19, ఏప్రిల్ 2009, ఆదివారం
ఓడలు బండ్లు..బండ్లు ఓడలు
ఓడలు బండ్లు కావడం .. బండ్లు ఓడలు కావడం అంటే ఇదే. తొలి సీజన్లో అద్భుతంగా రాణించిన చెన్నై సూపర్ కింగ్స్, రాజస్తాన్ రాయల్స్ జట్లు రెండో సీజన్లో మాత్రం చతికిల పడ్డాయి. చెన్నై, ముంబై ఇండియన్స్ చేతిలో ఓడిపోగా, బెంగలూరు చేతిలో ఘోర పరాజయం చవి చూసింది రాజస్తాన్ రాయల్స్. ఇండియన్ ప్రీమియర్ లీగ్ రెండో సీజన్ అద్భుతంగా ప్రారంభమయింది. న్యూలాండ్స్ స్టేడియంలో శనివారం జరిగిన మొదటి మ్యాచ్ లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై ముంబై ఇండియన్స్ జట్టు 20 పరుగుల తేడాతో విజయం సాధించింది. లిటిల్ మాస్టర్ సచిన్ టెండుల్కర్ తన అనుభవాన్నంతా రంగరించి 59(నాటౌట్) పరుగులు సాధించడమే కాకుండా, గత సంవత్సరం రన్నర్ అప్, మహోంద్ర సింగ్ ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ ను చిత్తుగా ఓడించి, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును కైవసం చేసుకున్నాడు. బౌలర్లకు పూర్తిగా అనుకూలించిన పిచ్ మీద తన బ్యాటింగ్ ప్రతిభను ప్రదర్శించడమే కాకుండా, చెన్నై జట్టు బ్యాటింగ్ చేసినప్పుడు వ్యూహాత్మకంగా బౌలింగ్, ఫీల్డింగ్ మార్పులు చేస్తూ ధోనీతో సహా ప్రత్యర్ధి బ్యాట్స్ మెన్ ను కట్టడి చేశాడు. విశేషమేమిటంటే, క్రితం సారి ఇండియాలో ఐపిఎల్ జరిగినప్పుడు ప్రేక్షకులకు కనువిందు చేసిన సిక్సర్లు, ఇక్కడి ఫాస్ట్ పిచ్ ల మీద అంత పెద్ద సంఖ్యలో కనిపించలేదు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి