మాఫియా డాన్ ఛోటా షకీల్ అనుచరులతో తన ప్రాణాలకు ప్రమాదం పొంచి ఉందని భారతీయ జనతా పార్టీ యువ నాయకుడు వరుణ్ గాంధీ ఆరోపించారు.
షకీల్ అనుచరులైన ఆరుగురిని ఢిల్లీ పోలీసులు అరెస్టు చేసిన మరుసటి రోజు వరుణ్ ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. ఇందిరాగాంధీ వారసుడిని హత్య చేసేందుకు ఢిల్లీ నగరానికి వచ్చినట్లు అరెస్టైన వారు వెల్లడించడంతో తనపై హత్యకు కుట్ర జరుగుతోందని ఆయన ఆరోపించారు.
ఇదిలావుండగా గతంలో ఛోటాషకీల్ ప్రధాన అనుచరుడు రషీద్ మలబారీని బెంగుళూరు పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో తన హత్యకు కుట్ర జరుగుతోందని తొలిసారిగా తెలిసిందని ఆయన విమర్శించారు.
కాగా తన తనయుడిపై హత్యాయత్నం చేసేందుకు కుట్ర జరుగుతోందని వరుణ్ తల్లి, సంజయ్ గాంధీ సతీమణి మేనకాగాంధీ ఆరోపించారు. ఈ మేరకు ఆమె ప్రధానికి లేఖకూడా రాసినట్లు సమాచారం. తమ యువనాయకునికి మరింత భద్రత పెంచాలని బీజేపీ ఈ సందర్భంగా డిమాండ్ చేసింది.
5, జులై 2009, ఆదివారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి