మాజీ ఛైర్మన్ రామలింగరాజు కారణంగా బయటపడిన ఆర్థిక కుంభకోణంతో పతనావస్థకు చేరుకున్న సత్యం కంప్యూటర్స్ సంస్థ మళ్లీ తన పూర్వ వైభవాన్ని సంతరించుకోవడం మొదలుపెట్టింది. రామలింగరాజు కుంభకోణంతో తొలి 100 అగ్రశ్రేణి సంస్ధల జాబితానుంచి జారిపోయిన సత్యం తాజాగా 97వ స్థానాన్ని చేజిక్కించుకుంది.
గతవారంలో కంపెనీ లాభాలను ప్రకటించిన తర్వాత షేర్ విలువ అమాంతం పెరగడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. అదేసమయంలో ప్రస్తుతం సత్యం మార్కెట్ విలువ దాదాపు రూ. 7,800 కోట్లకు చేరుకుంది. అంతేకాకుండా సత్యం షేర్ విలువ కనీస స్థాయినుంచి 13రెట్లు పెరిగి రూ. 80కి చేరుకోవడం విశేషం.
దేశంలోనే పేరున్న కంపెనీగా వెలుగొందిన సత్యం సంస్థ ఆర్ధిక కుంభకోణం చోటు చేసుకున్న తర్వాత పతనావస్థకు చేరుకున్న సంగతి తెలిసిందే. ఈ సమయంలో సంస్థ షేర్ విలువ రూ. 6.30కి పడిపోవడంతోపాటు మార్కెట్ విలువ సైతం రూ. 600 కోట్లకు దిగజారింది. అయితే సంస్థ పగ్గాలను టెక్ మహీంద్ర చేజిక్కించుకున్న తర్వాత సత్యం మళ్లీ పూర్వ వైభవం దిశగా అడుగులు ప్రారంభించింది.
15, జూన్ 2009, సోమవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి