20, ఏప్రిల్ 2009, సోమవారం
ఎక్స్ పోజింగ్ చేయాల్సిందే : నమిత
తాను పోలీసు పాత్రలు పోషించినా తర్వాత గ్లామర్ పాత్రలు ఆపననీ, ఆపితే తన ఫ్యాన్స్ ఒప్పుకోరని అంటోంది బొద్దందాల నమిత. విజయశాంతి తరహాలో తాను పోలీసు పాత్ర పోషించడం లేదనీ, ఆమెను స్ఫూర్తిగా తీసుకున్నాననీ అంటున్న నమితకు ఇష్టమైన లేడీ అధికారిణి కిరణ్ బేడీ. పోలీసు ఆఫీసర్ పాత్రకోసం తాను 7 కేజీల వరకూ బరువు తగ్గానని భారంగా చెప్పింది నమిత. అందరూ ఆశ్చర్యపోయేలా తన ఒళ్లును ఇంకా తగ్గిస్తానని చెపుతోంది. కొందరు తారలు (అనుష్కానా...?) యోగా, తదితర మార్గాల ద్వారా స్లిమ్‌గా తయారవవచ్చని చెప్పారట. అందువల్లనే తాను తిండి తగ్గించానని చెపుతోంది. విజయశాంతి కర్తవ్యం, తర్వాత "రౌడీ ఇన్స్‌స్పెక్టర్"తో పాటు పలు పాత్రలు పోషించిందని చెపుతూ, అప్పుడు గ్లామర్ వేరు, ఇప్పుడు గ్లామర్ వేరు అని చెప్పింది. ఇప్పుడు గ్లామర్‌ను గురించి మరింత విశదపరుస్తూ, ఎంత తక్కువ బట్టలు వేసుకుంటే అంత గ్లామర్ అనేదే నేటి ఫార్ములా అని చెప్పింది. అయితే ఆర్టిస్టుగా తాను అన్ని తరహా పాత్రలు పోషించడానికి రెడీగా ఉన్నానని నొక్కి వక్కాణించింది
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి