8, జులై 2009, బుధవారం
మైఖేల్‌కు మనమేమిచ్చాం... ?
నలభై ఏళ్లుగా మరిచిపోదామన్నా.. మరిచిపోలేని ఎన్నో పాటలు అందించాడు.. మైఖేల్జాక్సన్. ఇప్పుడు మాత్రమే కాదు.. వచ్చే తరాలనూ ఆకట్టుకునేవే. జనానికి వినోదం ఇవ్వడానికి.. తనను తానే అర్పించుకున్నాడు. కింగ్ ఆఫ్ పాప్ అని పిలింపించుకుంటూనే.. ప్రోగ్రాంల కోసం ఓ శ్రామికుడిగా కష్టపడ్డాడు... మరి మైఖేల్‌కు మనం ఇచ్చిందేమిటి... కెరీర్ ఎదిగే కొద్దీ.. ఎవరిలోనైనా ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. జనాన్ని చూడగానే ఉత్సాహం పొంగుకొస్తుంది. జనంలో తిరగాలన్న కోరిక పెరుగుతుంది. కానీ.. మైఖైల్జాక్సన్ విషయంలో మాత్రం..
ఇవి రివర్స్ అయ్యాయి. ప్రపంచవ్యాప్తంగా పేరు ప్రఖ్యాతులు వచ్చినా.. స్వేచ్ఛగా విహరించలేకపోయాడు.. జాక్సన్. తన ఆల్బమ్‌లు రికార్డులు బద్దలు కొడుతుంటే.. తాను మాత్రం.. ఇండి గోడల మధ్యే ఉండిపోయాడు. పైగా.. మానసికంగా రోజు రోజుకూ కుంగిపోతూ.. వ్యసనాల బారినపడ్డాడు.. మైఖేల్జాక్సన్లో రెండు భిన్నమైన కోణాలివి. దీనికి కారణం ఏమిటి? ఎవరి వల్ల.. జాక్సన్ ఇంతగా కుంగిపోయాడు.. చెప్పాలంటే.. చుట్టూ ఉన్న జనమే.. అభిమానమనాలో.. లేక ఆతృత అనుకోవాలో గానీ.. మైఖేల్‌ను నీడలా వెండాటారు. ఏం చేసినా.. ఎలా చేసినా.. ఏదో ఒకటి అన్నారు. జాక్ మానియా తారాస్థాయికి చేరడంతో... అమెరికన్ పేపర్లు.. ఎక్కడలేని ఉత్సాహం చూపించాయి. జాక్సన్ రహస్యాలను ప్రచురిస్తూ.. నానా రకాలుగా ఇబ్బందులు పెట్టాయి. స్కిన్ బ్లీచింగ్ చేసుకున్నాడని, ప్లాస్టిక్ సర్జరీలు చేసుకుంటున్నాడని కుప్పలు తెప్పలుగా ఆర్టికల్స్ రాశాయి. ఓ వైపు.. తన ఆహార్యంపై కాస్త అసంతృప్తిగా ఉన్నజాక్సన్కు ఈ వార్తలు మరీ చికాకు పరిచాయి. జనం నుంచి వేరు చేశాయి. ఇక ఎప్పుడైనా బయటకు వచ్చినా.. తన మొహం పూర్తిగా కప్పుకునే తిరిగేలా చేశాయి. నిజంగా అమెరికన్ పేపర్లు ఇంత హడావిడి చేయాల్సిన అవసరం ఉందా... మైక్.. మానసికంగా కుంగిపోవడానికి ఇదే మొదటి కారణం... అసలు మైక్ ఆపరేషన్ చేయించుకుంటే.. వీరికెందుకు, రంగు మార్చుకుంటే వీరికెందుకు.. పోనీ అదేమైనా నేరమా... ఇదొక్కటే కాదు.. మరెన్నో రకాల వార్తలు.. నిత్యం జాక్‌ను వేధించాయి. పాప్‌సింగర్ ఎల్విస్ కుమార్తె లీసామేరీని 1994లో పెళ్లాడడం.. ఆ తర్వాత 19 నెలలకే.. వారిద్దరూ విడిపోవడం చకచకా జరిగిపోయాయి. ఈ సమయంలో పేపర్లు మైకెల్జాక్సన్ను పీడించాయి. నర్సుగా తనకు సేవలు చేసిన డెబ్బీరోను 1996లో పెళ్లిచుకున్నాడు. ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత.. 1999లో ఈ జంట విడిపోయింది. అయితే.. పిల్లల విషయంలో ఇద్దరి మధ్యా.. చాలాకాలం వివాదం నడిచింది. చివరకు కోర్టు.. మైఖేల్‌కు అనుకూలంగా తీర్పు చెప్పడంతో.. పిల్లలు నెవర్ల్యాండ్లోనే ఉన్నారు..
వెంటాడిన వివాదాలు
ఇదిగో ఈ ఫోటో చూడండి.. 2002లో ఓ అవార్డు కోసం బెర్లిన్ వచ్చినప్పుడు జనం కోసం కిటికీలోంచి తొంగిచూస్తున్న మైఖైల్ జాక్సన్ది. అప్పుడు చేతిలో.. అతని చిన్న కొడుకు ప్రిన్స్ మైకేల్ టు ఉన్నాడు. చూడడానికి వచ్చిన అభిమానులను ఇలా పలకరించాడు. ఇదో పెద్ద వివాదమై పోయింది. కొడుకును అలా పట్టుకోవచ్చా.. అంటూ.. పేపర్లు పుంఖాను పుంఖాలుగా వార్తలు రాసి పడేసాయి. కరుణ లేని కసాయంటూ.. తిట్టిపోశాయి. కానీ.. సొంత కొడుకును పడేయాలని ఎవరైనా అనుకుంటారా.. దీన్నో వివాదంగా మార్చేసి.. ఎన్నో మచ్చలను మైఖేల్‌కు అంటగట్టాయి.. ఎక్కడికి వెళ్లినా సుఖం లేకుండా చేశాయి..మైఖైల్ సమస్యలు ఇంతటితో తీరలేదు.. చిన్న పిల్లలపై అత్యాచారం చేశాడంటూ.. ఆరోపణలు వెల్లువెత్తాయి. చాలాకాలం జాక్‌కు నిద్రలేకుండా చేసాయి. కోర్టు బయట రాజీ కుదుర్చుకున్నప్పటికీ.. 2005లో మరో కేసు మెడకు చుట్టుకుంది. అయితే.. ఇవేవీ నిరూపణకాకపోవడంతో.. జాక్సన్‌కు శిక్షపడలేదు. కష్టాల కడలిని ఎదురీది.. ప్రపంచ ఉన్నత శిఖరాలను అధిరోహించిన వ్యక్తిని మరింత ప్రోత్సహించాల్సింది పోయి.. అణగదొక్కడానికి ప్రయత్నించింది అమెరికన్ మీడియా. ఇక ఇటీవలి కాలంలో.. ఆయన ఆరోగ్యంపై వచ్చిన కథనాలకు లెక్కేలేదు. స్కిన్ క్యాన్సర్ అని, మానసిక సమస్యలని.. ఇలా ఎన్నో అనుమానాలతో స్టోరీలు రాశాయి. ఒక్కమాటలో చెప్పాలంటే.. దాదాపు రెండు దశాబ్దాల పాటు.. అనుక్షణం వేధించాయి.. ప్రశాంతత లేకుండా చేశాయి. బహుశా ఈ ఒత్తిడిని తట్టుకోవడం కోసమే.. రకరకాల ప్రయోగాలను జాక్ చేసిఉండొచ్చు. అందులో భాగంగానే.. మత్తు పదార్థాలకు బానిస అయి ఉండొచ్చు. జాక్సన్ అలవాట్లను తప్పు పట్టే ముందు.. అతని చుట్టూ ఉన్న ప్రపంచం ఏం చేసిందో.. ఆలోచిస్తే.. తప్పెవరిదో అర్థమవుతుంది.
ప్రాణం పోయాకా వదల్లేదు..
బతికుండగానే కాదు.. ప్రాణం పోయాక కూడా.. జాక్సన్ వదిలి పెట్టలేదు. పాప్‌స్టార్ మరణవార్త బయటకు పొక్కడం ఆలస్యం.. రకరకాల కథనాలు.. ఏది నమ్మాలో.. ఏది నమ్మకూడదో తెలియదు. జాక్సన్ చనిపోయిన దుఖంలో ఆయన కుటుంబం ఉంటే.. ఇదంతా.. డ్రామా అంది అమెరికన్ మీడియా. పిల్లల విషయంలోనూ కథలు మొదలెట్టింది.. మొత్తంమీద చనిపోయిన తర్వాతా.. మైఖేల్ జాక్సన్‌ను వదల్లేదు...చనిపోయాడన్నది ఖాయమైనా.. అమెరికాలో కొంతమందికి మాత్రం నమ్మకం కుదరడం లేదు. అందుకే.. మరణవార్త తెలియగానే.. ఇదంతా డ్రామా అని.. వ్యక్తిగత ప్రతిష్టపెంచుకోవడం కోసం అంటూ.. కథనాలు రాయడం మొదలుపెట్టారు. అంత్యక్రియలవుతున్నా ఇప్పటికీ.. వారికి డౌట్లు తీరలేదు. రోజుకో కొత్త అనుమానంతో స్టోరీ వస్తోంది. ప్రాణం పోక ముందే కాదు.. పోయాక కూడా.. మైఖేల్‌కు సుఖం లేకుండా పోయింది. చచ్చినా సాధిస్తున్నారు. శవాన్ని పీడించుకు తింటున్నారు.మైఖైల్ మృతిపైనే కాదు.. ఆయన వ్యక్తిగత విషయాలపైనా ఫోకస్ చేస్తున్నారు. చివరకు ఆయన పిల్లలపైనా.. స్టోరీలు మొదలుపెట్టారు. ముగ్గురు పిల్లల్లో.. ఇద్దరు డెబ్రీకి పుట్టారని అందరికీ తెలుసు. చివరి కొడుకు ఎవరిద్వారా పుట్టాడన్నది మాత్రం ఇప్పటికీ సస్పెన్సే. తల్లిపేరును మైఖేల్ రహస్యంగానే ఉంచాడు. అయితే.. డెబ్రీకి పుట్టిన ఇద్దరి పిల్లల జన్మరహస్యం ఇదంటూ.. కొన్ని పత్రికలు ఆర్టికల్స్ రాశాయి. మైఖైల్ జాక్సన్ పర్సనల్ డాక్టర్ ద్వారా..జన్మించారంటూ పుకార్లు పుట్టించాయి. దీనిలో నిజమెంతో గానీ.. కన్నతల్లి డెబ్రీమాత్రం అదేమీ లేదంటోంది. అయినా.. పేపర్ల ఆగడాలు మాత్రం ఆగడం లేదు. ఇక మైఖేల్ జాక్సన్ మృతిపైనా ఎన్నో అనుమానాలు. ఆ మందులు వాడాడని.. ఈ ఇంజెక్షన్లు చేసుకున్నాడని.. ఒక్కటేమిటి.. వందలాది వార్తలు.. కుప్పలు తెప్పలుగా పేపర్లలో ప్రత్యక్షమవుతున్నాయి. మైక్ చనిపోయాక.. డాక్టర్ కనిపించకుండా పోవడం.. ప్రమాదకర మత్తు పదార్థాలు ఇంటిలో దొరకడం.. విషయం మొత్తాన్ని గజిబిజిగా మార్చేశాయి. ప్రాణం కన్నా ఎక్కువగా జాక్‌ను ఆరాధించిన ఫ్యాన్స్‌ను అయోమయంలో పడేశాయి. గుండెనొప్పితో చనిపోయాడని పోస్టుమార్టం రిపోర్టు చెప్పినా.. మరోసారి శవ పరీక్షను చేయాల్సి వచ్చింది. డాక్టర్ల ప్రమేయంపై దర్యాప్తు చేయాలంటూ.. తాజాగా.. లాస్ఏంజిల్స్ కోర్టు పోలీసులను ఆదేశించింది. అయితే.. విషప్రయోగంతో తన కుమారుడిని చంపారంటూ.. జాక్సన్ తండ్రి ఆరోపిస్తున్నారు. మరోసారి శవపరీక్ష చేయాలని డిమాండ్ చేశారు. అయితే.. రెండోసారి చేసిన పోస్టుమార్టం నివేదికలు వస్తేగానీ.. మైఖేల్ మరణానికి అసలు కారణం అంతుపట్టకపోవచ్చు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
మీరు మైఖేల్ కి ఫానా?
మీరు రాసింది అలాగే ఉంది.
ఒకవేళ మీరు ఫ్యాన్ అయినా మీ వల్ల జాక్ కి తెలుగునాట మాత్రం ఇంకా చెడ్డపేరే తప్ప ఒరిగేదేమీ లేదు. తెలుగువాళ్ళు చాలామందికి అతను ఒక పాప్ సింగర్ అని మాత్రమే తెలుసు, ఇంకా చాలా పుకార్లు ఈ రోజు మీ వల్లనే అందరికీ తెలిసాయి.
ఇలా మీ లాగానే రాష్ట్రానికి ఒకరు, జాక్ గురించి ఇలాంటి పుకార్లు చెప్తూ పాపులర్ కాక ఏమవుతుంది.
"పుకార్లే పెనుభూతాలై ప్రపంచంలో ప్రజ్వరిల్లుతాయి "
agnatha garu
meku music sense kodhiga unna MJ fan ayitherutharu
mee antha vedhavani nenu chudaledu
chala radham anukunnanu yemi theliyani varitho vadhimchadam waste
andhuke vadhilestunna
good post sir
చాలా బాగా రాశారు i am big fan of KING-MJ -u exxalently Nareted about him
ఐ హేట్ యు మైఖేల్
http://telugugossipsq.blogspot.com/2009/07/blog-post_1791.html
Great read! Maybe you could do a follow up to this topic!?!
My Regards,
Abraham
I'm glad you said that!?
-Sincere regards,
Sue
I must digg your article so more folks can look at it, very helpful, I had a tough time finding the results searching on the web, thanks.
- Mark
last few days our class held a similar discussion on this subject and you show something we have not covered yet, thanks.
- Lora