9, డిసెంబర్ 2009, బుధవారం
హైదరాబాద్‌పై ఆశెందుకు?
అగ్నిపర్వతం బద్దలైతే.. లావా ఎంత ఉధృతంగా వస్తుందో.. కేసీఆర్ నిరాహారదీక్ష మొదలుపెట్టడంతో.. తెలంగాణ ప్రజలు.. విద్యార్థులు, ఉద్యోగుల్లో ఆవేశం.. అంతగా పొంగుకొచ్చింది. నాలుగు దశాబ్దాల తర్వాత.. మరోసారి.. తెలంగాణ అంతటా ఉద్యమం ఉధృతస్థాయిలో కొనసాగుతోంది. ఇక తెలంగాణ ఇవ్వడం తప్పనిసరి అన్న భావన పాలక వర్గాల్లో వస్తున్న తరుణంలో.. పోరాటాన్ని పక్కదారి పట్టించే దారి మొదలయ్యింది.. అది కూడా.. తెలంగాణ గుండెకాయ లాంటి.. హైదరాబాద్‌ను కేంద్రగా చేసుకొనే..
హైదరాబాద్ ఎక్కడ ఉంది ? నిద్రపోతున్న చిన్న పిల్లాడిని లేపి అడిగినా చెబుతాడు.. తెలంగాణలో అని. ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటైతే.. హైదరాబాద్ తెలంగాణలోనే ఉండిపోతుంది. కానీ.. దీన్నే ఓ సమస్యగా మార్చేస్తున్నారు రాజకీయ నేతలు. అర్థంపర్థంలేని వాదనలను లేవనెత్తుతూ.. సమస్యను మరింత జఠిలం చేయడానికి కొంతమంది ప్రయత్నిస్తున్నారు. రాష్ట్రం రెండుగా విడిపోతే.. హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిని చేయాలంటూ.. ఆంధ్రాప్రాంత నేతలు.. ముఖ్యంగా కాంగ్రెస్ సీనియర్లు ఎప్పటినుంచో డిమాండ్ చేస్తున్నారు. అమల్లో ఇది ఏమాత్రం సాధ్యం కాదని తెలిసినా.. వారు తమ ప్రయత్నాలను.. ప్రకటనలు ఏమాత్రం ఆపడంలేదు. దీంతో పాటు. .మరో అంశమూ హైదరాబాద్‌ను పీడిస్తోంది. రాష్ట్ర రాజధానిగా అభివృద్ధి చెందిన ఈ ప్రాంతాన్ని కేంద్రపాలిత ప్రాంతంగా చేయాలన్నది మరికొంతమంది డిమాండ్. ఇదీ సాధ్యం కానిదే.. అయినా.. ఏదో రకంగా.. వివాదాన్ని మరింత పెద్దది చేయడానికే తప్ప.. సామరస్యపూర్వంగా తెలంగాణ సమస్యను పరిష్కరించుకుందామన్న ప్రయత్నం కనిపించడం లేదు. తెలంగాణ వాదాన్ని తగ్గించడానికే.. హైదరాబాద్ అంశాన్ని ఆంధ్రా నేతలు లేవనెత్తారన్న భావన ఎక్కువమందిది. ఉమ్మడి రాజధాని అంశాన్ని లేవనెత్తితే.. తెలంగాణ ఏర్పాటులో మరికొంత జాప్యం జరగవచ్చని వారు భావించడమూ ఇందుకు కారణం కావచ్చు. కానీ.. తెలంగాణకే చెందిన ఇద్దరు మంత్రుల ప్రవర్తనే.. ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది. వారిద్దరే.. దానం నాగేందర్.. ముఖేశ్‌గౌడ్. ఇద్దరూ హైదరాబాద్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నవారే. తెలంగాణ ఏర్పాటుకు ప్రయత్నాలు ముమ్మరం కావడంతో.. ఓ విపరీత ఆలోచన వీరికి వచ్చింది. అదే.. గ్రేటర్ హైదరాబాద్‌ను ఏర్పాటు. దీనికోసం.. ఉద్యమం చేయడానికీ సిద్దమేనంటున్నారు మంత్రి ముఖేశ్‌గౌడ్. హైదరాబాద్‌ను కేంద్ర పాలితప్రాంతం చేయాలంటూ.. ఏకంగా సోనియాగాంధీకి లేఖ కూడా రాశారు. జై తెలంగాణ అంటే.. జై గ్రేటర్ అంటానంటున్నారు మరో మంత్రి దానం నాగేందర్. తెలంగాణ ఉద్యమం జోరుగా సాగుతున్న తరుణంలో.. వీరద్దరూ.. గ్రేటర్‌కు జై అనడం వివాదాస్పదమవుతోంది. హైదరాబాద్ కేంద్రంగా సాగుతున్న తెలంగాణ పోరాటాన్ని చీల్చడానికే.. మంత్రులు కుట్రపన్నుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
హైదరాబాద్ రాష్ట్రానికి తెలంగాణ పేరెలా వచ్చింది?
ప్రస్తుతం తెలంగాణ ప్రాంతంగా పిలుస్తున్న ప్రాంతం అసలు పేరు.. హైదరాబాద్ సంస్థానం. గోల్కొండ నవాబులైన కుతుబ్‌షాహీలు ఈ ప్రాంతాన్ని పాలిస్తున్న సమయంలో.. హైదరాబాద్ నగరం ఏర్పాటయ్యింది. 1591లో చార్మినార్ నిర్మాణం జరగడంతో.. ఆ ఏడాదినే నగర ఆవిర్భావసంవత్సరంగా చరిత్రకారులు భావిస్తున్నారు. కుతుబ్‌షాహీ తన భార్య భాగమతి పేరున.. భాగ్యనగరంగా దీన్ని ఏర్పాటు చేసినా.. ఆమె ఇస్లాం మతం స్వీకరించి.. హైదర్ మహల్‌గా పేరు మార్చుకోవడంతో.. నగరాన్ని కూడా హైదరాబాద్‌గా మార్చారన్నది ప్రాచుర్యంలో ఉన్న కథనం. పేరు ఎలా వచ్చినా.. నగరం ఏర్పడిన తర్వాత.. ఈ ప్రాంతమంతా హైదరాబాద్ సంస్థానంగానే ప్రఖ్యాతి చెందింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన నిజాం నవాబులూ.. హైదరాబాద్‌నే తమ రాజధానిగా చేసుకొని.. పరిపాలన కొనసాగించారు. అయితే.. ఈ సంస్థానంలో.. మహారాష్ట్ర, కర్నాటక, ఒరిస్సాలోని కొన్ని ప్రాంతాలు కూడా అంతర్భాగంగా ఉండేవి. పరిపాలనాసౌలభ్యం కోసం నిజాం సుల్తాన్.. తన రాజ్యాన్ని సుభాలుగా విభజించి.. వాటికి అధికారులుగా.. సుబేదారులను నియమించాడు. తెలుగు మాట్లాడే ప్రాతాన్ని... అప్పటికే వాడుకలో ఉన్న తెలంగాణగా పిలుస్తూ దానికి ఓ సుబేదారిని ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి.. ఈ పదం విస్తృతంగా వాడుకలోకి వచ్చింది. 1947లో దేశం మొత్తానికి స్వాతంత్ర్యం వచ్చినా.. హైదరాబాద్‌కు స్వేచ్ఛాఫలాలు అందే సరికి.. మరో ఏడాది పట్టింది. హైదరాబాద్‌ను స్వతంత్ర్య రాజ్యంగానే ఉంచి.. తానే పాలించాలన్నది నిజాం నవాబు ప్లాన్. భారత ప్రభుత్వం విలీనానికి ఒత్తిడి తెచ్చేసరికి.. పాకిస్తాన్లో కలుపుతానంటూ.. కొత్తపాట మొదలుపెట్టాడు. భారత భూభాగం మధ్యలో ఉన్న ఈ ప్రాంతాన్ని పాకిస్తాన్లో చేర్చడానికి వీల్లేదంటూ.. అప్పటి కేంద్ర హోంమంత్రి.. ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్‌పటేల్ పోలీస్ చర్యకు ఉపక్రమిచండంతో.. ఈ ప్రాంతం.. భారత్‌లో విలీనమయ్యింది. హైదరాబాద్ రాష్ట్రంగా 1956 వరకూ కొనసాగి.. ఆ తర్వాత ఆంధ్ర రాష్ట్రంతో కలిసి ఆంధ్రప్రదేశ్‌గా అవతరించింది. ఇక్కడ పేరు పెట్టడంలోనూ అన్యాయమే జరిగింది. 1969లో రాష్ట్ర విభజన కోసం జరిగిన పోరాటం సమయంలో.. తెలంగాణ అన్న పదం జనంలోకి చొచ్చుకెళ్లింది.
ఉమ్మడి రాజధాని సాధ్యమా?
భౌగోళికంగా చూస్తే.. హైదరాబాద్‌కు ఆంధ్రా, రాయలసీమ ప్రాంతాలకు ఎక్కడా సంబంధం లేదు. హైదరాబాద్ రావాలంటే.. ఇతర తెలంగాణ జిల్లాల మీదుగా ప్రయాణించే రావాలి. కనీసం పంజాబ్, హర్యానాల మధ్య చంఢీగఢ్ ఉన్నట్లు కూడా హైదరాబాద్ లేదు. కాబట్టి.. ఉమ్మడి రాజధానిగా భాగ్యనగరాన్ని వాడుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లోనూ వీలుకాదు. పోనీ కేంద్రపాలిత ప్రాంతం చేయడానికి.. హైదరాబాదేమీ దిక్కులేని ప్రాంతం కాదు. అందులోనూ.. రాజకీయ సమస్యల కారణంగా.. దేశంలో ఏ ప్రాంతాన్ని ఇంతవరకూ కేంద్రం తన పరిధిలోకి తీసుకోలేదు. అందుకే.. అదీ సాధ్యమయ్యే పనికాదు. దీన్ని అర్థం చేసుకుని ఈ కుటిల యత్నాలను రాజకీయ నేతలు మానుకుంటేనే మంచిది. అసలు తెలంగాణ అంటేనే హైదరాబాద్.. హైదరాబాద్ అంటేనే తెలంగాణ. ఈ రెండూ ఒకటే అయినప్పుడు.. హైదరాబాద్‌ను ప్రత్యేక ప్రాంతంగా విడదీసి చూడాలనుకోవడమే మహా పాపం.
సెటిలర్స్ సమస్యా?
తెలంగాణ ఉద్యమం ఉధృతమైనప్పుడల్లా తెరపైకి వచ్చే మరో అంశం సెటిలర్స్ గొడవ. తెలంగాణ ఏర్పడితే.. ఆంధ్రా, రాయలసీమ వాసులకు హైదరాబాద్‌లో రక్షణ ఉండదంటూ... కొంతమంది అదే పనిగా ప్రచారం చేస్తున్నారు. భారతీయులకు దేశంలో ఎక్కడైనా నివసించే హక్కును రాజ్యాంగం ప్రసాదించింది. రాజ్యాంగాన్ని ధిక్కరించడానికి రాష్ట్ర ప్రభుత్వాలకు ఏం అధికారం ఉంది.. రాష్ట్రం విడిపోతే.. అదేమన్నా పరాయి దేశంగా మారిపోతుందా.. వీసాల సమస్య రావడానికి. రాజధానిలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో మాత్రం కొంత సమస్య ఏర్పడొచ్చు. రాష్ట్రం రెండుగా విడిపోతే.. ఆంధ్రా ప్రాంత ఉద్యోగులు కొత్త రాజధానికి వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడి ప్రైవేటు కంపెనీల్లో పనిచేస్తున్న వారిని వెళ్లిపోమని ఎవరూ చెప్పరు. బలవతంగానూ పంపించరు. మధ్యప్రదేశ్ నుంచి.. ఛత్తీస్‌గఢ్ విడిపోయినా, బీహార్ నుంచి జార్ఖండ్ విడిపోయినా, ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ వేరైనా రాని సమస్యలు.. ఆంధ్రా, తెలంగాణ విడిపోతే ఎందుకు వస్తాయి... అందుకే.. రాజకీయ నాయకులు.. కొంతమంది వ్యాపారులు చేస్తున్న ప్రకటనలను.. విని భయపడాల్సిన పనేలేదు. తెలంగాణలో గానీ.. ఆంధ్రాలో గానీ.. నచ్చినవారు ఎక్కడైనా ఉండొచ్చు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ప్రత్యేక తెలంగాణా వస్తే కోస్తా ఆంధ్రవాళ్ళకి లాభం. హైదరాబాద్ నుంచి విశాఖపట్నం (కాజీపేట మీదుగా) 700 కిలో మీటర్లు దూరం. విజయనగరం 760 కిలో మీటర్లు దూరం, శ్రీకాకుళం 840 నలభై కిలో మీటర్లు దూరం. హైదరాబాద్ నుంచి ఈ ప్రాంతాలకి ప్రయాణం అంటే ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి ప్రయాణించే దూరం కంటే ఎక్కువే.
chaala baga chepparu
హైదరాబాద్ పైన తెల౦గాణ వాళ్ళకె౦దుకో అ౦త ఆశ?
మీకు హైదరాబాద్ పైన ఎ౦త ప్రేము౦దో మాకు తెల౦గాణ మీద అ౦త ప్రేము౦ది.
తెల౦గాణ పై అ౦తగా వివక్షచూపదలచుకు౦టే, రాజధానిని హైదరాబాద్ ఎ౦దుకు తరలి౦చి అభివృద్ది చేస్తారు?
ఆ౦ధ్రప్రదేశ్ ను౦చి తెల౦గాణను విడదీయట౦ సాధ్యమయినప్పుడు, న్యాయమైనప్పుడు, హైదరాబాద్ ను తెల౦గాణ ను౦చి విడదీయటమె౦దుకు సాధ్య౦ కాదు, న్యాయ౦ కాదు.
అసలు హైదరాబాద్ ను నిర్మి౦చి౦ది ముస్లిములు. వాళ్ళు ఒక రాష్ట్ర౦ కోరుకోవడ౦ తప్పా? వాళ్ళె౦దుకు తెల౦గాణలో భాగ౦ కావాలి?
అర్థంపర్థంలేని వాదనలను లేవనెత్తుతూ.. సమస్యను మరింత జఠిలం చేయడానికి కేసిఆర్ చేసి౦ది న్యాయమైతే, ఇదీ న్యాయమే.
ఈ రోజు మీరు చేస్తున్నదే, రేపు హైదరాబాద్ వాళ్ళు చేయవచ్చు. అప్పుడు మళ్ళీ ఈ గొడవ౦తా ఎ౦దుకు. ఇప్పుడే తేల్చేస్తే పోలా? ఎలాగూ సోదరభావ౦తో విడిపోతున్నపుడు ఎవరివాటా వాళ్ళకిచ్చేయట౦ మ౦చిది.
విడగొట్టటమ౦టూ మొదలైతే, విచ్చిన్నమయి పోతు౦ది.
పెద్దరాయ్డు గారితో పూర్తిగా ఏకీభవిస్తున్నాను.
వ్యాసం రాసిన పెద్దాయన గారు,
సెటిలర్స్ ఆందోళన అంటున్నారు...అది ఎప్పటి నుంచి మొదలయిందో తెలుసా? రాత్రికి రాత్రి జీరో నుంచి హీరో అయిన కెసీఅర్ చేసిన ప్రకటనల వల్ల. అవి ఏంతో మీకు తెలియకపోతే సంవత్సరం క్రితం ఈనాడు పేపెర్ చూడండి.
నా వోటు పెదరాయుడు గారికే. సరే ఓ మాట చెప్పండి. ఇప్పుడు మీ కంటికి కనబడుతున్న హైదరాబాద్, మీరు చెప్పిన నిజాం నాటి హైదరాబాదేనా. అప్పటి నుండి ఇప్పటికి ఎంత అభివృద్ధి జరిగింది. ఇదంతా ఎలా జరిగింది? జరగడానికి ఎంతకాలం పట్టింది. నిధులు ఎక్కడెక్కడినుంచి తరలించారు? నాకు ఈ ప్రశ్నలకు నిజ్జంగానే జవాబు తెలియదు. మీరు చెప్పండి. హైదరాబాదే తెలంగాణా, తెలంగాణే హైదరాబాదు అయితే ఇంత అభివృద్ధి చెందిన తెలంగాణ (హైదరాబాద్)గురించి మీకు ఇంక బాధ ఏముంది. వేరు రాష్ట్రం కావాల్సిన పని ఏముంది. అంటే అన్ని ప్రాంతాల నుంచి నిధులు రాబట్టుకుని రాజధాని అని బాగా అభివృద్ధి చేసుకున్నాక, మీరు అడిగిన వెంటనే ఇచ్చేసి చేతులు దులుపుకుని, మళ్ళీ మాకో కొత్త రాజధాని వెతుక్కుని, దానిగురించి కొట్టుకుని, (మావైపు ఉండాలి అంటే కాదు మావైపు ఉండాలి అని) సరె ఎక్కడోక్కడ అని నిర్ణయించుకుని, మళ్ళీ దాన్ని అభివృద్ధి చేసుకోవాలి అంతేనా. మరి కోస్తా, రాయలసీమ వాళ్ళు ఈ మొత్తం ప్రాసెస్ లో ఎంత కాలం, ఎంత ధనం కోల్పోవాలో కూడా మీరే ఓ లెక్కవేసి చెప్పేయ్యండి ఉజ్యాయింపుగా.
హైదరాబాద్ ని అభివృద్ధి చేస్తే ఇతర ప్రాంతాలవాళ్ళకి ఏమిటి లాభం? మాకు ఎలాగూ హైదరాబాద్ 800 పైగా కిలో మీటర్ల దూరం. ప్రత్యేక తెలంగాణా వస్తే మాకు వచ్చే నష్టం ఏమీ లేదు. గ్రామీణాభివృద్ధి గురించి మాటల్లో చెపుతూ చేతల్లో హైదరాబాద్ అభివృద్ధికి ఎక్కువ ఖర్చు పెట్టే నాయకులు ఉన్నప్పుడు తెలంగాణాకి గానీ కోస్తా ఆంధ్రకి గానీ వచ్చే లాభం ఏమీ ఉండదు.
అందరికీ చిన్న విషయం అర్ధమవటంలేదు.
ఈ 56 ఏళ్ళలో తెలంగాణేతరులు ఎవరు భాగ్యనగరం వచ్చినా ఒకటే. వారు నిజామాబాద్ జిల్లా వారు కానివ్వండి, నెల్లూరు వారు కానివ్వండి, వైజాగు వారు కానివ్వండి. హైదరాబాదు అంటే తెలంగాణా ప్రాంతంలో చాలా అభివృద్ది జరిగింది పారిశ్రామిక పరంగా, విద్యాపరంగా (IIT, REC, ISB).
ఈ 56 ఏళ్ళలో తెలంగాణేతరులు భాగ్యనగరంలో పెట్టిన పెట్టుబడి, అటుఇటు తిరగడానికి అయ్యిన తగులు వడ్డీ లేకుండా అయిన ఇచ్చే వీలుంటే ఆంధ్రవారికి ఏమీ ఇబ్బంది ఉండదు.
జార్ఖండ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్‌గఢ్ ఈ రాష్త్రాల్లు ఏర్పడకు మునుపు అక్కడ IIT, NIT లాంటి institutions లేవు.
కానీ hyderabad లో అన్ని ఉన్నాయి. ఆంధ్రాలో లేవు.
@ ప్రవీణ్: హైదరాబాద్ డెవెలప్ చేస్తే మీకేం లాభం లేదు. తెలంగాణా రాష్ట్రం వస్తే మీకేం నష్టంలేదు. అంతేకదూ మీరు చెప్పేది. మరి ఇప్పటిదాకా నాయకులు అందరు (అన్ని ప్రభుత్వాల వారు) ఒక్క హైదరాబాద్ అభివృద్ధి కోసమే అంతో ఇంతో కృషి చేసారు. అవునా కాదా? మిగతా అన్ని ప్రాంతాలు ఇంచు మించు ఒకేలా ఉన్నాయి (తెలంగాణా వెనకబడిందీ లేదు, మిగతావాళ్ళు బాగుపడిపోయిందీ లేదు). కానీ హైదరాబాద్ తెలంగాణాకి ఇచ్చెయ్యడం వల్ల ఒక నష్టం కనిపిస్తోంది. ఇక్కడ సెటిల్ అయిన (విద్య, ఉద్యోగ, వ్యాపారల నిమిత్తం) కోస్తా ఆంధ్రవారిని వీరు బయటికి గెంటేయాలని చూస్తున్నారు. మీరు కేవలం మీ శ్రికాకుళం జిల్లాని దృష్టిలో ఉంచుకుని మొత్తం కోస్తా గురించి మాట్లాదుతున్నారు. ఇప్పటికి ఎంతమంది కోస్తా వైపు నుంచి వచ్చి ఇక్కద హైదరాబాద్‌లో ఉద్యోగాలు చేస్తున్నారో మీకు తెలుసా?
తెలంగాణా విడిపోవడం వల్ల ఏ రకంగా అయినా ఆంధ్రాకే లాభం. హైదరాబాద్ ని మేడి పండులా ఎంత మెరిసిపోయేలా చేసినా వెనుకబడిన ప్రకాశం, విజయనగరం, శ్రీకాకుళం లాంటి జిల్లాల వాళ్ళు చూసి మురిసిపోరు. హైదరాబాద్ ఆంధ్రా నుంచి విడిపోతే స్థానిక అభివృద్ధికీ, గ్రామీణాభివృద్ధికీ వచ్చే వాటా పెరుగుతుంది.
హైదరాబాద్ లో IIT పెడితే కోస్తా ఆంధ్రకి అది ఎలా గ్లోరీ అవుతుంది? ఇక్కడ మాకు కావలసింది స్థానిక అభివృద్ధీ, గ్రామీణాభివృద్ధీ. హైదరాబాద్ హైటెక్ సిటీ కోస్తా ఆంధ్రలో ఎలుకలని పట్టుకుతినే యానాదివాళ్ళకి అన్నం పెడుతుందా?
అందరూ బాగానే వాదిస్తున్నారు కానీ.. హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారో తర్వాత మాట్లాడుకుందాం.. కర్నూలు నుంచి హైదరాబాద్‌కు రాజధానిని మార్చిందెవరు.. రాష్ట్రానికి పేరు పెట్టడంలోనూ పక్షపాతం వహించి.. ఆంధ్రప్రదేశ్‌గా నామకరణం చేసిందెవరు? కర్నూలులో మూడేళ్లపాటు.. అసెంబ్లీ భవనం కూడా లేకుండా గడిపి.. హైదరాబాద్‌లో వసతులు చూసి పరిగెత్తుకు వచ్చింది ఆంధ్రా ప్రాంతం వారు కాదా...
అసెంబ్లీ, హైకోర్టు, ఎల్.బి.స్టేడియం.. ఇంకా ఎన్నో నిజాం కాలంలో కట్టిన భవనాల్లోనే ప్రభుత్వ కార్యకలాపాలు జరుగుతున్నాయని గుర్తుంచుకోండి. ఈ నలభై ఏళ్లలో హైటెక్ సిటీ ఒక్కటే గొప్పగా కట్టింది. అదీ ఇక్కడి ప్రజల భూములు లాక్కొని. హైదరాబాద్‌ను డెవలప్ చేశామంటూ.. చుట్టుపక్కల భూములు రేట్లు పెంచిందో ఎవరో.. దాని వల్ల ఏ ప్రాంతం బడా వ్యాపారులు లాభపడ్డారో అందరికీ తెలుసు. తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టి.. కోట్లకు కోట్లు సంపాదించుకున్నారు. అందుకని అనవసరంగా ఆవేశపడకండి.. అయినా.. ఆంధ్రాప్రాంతంలో రాజధానిగా పనికొచ్చే ఒక్క సిటీ కూడా లేదా.. హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నారు.. సిగ్గు సిగ్గు
Like Delhi and Mumbai, Hyderabad became a mega cosmopolitan city.being capital city it's population consists of people from all regions. It is linked to nizam's rule and Muslim culture with sizeable population of Muslims and urdu as main language of city. to safeguard the international level educational institutions,research laboratories IT hubs international airport etc., Hyderabad city should be made Union Territory under central govt.rule
కోస్తా ఆంధ్రలో కూడా రాజధానిగా పనికొచ్చే నగరాలు ఉన్నాయి. బ్రిటిష్ వాళ్ళు రాకముందు విశాఖపట్నం ఒక పల్లెటూరు. బ్రిటిష్ వాళ్ళు అక్కడ వ్యాపార స్థావరం ఏర్పరుచుకున్న తరువాత అది టౌన్ అయ్యింది. స్వాతంత్ర్యం వచ్చిన తరువాత స్టీల్ ప్లాంట్, బి.హెచ్.ఇ.ఎల్. లాంటి పరిశ్రమల వల్ల సిటీ అయ్యింది. హైదరాబాద్ లో హైటెక్ సిటీకి మాత్రమే డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టి గ్రామీణాభివృద్ధిని నిర్లక్ష్యం చేసి కోట్లాది మంది ప్రజలని అభివృద్ధికి దూరంగా ఉంచుతున్నారు.
అసలు విడిపోవటమంటే హైదరాబాద్ వోళ్లు కరీమ్నగర్ వాళ్ల వెంకాలో, కడపోళ్ల వెంకాలో ఎందుకు పోవాలా? రాష్ట్రానికి 50 శాతం పైగా నిధులిస్తున్న మా ప్రాంతం వెరే వాళ్ల తో ఎందుకు కలవాల?
కావాలంటే ఎవరు రాష్ట్రాలు వాళ్లెట్టుకోండి, మా హైద్రాబాద్ ను మీరు ఉద్దరిచ్చింది చాలు, మా మానాన మమ్ములను వదిలి, తగలెట్టుకోవాలంటే పోయి, మీ కొంపా గోడు తగలెట్టుకోండి.
జై హైదరాబాద్ స్టెట్, జై దానం.
"తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొట్టి.. కోట్లకు కోట్లు సంపాదించుకున్నారు." తెలంగాణా వాళ్లు కల్లు తాగి ఆంధ్రా వాళ్ల ఆస్తులు తగలేట్టుకొంటారో, ఆంధ్రా వాళ్ళు తెలంగాణా ను దొబ్బెస్తరో మీ మీ ఇష్టం, మా హైదరాబాద్ లో ఉండాలంటే భారతీయులు గా ప్రశాంతంగా ఉండండి.
కొట్టుకు చావాలంటే, మీ మీ ప్రాంతాలకు పోయి కొట్టుకొనే, చంపుకొనో, తగలెట్టుకొనో చావండి.
విడిపోయెటప్పుడు మాత్రం ఎదో ఏ వస్తువులాగా హైదరాబాద్ మాది అంటే మాది అని మీ బాబుల ఆస్థి లాగ లాక్కోవాలని చూడకండి.
హైదరాబాద్ హైదరాబాద్ వోళ్లది. ఈడ బతుకుతున్న అందరదీ, ఈడ ట్యాక్స్‌లు కడుతున్న వాళ్లది, ఈడ పుట్టిపెరిగిన వాళ్లది, పొద్దున లెచి కస్టపడి పని చేసి తాము బతుకుతూ తమతోపాటు ఇంకో నలుగురును బతకనిచ్చేవాళ్లది, ఈడ వోటు ఉన్నవాళ్లది.
అంతే కాని షాపులో పెట్టిన ఫ్యాన్సీ బొమ్మో, వేలం పాటలో పెట్టిన చీరో కాదు అని గుర్తెట్టుకోండి, మీరు మీరు మాది మాది అని కొట్టుకు చావటానికి!!!
జై హైదరాబాద్ స్టెట్, జై దానం.
మరదే రాజకీయమంటే ! ప్రత్యెక తెలంగాణ రావడం పెద్ద లెవెల్లో ఎవ్వరికీ ఇష్టం లేదు. పెద్ద పెద్ద నాయకులంతా ఇక్కడ వేల వేల ఎకరారు కొన్నారు బినామీ పేర్ల తో ప్రత్యెక తెలంగాణ వస్తే రెట్లు పడిపోవూ ! వారి వ్యాపారాలు దెబ్బ తినవూ !
ఇంత కాలం ఎందుకు ఊరుకోన్నారని అడుగితే తెలంగాణ రాదనీ నమ్మకం. కాసేపు కెసిఆర్ యాగీ చేసి ఊరుకొంతాదులే అని . చిన్న పిల్లవాడు ఏడిస్తే మనం ఏమి చేస్తాం , ఒక చాక్లెట్ ఇస్తాం అలానే, మిఠాయిలు ఇచ్చి కూర్చోపెట్టారు ఇంత కాలం.
తెలంగాణా కోసం 20 మంది ఆత్మ హత్యలకు పాల్పడితే,
సమైక్య ఆంధ్రా కోసం 93 mamdi rajeenaamaa chesaaru
@ అఙాత: హైదరాబాద్ మాదంటే మాది, మీరు (ఆంధ్రా వాళ్ళు) మా పొట్టలు కొడుతున్నారు. మా ఉద్యోగాలు లాగేసుకుంటున్నారు, మమ్మల్ని అవహేళన చేస్తున్నారు. మమ్మల్ని అణగతొక్కుతున్నారు, అని రోడ్ల మీద అల్లరి చేస్తున్నవారిని అనండి ఇదే మాట. మీరు చెప్పిన విధంగా, ప్రశాంతంగా భారతీయులుగా బ్రతకడానికి వచ్చిన వారే ఇక్కడ ఉన్న మిగతా ప్రాంతాలవారు. ఎవరి తెలివితేటలను బట్టి వారు తోచిన రీతిలో బ్రతుకుతెరువు ఏర్పాటు చేసుకున్నారు. హైదరాబాద్‌ని ఒక్క బొమ్మలాగానో, చీరలాగానో, కొనేసుకుందామనో, దోచేసుకుందామనో, నేను చెప్పడంలేదు. కోస్తా ఆంధ్రా వారికి ఇక్కడ ఉండే అర్హత లేదని, హైదరాబాద్ తెలంగాణా వారికి మాత్రమే సొంతమని, అల్లర్లు చేసెవారికి చెప్పండి మీ సమాధానం. ఇక్కడ గొడవ లేపింది కోస్తా వాళ్ళో, రాయలసీమ వాళ్ళో కాదు. ఇక్కడ అందరూ ప్రశాంతంగా (మీ లాగా) బ్రతకాలని వచ్చిన వారే. మరి ఈరోజు వారి శాంతి భద్రతలకు భంగం కలిగే పరిస్థితి ఉంది.
హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్స్ ధరలు తగ్గితే రాష్ట్రంలో మెజారిటీ ప్రజలకి వచ్చే నష్టం ఏమీ లేదు. స్థానిక అభివృద్ధిని నిర్లక్ష్యం చేసి హైదరాబాద్ ని ఎంత అభివృద్ధి చేసినా అది మేడి పండే.