దేశీయంగా ఉత్పత్తి చేసే వస్తువుల ఎగుమతులు నానాటికి దిగజారుతున్నాయి. పతనంలో కూడా ఎగుమతులు అట్టడుగు స్థాయికి చేరాయా అనిపిస్తోంది. ఒక్క మే నెలలోనే ఎగుమతులు 29.2 శాతం మేరకు పడిపోయాయని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.
ఈ పతనావస్థ పరిస్థితి చక్కబడే సూచనలేవీ కనబడకపోవడంతో ఎగుమతులు పెరిగేందుకు బడ్జెట్‌లో రాయితీలు ప్రకటించవచ్చనే ఆశలు చిగురిస్తున్నాయి.
బుధవారం ప్రభుత్వం విడుదల చేసిన సమాచారం ప్రకారం మన దేశం చేసే ఎగుమతులు వరుసగా ఎనిమిదో నెలలో కూడా తగ్గిపోయినట్లు సమాచారం.
ఇదే గత సంవత్సరం మే నెలలో 15.55 బిలియన్‌ల అమెరికన్ డాలర్ల మేరకు (దాదాపు 71,500 కోట్ల రూపాయలు) ఎగుమతులు జరిగితే ఇప్పుడవి 11.01 బిలియన్ డాలర్లకు (51,700 కోట్ల రూపాయలు) పడిపోయాయి.
ప్రపంచ దేశాలు ఆర్థిక మాంద్యంతో తల్లడిల్లుతున్న ఈ తరుణంలో మన ఎగుమతులకు అంతగా డిమాండ్ లేదన్న విషయం స్పష్టమౌతోంది. ఎగుమతుల పరిస్థితి ఇలా ఉండగా మనం చేసుకునే దిగుమతులు కూడా వరసగా ఐదో నెలలో కూడా పతనావస్థలోనే ఉన్నాయి. మే నెలలో దిగుమతులు 39.2 శాతం అంటే 16.21 బిలియన్ డాలర్లు (రూ75,200 కోట్లకు పైగా) తగ్గిపోయాయని మార్కెట్ వర్గాలు సూచిస్తున్నాయి.
దీంతో మే నెలలో 5.2 బిలియన్ డాలర్ల (రూ.23,500 కోట్లకు పైగా) వాణిజ్యలోటు ఏర్పడింది. ఎగుమతులు ఇదేవిధంగా పతనమవుతుంటే అది ఆందోళన చెందాల్సిన అంశమేనని ఎగుమతులు పెరిగే సూచనలు కూడా కనిపించడం లేదని వాణిజ్య శాఖ కార్యదర్శి రాహుల్ ఖుల్లర్ విలేకరులకు చెప్పారు.
ఇలాంటి నేపథ్యంలో రానున్న బడ్జెట్‌లో ఎగుమతిదారులకు మరిన్ని రాయితీలు లభిస్తాయని అనుకుంటున్నట్లు ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
3, జులై 2009, శుక్రవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి