హైదరాబాద్‌లోని శంషాబాద్ విమానాశ్రయంలో బుధవారం స్వైన్‌ఫ్లూ వ్యాధి లక్షణాలున్న వ్యక్తిని వైద్య సిబ్బంది గుర్తించారు. దీంతో ఆ వ్యక్తిని పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. రాష్ట్రానికి చెందిన సదరు యువకుడు అమెరికాలోని ఇండియానాలో ఉంటూ ఉన్నత విద్య అభ్యసిస్తున్నాడు. ప్రస్తుతం అమెరికా నుంచి రాష్ట్రానికి చేరుకున్న ఇతనిలో స్వైన్‌ఫ్లూ లక్షణాలు కన్పించడంతో అతనినుంచి నమూనాలను సేకరించిన అధికారులు వాటిని ఢిల్లీలోని ఎన్ఐసీడీకి పంపించనున్నట్టు తెలిపారు. అలాగే ఢిల్లీనుంచి పరీక్షల ఫలిచాలు వచ్చాక సదరు యువకునికి స్వైన్‌ఫ్లూ ఉందా లేదా అనే విషయాన్ని చెబుతామని వారు పేర్కొన్నారు.
మరోవైపు.. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 5,915 స్వైన్ ఫ్లూ కేసులు నమోదు అయినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. అత్యధికంగా ఈ వ్యాధి అమెరికాలోని 45 రాష్ట్రాల్లో 3009 మందికి ఉన్నట్లు నిర్ధారణ అయింది. వ్యాధి లక్షణాలు మొదట బయటపడిన మెక్సికోలో 2,282 కేసులు నమోదు కాగా, కెనడాలో 358 కేసులు నమోదు అయినట్లు డబ్ల్యూహెచ్‌ఓ వెల్లడించింది. క్యూబా, ఫిన్లాండ్, థాయ్‌లాండ్‌లకు స్వైన్ ఫ్లూ పాకింది. మెక్సికో నుంచి వచ్చిన వారి నుంచి ఈ దేశాల్లో ప్లూ వచ్చినట్లు తెలుస్తోంది. మరోవైపు కెనడా నుంచి చైనాకు వెళ్లిన ఇద్దరికి ఈ వైరస్ ఉన్నట్లు తేలింది. స్వైన్ ఫ్లూ భయంతో జపాన్ మహిళ ఫుట్‌బాల్ జట్టు అమెరికా పర్యటనను రద్దు చేసుకొంది.
14, మే 2009, గురువారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి