22, ఫిబ్రవరి 2012, బుధవారం
రాజీ కుదిర్చారు.. పది లక్షలు తీసుకున్నారు.. మంత్రి మోపిదేవిపై ఆరోపణలు
మద్యం సిండికేట్ల వ్యవహారంలో మంత్రి మోపిదేవి మెడకు ఉచ్చు బిగుసుకున్నట్లే కనిపిస్తోంది. ఏసీబీ అధికారులకు చిక్కిన ఖమ్మం జిల్లా మద్యం సిండికేట్ నున్న రమణ పదే పదే మోపిదేవి పేరును చెబుతున్నట్లు తెలుస్తోంది. ఖమ్మం జిల్లాలో రెండు సిండికేట్ల మధ్య గొడవను రాజీ కుదర్చినందుకు గానీ.. మంత్రికి పది లక్షలు ముట్టజెప్పామని రమణ ఏసీబీ అధికారులకు చెప్పినట్లు సమాచారం. మంత్రి డబ్బులు తీసుకున్న మాట ముమ్మాటికి నిజమని రమణ చెబుతుండడంతో.. మంత్రికి కష్టాలు తప్పవని తెలుస్తోంది. దీంతో కలత చెందిన మోపిదేవి నిన్న సీఎంను హుటాహుటీన కలిసి కన్నీటి పర్యంతమయ్యారు. తనపేరు పదేపదే ప్రస్తావనకు రావడంపై ఆందోళన వ్యక్తం చేశారు. తనను పదవినుంచి తొలగించాలని లేదంటే తానే పదవినుంచి వైదొలుగుతానని స్పష్టం చేశారు. అయితే.. ఈ వ్యవహారం నుంచి బయటపడతారన్న నమ్మకం తనకుందని, ఆందోళన చెందాల్సిన పని లేదని.. సీఎం.. మోపిదేవికి నచ్చజెప్పారు. దీంతో మోపిదేవి రాజీనామా విషయంలో వెనక్కి తగ్గారు. అయితే.. ఈ విషయంలో నిజా నిజాల నిగ్గుతేల్చడానికి పూర్తిస్థాయి దర్యాప్తు చేయాలని కోరారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి