ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక మాంద్యం కారణంగా ప్రపంచంలోని చాలా సంస్థలు తమ ఉద్యోగులను ఇంటికి పంపింది. అదే తరహాలో భారతదేశంలోకూడా పలు కంపెనీలు దాదాపు ఆరు లక్షల మంది ఉద్యోగులను ఇండ్లకు పంపాయి.
ఇందులో భాగంగానే నిరుడు ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో 6 లక్షలమంది ఉద్యోగులను పలు దేశీయ కంపెనీలు ఇండ్లకు పంపడం జరిగింది. కాని ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో పరిస్థితి కాస్త మెరుగు పడే అవకాశాలున్నాయని కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌కు తెలిపింది.
కార్మిక, ఉపాధికల్పన శాఖ పార్లమెంటుకు తెలిపిన వివరాల ప్రకారం నిరుడు ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో దాదాపు దేశీయ కంపెనీలు ఐదు లక్షల మంది ఉద్యోగులను ఇంటికి పంపించిందని ఓ సర్వేలో తేలినట్లు గురువారం పార్లమెంటుకు సమర్పించిన నివేదికలో తెలిపింది.
ముఖ్యంగా ఈ తగ్గుదల రత్నాలు మరియు నగల పరిశ్రమ, ఆటోమొబైల్ రంగంలో తీవ్రంగా ఉన్నదని ఆ శాఖ పార్లమెంటుకు తెలిపింది. ఇదిలావుండగా నిరుడు ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలోకూడా ఉద్యోగుల కోత అత్యధికంగా ఉన్నదని, అయితే ప్రస్తుతం పరిస్థితి కాస్త మెరుగ్గా ఉందని సర్వే తెలిపింది. నిరుడు చివరి త్రైమాసికం అంటే జనవరి నుంచి మార్చి నెల వరకు ఈ రంగాలలోనే రెండున్నర లక్షల మందిని కొత్తగా నియమించుకున్నట్లు సర్వేలు తెలిపాయని ఆ శాఖ పార్లమెంటుకు విన్నవించింది
3, జులై 2009, శుక్రవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి