భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం కోసం హైదరాబాద్లో సమావేశమైన సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు పార్టీ అధినేత్రి సోనియాను కలవాలని నిర్ణయం తీసుకున్నారు. సీమాంధ్రలో 46 రోజులుగా జరుగుతున్న పోరాటంతో హైకమాండ్ పునరాలోచనలో పడిందని, ఇదే సమయంలో మరింతగా ఒత్తిడి పెంచడానికి అమ్మగారిని కలిసి అభ్యంతరాలను వివరించాలని నిర్ణయించారు. రాజీనామాల విషయంలో మాత్రం సీమాంధ్ర కేంద్రమంత్రులు ఇంకా నిర్ణయం తీసుకోలేదు. ఎంపీలు మాత్రం గతంలో ఇచ్చిన రాజీనామా లేఖలకు కట్టుబడే ఉన్నామని ప్రకటించారు. అయితే.. పదవులకన్నా ప్రజలే తమకు ముఖ్యమంటూ సమావేశం అనంతరం ప్రకటించారు కేంద్ర మంత్రి కావూరి. తక్షణం ఆంటోనీ కమిటీ రాష్ట్రంలో పర్యటించి, సీమాంధ్రలో ఉద్యమాన్ని చూడాలని, ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాలని కోరతామన్నారాయన. మినిస్టర్స్ క్వార్టర్స్ క్లబ్ హౌస్ లో జరిగిన ఈ సమావేశంలో కేంద్ర మంత్రులు కావూరి సాంబశివరావు,జేడీ శీలం, పల్లంరాజు, పురంధేశ్వరి, ఎంపీలు లగడపాటి రాజగోపాల్, అనంతవెంకట్రామిరెడ్డి, కనుమూరి బాపిరాజు, కేవీపీ రామచంద్ర రావు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు. కేంద్రమంత్రులు కిషోర్ చంద్రదేవ్, పనబాక లక్ష్మి, కిల్లి కృపారాణితోపాటు ఎంపీలు రాయపాటి సాంబశివరావు, చింతా మోహన్, హర్షకుమార్ సబ్బం హరి, టి.సుబ్బరామిరెడ్డి, నేదురమల్లి జనార్ధన రెడ్డి, బొత్స ఝాన్సీసమావేశానికి దూరంగా ఉన్నారు.
Read more...
resigns లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
resigns లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
14, సెప్టెంబర్ 2013, శనివారం
సోనియా ముందే పంచాయతీ పెడదాం..
Categories :
central ministers . congress . POLITICS . resigns . seemandhra . telangana . TOP
1, ఆగస్టు 2013, గురువారం
మొదలయ్యింది రాజీనామాల ఆట
Categories :
congress . ministers . POLITICS . rayala seema . resigns . seemandhra . telangana . TOP
రాజీనామాలపై ముందూ వెనుకా ఆలోచించిన సీమాంధ్ర మంత్రులు ఎట్టకేలకు పదవులను వదులుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే మంత్రి గంటా శ్రీనివాసరావు తన పదవికి రాజీనామా చేశారు. మిగిలిన వారూ ఈ రాత్రి సీఎం కిరణ్ ను కలిసి రాజీనామాలు సమర్పిస్తారని ప్రచారం సాగుతోంది. అటు సీమాంధ్రకు చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. జేసీ దివాకర్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, గాదె వెంకటరెడ్డి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, వెంకట్రామయ్య, సుధాకర్, మురళీకృష్ణ, ఉగ్రనరసింహారెడ్డి శాసనసభ కార్యదర్శికి తమ రాజీనామా లేఖలు సమర్పించారు. మిగిలిన ఎమ్మెల్యేలు పీసీసీ చీఫ్ కు తమ రాజీనామా లేఖలు ఇవ్వాలని నిర్ణయించారు. రాజీనామాలు చేయకుండా ప్రజల్లోకి వెళ్లలేమంటున్న నేతలు, సమైక్య ఉద్యమాన్ని ఇకపై ముందుండి నడిపిస్తామంటున్నారు. అటు రాయలసీమకు చెందిన నేతలు మాత్రం, విభజనతో రాయలసీమకు అన్యాయం జరిగిందని, తాము ఎట్టి పరిస్థితుల్లోనూ హైదరాబాద్ తోనే కలిసి ఉంటామని చెబుతున్నారు. అటు సమైక్యం కావాలంటూనే, విభజన జరిగితే మాత్రం రాజధాని తమ ప్రాంతానికే కావాలంటూ పట్టుబడుతున్నారు. పోలవరానికి జాతీయ హోదా ఇవ్వడం ద్వారా కోస్తాకు మేలు చేస్తున్న కేంద్రం, సీమకూ ప్యాకేజ్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.
అటు ఈ రాజీనామాల వ్యవహారంపై స్పందించిన రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్ మాత్రం, ఇదంతా ముందే ఊహించామన్నారు. విభజన జరుగుతున్నప్పుడు ఇలాంటి భావోద్వేగాలు సహజమేనన్నారాయన. తెలంగాణపై ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని పరిస్థితిని చక్కదిద్దడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తామన్నారు దిగ్విజయ్
Read more...
అటు ఈ రాజీనామాల వ్యవహారంపై స్పందించిన రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్ మాత్రం, ఇదంతా ముందే ఊహించామన్నారు. విభజన జరుగుతున్నప్పుడు ఇలాంటి భావోద్వేగాలు సహజమేనన్నారాయన. తెలంగాణపై ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని పరిస్థితిని చక్కదిద్దడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తామన్నారు దిగ్విజయ్
29, నవంబర్ 2011, మంగళవారం
ఒకే దెబ్బకు 61 పిట్టలు
స్పీకర్ తీసుకున్న నిర్ణయానికి ఒకే సారి 61 మంది ఎమ్మెల్యేలకు షాక్(?) తగిలింది. మూకుమ్మడిగా చేసిన రాజీనామాలను అంగీకరించేది లేదంటూ, తెలుగుదేశం తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన రాజీనామాలను స్పీకర్ నాందెడ్ల మనోహర్ తిరస్కరించారు. ఇక పార్టీలు మారిన వారి రాజీనామాలను మాత్రం ఆమోదించారు. అనర్హత వివాదంలో ఉన్నవారి రాజీనామాలను మాత్రం పెండింగ్ లో ఉంచారు. ఈ లెక్కన చూస్తే, జగన్ కు మద్దతుగా రాజీనామాలు చేసిన వారంతా ఇప్పుడు ఊపిరి పీల్చుకోవచ్చు. ఆవేశంలో రాజీనామాలు చేసిన వారంతా, కొంతకాలంగా కాంగ్రెస్కు చేరువవుతున్నారు. జగన్ వైపు ఉంటూనే, కిరణ్ సర్కార్కు మద్దతిస్తామంటున్నారు. పైగా, టీడీపీ అవిశ్వాసానికి సిద్ధమవుతున్న తరుణంలో వీరిని వదులుకోవడం ఇష్టం లేకనే రాజీనామాలను తిరస్కరించినట్లు తెలుస్తోంది. రాజీనామాలు ఆమోదం పొందినవారిలో జూపల్లి కృష్ణారావు, గంపాగోవర్ధన్, జోగురామన్న, రాజయ్యలు ఉన్నారు. ఈ రాజీనామాల తిరస్కరణతో.. మరో రాజకీయ రగడకు తెరలేపినట్లయ్యింది. ఇవాళ్టినుంచి టీఆర్ఎస్,టీటీడీపీ నేతలు ఎంత హడావిడి చేస్తారో చూడాల్సిందే..
Read more...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)

