తెలంగాణపై కేంద్రమంత్రుల అభిప్రాయ సేకరణ నేటితో ముగిసింది. ముఖ్యమంత్రి, తెలంగాణ, సీమాంధ్ర కేంద్ర మంత్రులతో విడివిడిగా సమావేశమై వారి వాదనలను వింది జీవోఎం. ఇప్పటికే ఈమెయిళ్ల ద్వారా సేకరించిన సమాచారంతో పాటు, రాజకీయ పార్టీలు వెలుబుచ్చిన అభిప్రాయాలు, అధికార వర్గాల ద్వారా సేకరించిన సమాచారం ఆధారంగా విభజన ఎలా చేయాలన్నదానిపై ముసాయిదాను తయారు చేయనుంది జీవోఎం. ఈ నెల 21న చివరిసారిగా సమావేశం కానున్న మంత్రుల బృందం అదేరోజు ముసాయిదాను రూపొందిస్తుంది. ఆ రోజే జరిగే, కేంద్ర కేబినెట్ ముందు దీన్ని ప్రవేశపెట్టనుంది. దాన్ని కేబినెట్ ఆమోదించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ ప్రక్రియ పూర్తైతే త్వరలోనే జరగనున్న శీతాకాల సమావేశాల్లో తెలంగాణ బిల్లును ప్రవేశపెట్టనుంది కేంద్రం. ఈ సమావేశాల్లోనే బిల్లును పెడతామని కేంద్ర హోంశాఖ కూడా స్పష్టం చేసింది.
Read more...
upa లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
upa లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
18, నవంబర్ 2013, సోమవారం
5, అక్టోబర్ 2013, శనివారం
సీమాంధ్రకు స్పెషల్ ప్యాకేజ్
Categories :
bifurcation . POLITICS . seemandhra . shinde . special package to seemandhra . telangana . TOP . upa
టీనో్ట్కు కేంద్ర
కేబినెట్ ఆమోదం తెలిపిందని తెలిసిన దగ్గర నుంచి సీమాంధ్ర మండుతూనే ఉంది. బంద్లు,
రాస్తారోకోలు,
ఆందోళనలతో అట్టుడుకుతోంది. సీడబ్ల్యూసీ తీర్మానంతో పొగ రాజేసి.. కేబినెట్ నోట్‌తో మంటపెట్టిన కేంద్రం.. సీమాంధ్ర ఆందోళనలను ఇప్పటికీ రాష్ట్ర విభజనపై వెనక్కి తగ్గేదే లేదని చెబుతోంది. అయితే,
సీమాంధ్రుల ఆందోళనలను జాగ్రత్తగా గమనిస్తున్న మన్మోహన్ సర్కార్.. వాటిని నియంత్రించేందుకు ప్యాకేజ్ అస్త్రాన్ని ప్రయోగించనుంది. కొండ ప్రాంతాల రాష్ట్రాలకు అమలవుతున్న ట్యాక్స్ హాలిడేను సీమాంధ్రకు వర్తింపజేయనుంది. అంతేకాదు. చాలామంది అభ్యంతరం అంతా హైదరాబాద్ పైనే కాబట్టి,
ఉమ్మడి రాజధానిగా ఉండే పదేళ్లలో శాంతి భద్రత ల వ్యవహారాన్ని పూర్తిగా గవర్నర్ చేతిలో పెట్టనుంది.
రాష్ట్రాన్ని
ఎలా
విభజించాలన్న దానిపై కసరత్తు చేయడానికి,
మంత్రుల బృందం ఏర్పాటు చేసిన కేంద్రం,
ఇప్పటికే కాంగ్రెస్లో అంతర్గతంగానూ,
కాంగ్రెస్కు - కేంద్రానికి మధ్య జరిగిన రాజకీయ సంప్రదింపుల ఆధారంగా విస్తృతస్థాయి న్యాయపరమైన ప్రణాళికను సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. దీని ప్రకారం తెలంగాణ,
సీమాంధ్రకు ఉమ్మడి రాజధానిగా హైదరాబాద్ ఉండే పదేళ్ల పాటు ఒకే గవర్నర్ ఉంటారు. శాంతిభద్రతల వ్యవహారం కేంద్ర పాలిత ప్రాంతాల తరహాలో గవర్నర్ చేతిలోనే ఉంటుంది. యూటీ కేడర్ అధికారులే హైదరాబాద్లో బాధ్యతలు నిర్వహిస్తారు.
రెండు
రాష్ట్రాలకు రెండు ప్రత్యేక అసెంబ్లీలు,
రెండు
హైకోర్టులు హైదరాబాద్లోనే పనిచేస్తాయి. వీటని ఎలా ఏర్పాటు చేయాలన్నది మంత్రుల బృందం నిర్ణయిస్తుంది. కొత్త అసెంబ్లీకోసం హైదరాబాద్లో భవనం సిద్ధంగానే ఉన్నప్పటికీ,
కొత్త
హైకోర్ట్ ఏర్పాటుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో చర్చించనుంది కేంద్రం. రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తున్న సీమాంధ్ర మంత్రులు,
ఎంపీలకు ఈ ప్యాకేజ్ గురించి ప్రభుత్వ పెద్దలు వివరించినట్లు సమాచారం. అయితే,
ఈ
ప్యాకేజ్ను మరింత మెరుగుపరచడానికి వీరు సలహాలిస్తమనగా,
మంత్రుల బృందానికి నేతృత్వం వహిస్తున్న చిదంబరం ముందు వినిపించాలని సూచించినట్లు తెలుస్తోంది.
ఇక కాంగ్రెస్
పార్టీ పరంగా ఏర్పాటు చేసిన ఏకే ఆంటోనీ కమిటీ,
రాజకీయ కోణంలో సమస్యను పరిష్కరించడానికి అభిప్రాయ సేకరణను జరుపుతూనే ఉంది. అయితే కేబినెట్ నోట్ తర్వాత సీమాంధ్రలో ఆందోళనలు మరింత ఉధృతం కావడంతో,
ఈ
సమస్యను వెంటనే పరిష్కరించాలనుకొంటోంది. అందుకే,
సీమాంధ్ర ప్యాకేజ్కు తుదిరూపునిస్తోంది.
4, అక్టోబర్ 2013, శుక్రవారం
ఇన్నాళ్లూ ఎందుకు ఆపారు.. ఇప్పుడు దొడ్డిదారిన ఎందుకు తెచ్చారు
ఎంతో శాంతియుతంగా, సామరస్యంగా జరగాల్సిన రాష్ట్ర విభజన ప్రక్రియ యూపీఏ సర్కార్, కాంగ్రెస్ హైకమాండ్ రాజకీయాల కారణంగా అత్యంత ఉద్రిక్త పరిస్థితుల మధ్య సాగుతోంది. ముఖ్యంగా ఆంటోనీ కమిటీ నివేదిక వచ్చే వరకూ తెలంగాణ నోట్ ఆగిపోతుందన్న ధీమాతో ఉన్న సీమాంధ్రులు.. కేబినెట్ నోట్ ఆమోదం పొందడంతో ఒక్కసారిగా ఉద్వేగానికి లోనయ్యారు. 63 రోజులుగా ఉద్యమం చేస్తున్నా తమ మనోభావాలను గుర్తించేలేదని, తమను కేంద్రం మోసం చేస్తుందన్న భయాందోళనకు గురయ్యారు.
సీడబ్ల్యూసీ తీర్మానం చేసిన తర్వాత వెంటనే కార్యాచరణ మొదలుపెట్టామన్న కేంద్రప్రభుత్వం ఈ విషయాన్ని తేల్చకుండా ఇంతకాలం నాన్చుతూ వచ్చింది. కేబినెట్ నోట్ తయారువుతోందని కొంతకాలం క్రితం చెప్పిన షిండే, ఆ తర్వాత మాట మార్చారు. అంతెందుకు, గురువారం సాయంత్రం కేబినెట్ భేటీలో నోట్ ప్రస్తావన ఉంటుందని మీడియా కోడైకూస్తుంటే, మధ్యాహ్నం వేళ తీరిగ్గా అవన్నీ వదంతులేనని కొట్టి పారేశారు. చివరకు కేబినెట్ మీటింగ్ కు హాజరయ్యే మంత్రులకు కూడా నోట్ వ్యవహారాన్ని ముఖ్యమైన విషయంగా చెప్పలేదు. కేవలం టేబుల్ అజెండాగా పెట్టి అందరినీ మభ్య పెట్టే ప్రయత్నం చేశారు. చివరకు, కేబినెట్ సమావేశం మొత్తాన్ని కేవలం తెలంగాణ నోట్ కే పరిమితం చేశారు. ఇలా దొంగచాటుగా వ్యవహరించాల్సిన అవసరం కేంద్రానికి ఎందుకు వచ్చింది. టీ నోట్ తయారయ్యిందని, కేబినెట్ భేటీలో చర్చిస్తామని నేరుగా ప్రకటించవచ్చు కదా.. ఇలాంటి చర్యల వల్ల జనంలో మరిన్ని అపోహలు ఏర్పడుతున్నాయి. అసలు ఆంటోనీ కమిటీని ఏర్పాటు చేయాల్సిన అవసరమే లేదు.. కేబినెట్ నోట్ పై ఏర్పాటు చేసే మంత్రుల బృందమే అన్ని ప్రాంతాల అభిప్రాయం తీసుకుంటుంది, విభజన ఎలా జరగాలే నిర్ణయిస్తుంది. కానీ, కాంగ్రెస్ పార్టీ ఆంటోనీ కమిటీని వేసి కాలహరణకు పాల్పడింది. జనాన్ని మభ్యపెట్టడానికి ప్రయత్నించింది. పోనీ, అదన్నా సక్రమంగా చేసిందా అంటే అదీ లేదు. ఆంటోనీ కమిటీ రాష్ట్రంలో పర్యటించడానికి వస్తోందని పీసీసీ చీఫ్ బొత్స ప్రకటించిన మరుసటి రోజే టీనోట్ కు కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇలా వరసగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే తెలంగాణ విషయంలో కాంగ్రెస్ ఏం చేయబోతోందన్నది అనుమానాస్పదంగా మారింది. ఓ వైపు సీమాంధ్రలో ఉద్యమం తీవ్రంగా సాగుతుంటే, టీనోట్ కు కేబినెట్ ఆమోదం తెలపడం ధైర్యంగా తీసుకున్న నిర్ణయం అనుకోవాలా లేక, ఈ ఆందోళనలకు మరింత ఆజ్యం పోసి, తర్వాత వాటిని సాకుగా చూపి వెనక్కి తగ్గే వ్యూహాన్ని ఏమైనా అమలు చేస్తోందా అన్న అనుమానాలు కలగకమానవు.

3, అక్టోబర్ 2013, గురువారం
తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం
Categories :
cabinet note . division . seemandhra . shinde . t note . telangana . TOP . upa
తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదాన్ని తెలిపింది. ప్రధాని నివాసంలో రెండు గంటల పాటు జరిగిన చర్చ అనంతరం తెలంగాణ ఏర్పాటుకు అంగీకరించింది కేబినెట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించిన తెలంగాణ ఏర్పాటు చేయాలని, హైదరాబాద్ ను పదేళ్ల పాటు రెండు రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా ఉంచాలని తీర్మానించింది. ప్రక్రియను ముందుకు తీసుకువెళ్లడానికి మంత్రుల బృందాన్ని ఏర్పాటు చేసింది. కేబినెట్ భేటీ ముగిసిన అనంతరం కేంద్ర హోంమంత్రి షిండే మీడియా ముందుకు వచ్చి ఈ వివరాలను ప్రకటించారు. రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల ప్రయోజనాలను రక్షించడంపై మంత్రుల బృందం ప్రత్యేక దృష్టి పెడుతుందన్నారాయన. జలవనరులు సహా, ఇతర పంపకాలపై మంత్రుల బృందం నిర్ణయం తీసుకుంటుందన్నారు షిండే. తెలంగాణ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ ఆమోదం లభించడంతో, పెద్ద ముందడుగు పడినట్లయ్యింది. కేంద్రకేబినెట్ తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుందని తెలియగానే, సీమాంధ్రలో ఆందోళనలు వెల్లువెత్తాయి. సీమాంధ్రలో 72 గంటల బంద్ కు పిలుపునిచ్చారు సమైక్యవాదులు.
Read more...
టీ నోట్ వచ్చేసింది
రెండు నెలల క్రితం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి సీడబ్ల్యూసీ నిర్ణయం తీసుకున్నప్పటినుంచి వాయిదా పడుతూ వచ్చిన తెలంగాణ నోట్ ఎట్టకేలకు కేంద్ర కేబినెట్ ముందుకు వచ్చింది. ప్రధాని నివాసంలో సాయంత్రం ఐదున్నరకు సమావేశమైన కేబినెట్ ముందు ఈ నోట్ ను ప్రవేశ పెట్టారు హోంమంత్రి షిండే. సీడబ్ల్యూసీ ప్రకటనకు తగ్గట్లుగానే హైదరాబాద్ తో కూడిన పది జిల్లాల తెలంగాణ ఏర్పాటుకే కేంద్రం ప్రక్రియ మొదలుపెట్టిందని పేర్కొన్నారు. కేబినెట్ ముందుకు టీ నోట్ రావడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న సమైక్యవాదులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. విద్యార్థి జేఏసీ నేతలు ఢిల్లీలో ప్రధాని నివాసాన్ని ముట్టడించడానికి ప్రయత్నించారు. వీరిని అడ్డుకున్న పోలీసులు అరెస్ట్ చేశారు.
Read more...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)