తన తమ్ముడికి గుణపాఠం చెప్పాలని కార్యకర్తలను కోరారు సోనియా కుమార్తె ప్రియాంక గాంధీ. అయితే, ఈ మాటలు తన సొంత తమ్ముడు రాహుల్ గాంధీని ఉద్దేశించి మాత్రం కాదు.. పినతల్లి కొడుకైన వరుణ్ గాంధీ గురించి. అమేథీలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. సుల్తాన్ పూర్ నుంచి పోటీ పడుతున్న వరుణ్ కు ఈ సారి గుణపాఠం చెప్పాల్సిందేనంటూ సూచించారామె. వరుణ్ పై ప్రియాంక నేరుగా దాడి చేయడం ఇదే తొలిసారి. గాంధీ కుటుంబానికి చెందిన వ్యక్తిగా వరుణ్ ను భావించాల్సిన అవసరం లేదన్నారామె. గాంధీ కుటుంబం దేశం కోసం ప్రాణత్యాగాలను సైతం చేసిందని, వరుణ్ కు సరైన మార్గం ఏదో చూపించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు ప్రియాంక. రాజకీయాలు ప్రజలకు కలిపి ఉంచడానికి దోహద పడాలే తప్ప.. విభజించకూడదని, ఈ విషయాన్ని వరుణ్ తెలుసుకోవాల్సి ఉందన్నారు ప్రియాంక గాంధీ. అమేథీలో కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడిన వీడియోలు మీడియాకు చిక్కాయి.
priyanka లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
priyanka లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
13, ఏప్రిల్ 2014, ఆదివారం
తమ్ముడికి గుణపాఠం చెప్పమన్న ప్రియాంక
Categories :
congress . election . POLITICS . priyanka . rahul gandhi . varun gandhi
Read more...
16, అక్టోబర్ 2013, బుధవారం
ప్రియాంకను పిలిస్తే.. పార్టీ పొమ్మంది
ఉత్తరప్రదేశ్ అలహాబాద్ లోని కాంగ్రెస్ కార్యకర్తల ఉత్సాహం వారి కొంప ముంచింది. ప్రియాంకను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయమంటూ వేసిన ఓ ఫ్లెక్సీ ఏకంగా వారిని పార్టీనుంచి బహిష్కరణకు దారి తీసింది. 2014 ఎన్నికల్లో యూపీలోని పూల్‌పూర్ నియోజకవర్గం నుంచి ప్రియాంక పోటీ చేయాలంటూ అలహాబాద్ కాంగ్రెస్ కమిటీ ఇటీవలే తీర్మానం చేసింది. ఈ నియోజకవర్గానికి ఒకప్పుడు నెహ్రూ ప్రాతినిధ్యం వహించారు. దీంతో ఓ ఇద్దరు కార్యకర్తలు ప్రియాంక పోటీ చేయాలంటూ ఓ ఫ్లెక్సీని కట్టారు. అందులో సోనియా అనారోగ్యంతో ఉంది.. రాహుల్ మీద బాధ్యతల బరువు ఎక్కువైపోయింది. ఫూల్ పూర్ నియోజకవర్గంలో ప్రియాంకే పోటీ చేయాలి అంటూ రాసి.. వారి ముగ్గురి ఫోటోలతో పాటు, తమ ఫోటోలను కూడా వేసుకున్నారు ఆ ఇద్దరు కార్యకర్తలు. ఈ పోస్టర్ మీడియాకు ఎక్కడంతో ఆగ్రహం చెందిన ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడు నిర్మల్ ఖత్రి.. వారిద్దరినీ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలంటూ అదేశించాడు. అవసరమైతే వారిపై కేసు కూడా పెట్టాలని పార్టీ నేతలకు సూచించాడు. సోనియా అనారోగ్యంపై ఎవరైనా ఫ్లెక్సీలు ప్రచురిస్తే, ఇదే పరిస్థితి ఎదురవుతుందని వార్నింగ్ ఇచ్చాడు. దీంతో ఏం చేయాలో తెలియకు తలపట్టుకున్నారు ఆ ఇద్దరు కాంగ్రెస్ నేతలు..
Read more...
16, ఏప్రిల్ 2009, గురువారం
ఎన్నికల ప్రచారములో గాంధీల ఐదోతరం
Categories :

దేశానికి వారసత్వ రాజకీయాలు రాబోయో తరాలకి కూడా తప్పేటట్లు లేదు. అన్న రాహుల్ ..గాంధీ కోసం ఉత్తర ప్రదేశలో ప్రచారము చేస్తున్న ప్రియాంక గాంధీ తన అన్నని ప్రధానమంత్రిగా చూడాలని అనుకుంటున్నట్లుగా చెప్పారు.2004 ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వము అధికారము చేపడుతున్న సందర్భములో సోనియా గాంధీని ప్రధాన మంత్రిగా చేయాలని కాంగ్రెస్ నాయకులు ప్రయత్నించారు. అయితే ఆమె విదేశీయత పై సర్వత్రా విమర్శలు వెలువడటం, బిజెపి దాని అనుభంద పార్టీలు, కొంత మంది వ్యక్తులు సోనియ గాంధీ పై ఒక్క సారిగా విరుచుకు పడటం, ఆందోళనలకి ప్రయత్నించటంతో ఆమె వెనక్కి తగ్గవలసి వచ్చింది.2009 ఎన్నికలకి ముందే మన్మోహన్ సింగ్‌ని మళ్లీ ప్రధాని అభ్యర్దీగా ప్రకటించి వివాదాలకు ఆస్కారము లేకుండా వ్యూహాత్మకంగా అడుగు వేయడము జరిగింది. 2004 ఎన్నికల తరువాత ప్రధానిగా మన్మోహన్ సింగ్ ఉన్నా మొత్తము పెత్తనము అంత రాజ్యాంగతరశక్తిగా సోనియ గాంధీ ఒక ప్రధానిగానే అధికారాన్ని చెలాయించారు. ఇప్పుడు కూడా అదే విధముగా మన్మోహన్ సింగ్ ని అడ్డంపేట్టుకుని మళ్లీ చక్రం తిప్పటానికి ప్రయత్నిస్తుండటం విశేషం.కాంగ్రెస్ పార్టీకి ప్రచారము చేయటానికి రాహుల్ గాంధీ, ప్రియాంక , సోనియాలతో పాటు ప్రియాంకా పిల్లలైన రేహాన్, మైరాలను వెంటబెట్టుకొని ప్రియాంక గాంధీ ఉత్తర ప్రదేశ్‌లో వారితో మా మామకి ఓటేయ్యండి అని అనిపిస్తున్నారు. ఇదంతా చూస్తుంటే మరో తరాన్ని కూడా భారత ప్రజలు మోయక తప్పదా అని ప్రజలకి అనుమానం వస్తోంది.ప్రియాంక పిల్లలు బ్యాడ్జీలు పంచడం, పిల్లలతో కలిసి ఆడుతూ ప్రచారము చేయటము అక్కడ ప్రజలలో ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. పుట్టుకతోటే వీరికి కూడా రాజకీయాలు అబ్బాయి అని ఆశ్చర్యపోతున్నారు. కాంగ్రెస్ నాయకులు దేశ వ్యాప్తంగా ఇవి అన్ని చూసి ఆనందపడుతున్నారు. మనకి రాబోయో రోజులలో కూడా ఢోకలేదు అని గాంధీల కుటుంబము ఉన్నంత వరకు అధికారము తమదేనని ఆనంద పడుతున్నారు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)

