10, డిసెంబర్ 2009, గురువారం
నిన్నటిదాకా నిద్రపోయారా?
తెలంగాణ సెగ.. ఆంధ్రా నేతలను తాకింది. పార్టీలకతీతంగా.. ఆంధ్ర, రాయలసీమ నేతల నుంచి రాజీనామాలు వచ్చి పడుతున్నాయి. ఢిల్లీలోనూ ఎంపీల లాబీయింగ్ మొదలయ్యింది. తెలంగాణ కోసం.. ఎనిమిదేళ్లుగా జరుగుతున్న పోరాటం తుదిదశకు వచ్చేసరికి.. ఆంధ్రానేతలు ఇంతగా ఉలికిపడాల్సిన అవసరం ఏముంది? అంతా అధిష్టానానిదే.. తెలంగాణ అంశం సోనియా చేతుల్లో పెట్టాం. ఆమె ఏ నిర్ణయం తీసుకుంటే.. దానికే కట్టుబడి ఉంటాం.. ఇవన్నీ.. కాంగ్రెస్ పార్టీ నేతల మాటలు. మరి ఇవన్నీ ఇప్పుడు ఏమైపోయాయి. అయినా.. ప్రభుత్వం తెలంగాణ ప్రాసెస్ మొదలవుతుందని మాత్రమే చెప్పింది. అసెంబ్లీలో తీర్మానం పెట్టడం దగ్గర నుంచి కేంద్ర కేబినెట్ ఆమోదించి.. రాష్ట్ర విభజన చేయడానికి ఎంతోకాలం పట్టొచ్చు. ఏవైనా అభ్యంతరాలుంటే.. తీర్మానం సమయంలోనే చెప్పొచ్చు. కానీ.. కాంగ్రెస్, టీడీపీ, పీఆర్పీ ఎమ్మెల్యేలు అంతవరకూ ఆగకుండా.. ఏకపక్షంగా రాజీనామాలు చేస్తున్నారు. చట్టసభలో చర్చించే అవకాశం ఉన్నా.. ఆ అవకాశాన్ని ఉపోయోగించుకోకుండా.. ఉద్రేక పూరిత వాతావరణాన్ని సృష్టిస్తున్నారు. పైగా.. ఇదంతా వ్యక్తిగత అభిప్రాయాలంటూ.. పార్టీ అధినేతలు కప్పిపుచ్చే ప్రయత్నమూ చేస్తున్నారు. తీర్మానం పెట్టడానికి అంగీకరించి.. ఢిల్లీ నుంచి వచ్చిన ముఖ్యమంత్రి కూడా.. ఇప్పుడు అందరి ఆమోదం ఉంటేనే.. బిల్లు ప్రవేశపెడతామంటూ.. కొత్త పల్లవి అందుకున్నారు..
అయితే.. ఈ వ్యవహారానికి మరో కోణమూ ఉంది. ఆంధ్రా ప్రాంత ప్రజల నుంచి ఎదురయ్యే ఒత్తిడిని తట్టుకోవడానికే.. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ రాజీనామాలు చేస్తున్నారన్న వాదనా వినిపిస్తోంది. అందుకే.. పార్టీ అధిష్టానాలు ఈ రాజీనామాలపై ఇంతవరకూ సీరియస్‌గా స్పందించలేదు. నిజంగా ప్రజల కోసం చేస్తున్నారా.... స్థానికంగా హీరోలనిపించు కోవడానికే రాజీనామాలు చేస్తున్నారా? తెలంగాణకోసం పోరాటం జరిగినంతకాలం వీరంతా నిద్రపోయారా?
చివరకు తెలంగాణకు మద్దతు ప్రకటించి.. అసెంబ్లీలో బిల్లుపెడితే మద్దతు ఇస్తామన్న టీడీపీ, పీఆర్పీలు కూడా ప్లేటు ఫిరాయించాయి. ఈ పార్టీల నుంచీ పెద్ద ఎత్తున రాజీనామాలు కొనసాగుతున్నాయి. అర్థరాత్రి పూట.. ఎవరినీ అడగకుండా.. ఆంధ్రా ప్రజల మనోభావాలు తెలుసుకోకుండా తెలంగాణ ఏర్పాటు ప్రక్రియ మొదలుపెట్టడంపై చంద్రబాబు నాయుడు ఒంటికాలిపై లేచారు. తెలంగాణకు మద్దతు పలికినప్పుడు ఈ ఆవేశం.. ఈ మనోభావాలు ఏమయ్యాయి? మీది అవకాశవాద రాజకీయమా...
1969 తర్వాత మళ్లీ ఇప్పుడే.. పార్టీలకతీతంగా తెలంగాణ అంతా ఏకమయ్యింది. కేసీఆర్ కూడా పట్టువదలకుండా దీక్ష కొనసాగించడం... విద్యార్థులు పోరాటం చేయడంతో కేంద్రం.. తెలంగాణ విషయంలో దిగివచ్చింది. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు ఇంకా ఫైళ్లు కదలకుండానే.. మొత్తం ప్రక్రియకు ఉప్పుపాతర వేయడానికి మహాప్రయత్నం జరుగుతోంది. ఇప్పుడు తేలాల్సి ఒక్కటే.. ఇంతకు ముందులానే.. తెలంగాణ ఉద్యమాన్ని కాంగ్రెస్ హైజాక్ చేస్తోందా.... లేక .. నిజంగానే తెలంగాణ ఇచ్చే ఉద్దేశం ఉందా.. ఎంపీల రాజీనామా విషయంలో సీరియస్‌గా స్పందించిన సోనియా గాంధీ.. ఎమ్మెల్యేల విషయంలో ఏరకంగా స్పందిస్తారన్నదానిపైనే.. సమాధానం ఆధారపడి ఉంది..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
"నిన్నటిదాకా నిద్రపోయారా?" - కాదు. సంయమనం పాటించారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకునే ముందైనా తమతో సంప్రదిస్తుందని, తమ ప్రాంతాలకు కలిగే నష్టం గురించి కూడా తెలుసుకుంటుందని భావించి ఊరుకున్నారు. కానీ అధిష్టానం ఇంత పిరికిదని అర్థం చేసుకుని ఇప్పుడు రోడ్లెక్కారు.
విడిపోవాలంటే విడిపోవటానికి అందరూ రేడీ, కాకపోతే బ్లాక్మైల్ కు లొంగి, కిరసనాయల్ డబ్బాలకో లొంగి, నిర్ణయం తీసుకొంటాను అంటేనే, కోపం. కేంద్రప్రబుత్వం ఏమాత్రం బుఱ్ఱ పెట్టో, అందరనీ కలుపుకొనిపోతాను అంటేనో, KCR మురుగుకాలవ లాంటి నోటికి ప్లాస్టర్ వేసుకొంటాను అంటేనో, హైదరాబాద్ అందరదీ రాజధాని అంటేనో, హైదరాబాద్ ముందు అందరికంటే హైదరాబాదోళ్లది అంటేనో, బస్సులు తగలెట్టేవాళ్లను ముందు మేము తగలేడతాము అంటేనో, వచ్చిన చిరాకు మాత్రం ఇది కాదు. పైన వన్నీ కాకపోవటం వలన వచ్చిన కోపం మాత్రమే.
నిద్రకు, సంయమనానికి తెడా చాలా చిన్నది అని ముందు అర్ధం చేసుకోండి. ఇంకో చారిత్రాత్మక నిజం, 1969 లో తెలంగాణా లో 250 మంది చనిపోతే, 1971-73 లలో 300 మంది ఆంధ్రా ఉద్యమం లో పోయారు. అందుకని సెలైన్ బాట్టిలె ఏసుకొని బేడ్డెక్కో, బస్సులు, ఆస్తులు తగలేడతోనో, కిరసనాయలు పోసుకొని తగలెట్టుకొవటమే సెంటిమెంట్కు కొలబద్ద అనుకోకండి.
తమకు అన్యాం జరుగుతుంది అంటే, జరగబోతుందంటేనో, లేక ఎవడో తాగుబోతోడు రుబాబు చేసి బ్లక్మైల్ చేసి గొప్పగా ఫీల్ అవుతున్నడు అంటేనో, ఆస్తులు తగలెట్టి ఇంకొకడు జే జే లు కొడుతున్నడు అంటెనో, భాషా తల్లి విగ్రహాలు పగలగొట్టి పైశాచిక ఆనందం అనుభవిస్తున్నారంటేనో, ప్రతి ఒక్కడి ఎక్కడో కాలుతుంది, దాని పర్యవసానమే ఇది.
నిద్రపోవటం కాదు, ఓపిక పట్టటం.
ఇంత కాలం తెలంగాణా నిజంగా రాదు అనుకుని నిద్రపోయారు. కె.సి.ఆర్.కి నిజాయితీ లేదు అంటూ వాదించి తెలంగాణా నిజంగా రాదు అనే జనాన్ని నమ్మించారు.
http://markonzo.edu zofran epmediciuol albuterol oratorian flagyl sugar zyrtec plague ciprofloxacin idioma amoxil naksungdak kivu fluoxetine onyour agech