలుతూ నెట్టుకొస్తున్నారు. అధిష్టానం ఆశీస్సులతో అం దలమెక్కి.. అదే అధిష్టానం తీసుకున్న ఒకే ఒక నిర్ణ యంతో డోలాయ మానంలో పడిన ముఖ్యమంత్రిగా చరిత్రకెక్కారు. అధిష్టానం ఏరి కోరి సంక్షోభ కాలంలో గద్దెనెక్కించింది. అధిష్టానం ఏది చెబితే అదే చేస్తానంటూ క్షణక్షణం తన విధేయతను చాటుకుంటూ గడుపుగతున్న తరుణంలో కేసీఆర్ దీక్ష రూపంలో ఆయనకు పరీక్ష ఎదురైంది. ప్రతి దానికీ అధిష్టానం చెయ్యమంటే చేస్తానంటూ నిస్సంకోచంగా చెబుతూ వస్తూ ఒక్కసారిగా పిల్లిమొగ్గ వేశారు.
తెలంగాణపై అసెంబ్లీలో తీర్మానం చెయ్యనంటే చెయ్యనం టూ ప్రగల్భాలు పలికారు. అప్పటికి అక్కడ ఢిల్లీలో పొలిటికల్ స్కెచ్ పూర్తయిపోయింది. ఆయన్ని ఢిల్లీ పిలిచారు. అప్పటికే హడావుడి మంతనాలు. అందులో రోశయ్య పాత్ర పరిమితం. చివర్లో ఆయన్ని పిలిచి విషయం చెప్పారు. అర్ధరాత్రి విమానమెక్కించి హైదరాబాదు పంపారు. విచిత్రం ఏమిటంటే అధిష్టానం అధికారికంగా ప్రకటించేదాకా ముఖ్యమంత్రి సరిగ్గా దానికి రివర్స్‌గా మాట్లాడుతూ వచ్చారు. అదంతా రాజకీయ వ్యూహంలో భాగమా లేక అధిష్టానం ఆయన దగ్గర కూడా విషయాన్ని గోప్యంగా ఉంచిందా అన్న సందేహం తలెత్తింది. మొత్తం మీద ముఖ్యమంత్రి ఈ విషయంలో తేలిపోయారు. తెలంగాణాపై కేసీఆర్ దీక్షకు సంబంధించి ఆయన పాలనాపరమైన నిర్ణయాల్లో తప్ప రాజకీయ నిర్ణయాల్లో భాగస్వామ్యం తీసుకోలేదు.
రాష్ట్ర సమస్యపై ఆయన మీద ఆధిష్టానం ఆధారపడాల్సింది పోయి ఆయనే ఆధిష్టానం వైపు చూస్తూ కూర్చున్నారు. ఇలా ఆయన రెండు రకాలుగా బలహీనుడిగా కనిపించారు. కీలక, ఉద్రిక్త సమయాల్లో రాజకీయ నిర్ణయాలు తీసుకోలేని బలహీనత ఒకటైతే, అధిష్టానం మొత్తం సమస్యని తన చేతుల్లోకి తీసేసుకోవడం మరో బలహీనత. వైఎస్ రాజశేఖర రెడ్డి శకం ముగిశాక పార్టీ, ప్రభుత్వం వేరు వేరు పట్టాల మీద పయనిస్తున్న సంగతి తెలంగాణా విషయంలో బైటపడిపోయింది. అవి రెండూ అంతర్లీనాలుగా వ్యవహరించలేదు. ఒక మంత్రిగా, అసెంబ్లీలో సభా వ్యవహారాల పర్యవేక్షకుడి పాత్రలో చతురుడిగా పేరున్న రోశయ్య ఇలా నిష్క్రియతో వెలవెలబోయారు. ఒక్కుమ్మడిగా ఎమ్మెల్యేల నుంచి వచ్చిన నిరసనకు రోశయ్య దగ్గర ఉపశమన మందు లేదు. ఈ అగ్గిని కేంద్రమే రగిలించింది కాబట్టి కేంద్రమే చూసుకుంటుందిలే అన్నది రోశయ్య తత్వంగా కనిపిస్తున్నది. నిజానికి ఇది ఆయన స్ధాయిలో తీసుకోదగ్గ అంశం కూడా కాదు. అలాగని ఆయన చేయి దాటిపోయిందని కాదు. అసలు ఆయన చేతి దాకా రాలేదు.
లేఖల భారం..డోలాయమానం
ఓ వంక అసెంబ్లీ జరుగుతున్నా స్పీకర్ మాత్రం మరో కీలక విధుల్లో తలమునకలవ్వాల్సిన విచిత్ర పరిస్థితి. దాదాపు మూడో వంతు సభ్యుల రాజీనామా లేఖలు ఆయన దగ్గర గుట్టగా ఉన్నాయి. అసెంబ్లీలో కనిపించాల్సిన సభ్యులు రాజీనామాలు ఇచ్చేయడంతో స్పీకర్ మీద ఇప్పుడు గురుతర భాధ్యత పడింది. వీరందరి రాజీనామాలు ఆమోదిస్తే సభలో బలాబలాలు తల్లకిందులవుతాయి. రాష్ట్ర ప్రభుత్వం సంక్షోభంలో పడుతుంది. స్పీకర్ వారందర్నీ ఒక్కక్కరినీ పిలిచి మాట్లాడి రాజీనామాలపై తుది నిర్ణయం తీసుకోవాలి. మరి స్పీకర్ అలా చేసి తాను సంతృప్తి చెందినట్లు భావిస్తే రాజీనామాలు ఆమోదిస్తారా? మామూలు పరిస్థితుల్లో అయితే అలా జరుగు తుంది. కాని ఇంత స్ధాయిలో మూకుమ్మడి రాజీనామాలను ఆమో దించాలంటే ముందు వెనుకలు ఆలోచించాలి.
ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల విషయంలోఅధిష్టానం ఆదేశాల మేరకు నిర్ణయం జరగవచ్చు. మరి ఇతర పార్టీల విషయంలో ఆయా పార్టీల అధినేతల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవచ్చు. ఏమైనా స్పీకర్‌కి ఇది అతి పెద్ద సవాలు. కిరణ్ కుమార్ రెడ్ఢి ఇంత వరకు ఏ స్పీకరూ ఎదుర్కోని అతి పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. ఇదంతా ఒక ఎత్తయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన నాయకుడిగా తన సభ్యత్వం విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకుంటారా అనేది మరో కోణం. అన్ని రాజీనామాలను ఆమోదించాలా..తానూ ఇదే క్యూలో ఉండాలా అనేది ఆయన ముందున్న సమస్య. స్పీకర్‌గా ఆయనకిది తొలి అనుభవం. అందులోనే ఈ సంక్షోభం ఆయనకు తొలి సవాలే. ఇక్కడొక సమస్య ఉంది.
ఇన్ని రాజీనామా లేఖల్లో ప్రతి ఒక్కటీ విడివిడిగా పరిశీలిస్తే..తేలేది ఒకే ఒక ఉమ్మడి అంశం. కాబట్టి కొన్ని ఆమోదించి కొన్నింటిని తిరస్కరించే అవకాశాలు చాలా చాలా తక్కువ. అసలు ఉండకపోవచ్చు. స్ధూలంగా ఒక విధాన నిర్ణయం తీసుకుంటే అన్నింటినీ ఆమోదించాల్సి వస్తుంది. అప్పుడు రాజ్యాంగ సంక్షోభమే. దీన్ని నివారించాలంటే కేంద్రం జోక్యం చేసుకోక తప్పదు. చివరకు రాష్టప్రతి పాలన అనివార్యం కావచ్చు.. నిజానికి ఇది ఆయా సభ్యుల వ్యక్తిగత అంశంలా కాకుండా పార్టీలు తమ తమ సభ్యుల విషయంలో విధాన నిర్ణయాలు తీసుకుంటాయి. ఆ పరిస్థితులను బేరీజు వేసుకుని స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. అప్పటి దాకా వీరంతా అసెంబ్లీ సభ్యులుగానే ఉంటారు. ఏదేమైనా అసెంబ్లీ భవితవ్యం కిరణ్‌కుమార్ చేతుల్లో ఉంది. తక్షణమే ఆమోదిస్తే కొత్త సంక్షోభం మొదలవుతుంది. తాత్సారం చేస్తే ప్రస్తుత సంక్షోభమే కొనసాగుతుంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కోస్తా ఆంధ్రలో ఆందోళనలు చేస్తున్నది రాజకీయ పార్టీల కార్యకర్తలూ, వీధి రౌడీలూ. రాజకీయ నాయకులు ఇచ్చే బ్రాందీ బాటిల్స్ కోసం వీళ్ళు బంద్ చెయ్యిస్తున్నారు.
సీకాకుళం లో pervert లు internet cafe లు పెట్టుకొని పెద్దమనుషులుగా తిరుగుతున్నారు :)