8, డిసెంబర్ 2009, మంగళవారం
డిసైడ్ చేయడానికి నువ్వెవరు?
అవును.. డిసైడ్ చేయడానికి ఆమె ఎవరు? ఆమెకు ఏ అధికారం ఉంది? ఈ రెండు ప్రశ్నలూ... కాంగ్రెస్ పార్టీ నెత్తిమీద పెట్టుకొని పూజిస్తున్న అమ్మగారు.. సోనియాగాంధీ గురించే... మూడున్నర కోట్ల ప్రజల జీవితాలతో ముడి పడి ఉన్న తెలంగాణ అంశాన్ని ఒక్క సోనియా డిసైడ్ చేస్తుందా.. ఏ అధికారంతో చేస్తుంది.. తెలంగాణ గురించి.. తెలంగాణ బతుకు పోరాటం గురించి ఆమెకు ఏం తెలుసు.. కాంగ్రెస్ నేతలు.. మన గౌరవనీయ ముఖ్యమంత్రి రోశయ్య మాటలు చూస్తే మాత్రం.. సోనియా చేతుల్లోనే అంతా ఉందన్నట్లు అర్థమైపోతుంది. తెలంగాణ వద్దు అని.. ఆమె ప్రకటించిందంటే.. ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు సాధ్యం కానేకాదు.. అదే ఆమె.. ఇచ్చేయండి అంటే.. క్షణాల్లో రాష్ట్రం రెండుగా విడిపోతుంది. అంటే.. మన ప్రజాస్వామ్యంలో మనం రాసుకున్న రాజ్యాంగం.. మనం ఏర్పాటు చేసుకున్న చట్టసభలు.. మనం ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు.. అంతా వేస్టే అన్నమాట. ఇది రాజరికంలో రాజరికం. అంతేకాదు.. కాంగ్రెస్ నేతలకు కనీసం రోషం, పౌరుషం.. చీమూనెత్తురూ ఉన్నట్లు కూడా కనిపించడం లేదు. అన్నీ వదిలేసి.. అన్ని నిర్ణయాలు తీసుకునే అధికారాన్ని అమ్మకే కట్టబెట్టేస్తున్నారు. కనీసం.. పరిస్థితిని వివరించి.. తెలంగాణపై నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని కూడా చెప్పే సాహసం చేయలేకపోతున్నారు. అన్నీ సోనియానే డిసైడ్ చేస్తున్నప్పుడు.. మనకో ప్రభుత్వం ఎందుకు.. ప్రజాప్రతినిధులు ఎందుకు.. అన్నింటినీ రద్దు చేసిపడేస్తే పోలా.. ఓ గవర్నర్ను పెట్టుకుని ఆవిడే పరిపాలిస్తారు కదా... ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే.. బ్రిటిష్ పాలనలోని కాంగ్రెస్ నేతల వ్యవహారశైలే మేలనిపిస్తోంది. బ్రిటీష్ సర్కార్ కాళ్లముందు ప్రణమిల్లకుండా.. ధైర్యంగా రాష్ట్ర్రాల్లో ప్రభుత్వాలు కొంతలో కొంత సొంత నిర్ణయాలు తీసుకునేవి. తేడావస్తే.. సత్యాగ్రహాలు, నిరసనలతో ప్రతిఘటించేవి. బ్రిటీష్ తుపాకులకు.. కాంగ్రెస్ నేతలు రొమ్ము విరిచి మరీ ధైర్యంగా ఎదురు నిలబడేవారు. కానీ.. ఇప్పుడు మాత్రం.. అంతా రివర్స్. అమ్మ చెప్పకపోతే.. బాత్రూంకి కూడా వెళ్లమన్నట్లుగా తయారయ్యారు కాంగ్రెస్ నేతలు.. నిజంగా.. ఇది సిగ్గుపడాల్సిన విషయం.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
gud
తప్పు సోనియాదీ కాదు, కా౦గ్రెస్ నాయకులదీ కాదు. పార్టీ అధిష్టానమే సర్వమని ప్రతి కా౦గ్రెస్ నాయకుడూ ఉగ్గుపాలు తాగకము౦దును౦చీ వాగుతున్నా....ఓట్లేసిన/ఓట్లేయని దౌర్భాగ్యులది.