12, మే 2009, మంగళవారం
జయప్రద నగ్న కష్టాలు
సినిమాల్లో.. హీరోల మధ్య నలిగిపోయే హీరోయిన్ పాత్రల్లో తెగరాణించేసిన జయప్రదకు.. నిజ జీవితంలోనూ అవే సీన్లు ఎదురయ్యాయి. అయితే.. సినిమాల్లో లాక్కొచ్చినట్లు ఇక్కడామె నెట్టుకురాలేకపోతున్నారు. పైగా.. తెగ కుమిలిపోతున్నారు. ఈ గొడవంతా ఈ సారి ఆమె పోటీ చేస్తున్న రాంపూర్ సీటు చుట్టూనే జరుగుతోంది. ఉత్తరప్రదేశ్‌లోని ఈ సీటు నుంచే.. సమాజ్‌వాదీ పార్టీ తరపున జయప్రద పోటీ చేస్తున్నారు. 2004 లోనూ జయప్రద ఇక్కడినుంచి పోటీ చేసి గెలుపొందారు. సమాజ్‌వాదీ పార్టీలోకి జయప్రదను ఆహ్వానించింది అమర్‌సింగ్ అయితే.. రాంపూర్‌కు తీసుకువచ్చింది అజాంఖాన్. ఈ అజాంఖానే ఇప్పుడు ఆమెకు కొరకరానికొయ్యగా మారారు. ఈసారి ఇక్కడినుంచి ఆమెను పోటీచేయకుండా అడ్డుకోవడానికి చివరివరకూ పోరాడి ఓడిపోయిన అజాంఖాన్.. ఆమెకు వ్యతిరేకంగా ప్రచారం మొదలుపెట్టారు. ఇదే సమయంలో రాంపూర్‌లో జయప్రద నగ్న పోస్టర్లు వెలిశాయి. ఆమె సెక్స్ వీడియోల సీడీలు విస్తృతంగా సరఫరా అవుతున్నాయి. ఇవన్నీ చూసిన జయప్రద.. ఇదంతా ఆజంఖాన్ పనేనని వాపోయారు. తనను ఎదుర్కోవడం చేతకాక.. ఇలా పరువుతీసే పనులకు ఆయన పాల్పడుతున్నారంటూ.. ఆరోపించారు. ఎలక్షన్ కమిషన్‌కు కూడా ఫిర్యాదు చేశారు. దీనిపై ఆజంఖాన్ విరుచుకుపడుతున్నారు. 24 గంటల్లోగా క్షమాపణ చెప్పకపోతే.. కేసు పెడతానని హెచ్చరిస్తున్నారు. అమర్‌సింగ్ అంటే పడని ఆజంఖాన్ ఆయనపై కోపాన్ని జయప్రదపై చూపిస్తున్నారన్నది రాజకీయ విశ్లేషకుల మాట. కొసమెరుపేమిటంటే.. ఆజంఖాన్‌పై జయప్రద ఫిర్యాదు చేయగానే.. ఆమె ఉంటున్న హోటల్‌పై పోలీసులు రైడ్ చేయడం.. మొత్తం మీద ఈ విషయంలో ములాయంసింగ్ పెద్దగా పట్టించుకోకపోవడంతో.. పరిస్థితి చేయిదాటిపోతోంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
One Response so far.
కామెంట్‌ను పోస్ట్ చేయండి