29, నవంబర్ 2011, మంగళవారం
ఒకే దెబ్బకు 61 పిట్టలు
స్పీకర్ తీసుకున్న నిర్ణయానికి ఒకే సారి 61 మంది ఎమ్మెల్యేలకు షాక్(?) తగిలింది. మూకుమ్మడిగా చేసిన రాజీనామాలను అంగీకరించేది లేదంటూ, తెలుగుదేశం తెలంగాణ ప్రాంత ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన రాజీనామాలను స్పీకర్ నాందెడ్ల మనోహర్ తిరస్కరించారు. ఇక పార్టీలు మారిన వారి రాజీనామాలను మాత్రం ఆమోదించారు. అనర్హత వివాదంలో ఉన్నవారి రాజీనామాలను మాత్రం పెండింగ్ లో ఉంచారు. ఈ లెక్కన చూస్తే, జగన్ కు మద్దతుగా రాజీనామాలు చేసిన వారంతా ఇప్పుడు ఊపిరి పీల్చుకోవచ్చు. ఆవేశంలో రాజీనామాలు చేసిన వారంతా, కొంతకాలంగా కాంగ్రెస్కు చేరువవుతున్నారు. జగన్ వైపు ఉంటూనే, కిరణ్ సర్కార్కు మద్దతిస్తామంటున్నారు. పైగా, టీడీపీ అవిశ్వాసానికి సిద్ధమవుతున్న తరుణంలో వీరిని వదులుకోవడం ఇష్టం లేకనే రాజీనామాలను తిరస్కరించినట్లు తెలుస్తోంది. రాజీనామాలు ఆమోదం పొందినవారిలో జూపల్లి కృష్ణారావు, గంపాగోవర్ధన్, జోగురామన్న, రాజయ్యలు ఉన్నారు. ఈ రాజీనామాల తిరస్కరణతో.. మరో రాజకీయ రగడకు తెరలేపినట్లయ్యింది. ఇవాళ్టినుంచి టీఆర్ఎస్,టీటీడీపీ నేతలు ఎంత హడావిడి చేస్తారో చూడాల్సిందే..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి