బెయిల్ ఫర్ సేల్.. అడిగినన్ని డబ్బులిస్తే.. ఎవరికైనా, ఎలాంటికేసులైనా బెయిల్ గ్యారెంటీ. అప్పుడెప్పుడో.. అక్కడెక్కడో న్యాయమూర్తి అవినీతి పరులని చదివిన మనకు.. ఇక్కడా ఉన్నానంటూ... నిరూపించాడు జస్టిస్ పట్టాభి. బెయిళ్లతో వ్యాపారం చేసుకుంటూ అడ్డంగా దొరికిపోయాడు. ఇనుప గనుల అక్రమార్కుడు గాలి జనార్దనరెడ్డికి, బెయిల్ ఇవ్వడంపై శోధించిన ఏసీబీ మరో విషయాన్ని కూడా బయటపెట్టింది. అవినీతి కేసులో అరెస్ట్ అయి, ప్రస్తుతం పోలీసు కస్టడీలో ఉన్న మాజీ డీఎస్పీ సర్వేశ్వరరెడ్డికి బెయిల్ ఇవ్వడానికీ..పట్టాభి లంచం తీసుకున్నాడట. పది లక్షల రూపాయలను వసూలు చేసి, అతనికి బెయిల్ మంజూరు చేశాడు. ఆ తర్వాత గాలి కేసులో భారీగానే డబ్బు డిమాండ్ చేశాడు. ఈ డీల్ కోసం పెద్దమొత్తంలోనే బేరసారాలు సాగాయి. పదికోట్ల రూపాయల నుంచి మొదలై.. చివరకు 5 కోట్లకు డీల్ సెటిల్ అయ్యింది. ఈ వ్యవహారంలో మరో కొత్తపేరూ బయటకు వచ్చింది. ఎలక్షన్ కమిషన్‌లో పనిచేస్తున్న ప్రభాకర్‌రావు.. ముందుగా ఈ ఆఫర్‌ను తీసుకొచ్చారు. దీన్ని తిరస్కరించిన పట్టాభి.. తిరిగి తన స్నేహితుడు రిటైర్డ్ జడ్జి చలపతిరావు ఈ ఆఫర్ తెచ్చేసరికి ఓకే అన్నారు. దీని కోసం నాచారంకు చెందిన యాదగిరిరావు, చలపతిరావులు కలిసి డీల్ ఫిక్స్ చేశారు. పట్టాభి కొడుకు రవిచంద్ర కూడా ఈ వ్యవహారంలో పాలుపంచుకున్నాడు..
డీల్ ఓకే కావడంతో.. మే 11న గాలి జనార్దనరెడ్డికి జస్టిస్ పట్టాభి బెయిల్ మంజూరు చేశారు. ఈ తంతు జరుగుతున్న సమయంలో.. మొత్తం 12 సిమ్‌కార్డులను ఉపయోగించినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. పట్టాభిరామరావు కుమారుడు రవిచంద్ర, రిటైర్డ్ జడ్జీ చలపతిరావుల నేరాంగీకార వాంగ్మూలంలో ఈ విషయాలను ఏసీబీ పేర్కొంది. దీన్ని కోర్టుకు సమర్పించింది.
Read more...
gali లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
gali లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
30, జూన్ 2012, శనివారం
2, మార్చి 2012, శుక్రవారం
గాలి గుట్లు తెలిసినవాడు దొరికేశాడు
గాలిజనార్ధన రెడ్డి అక్రమాల గుట్లన్నీ తెలిసిన వ్యక్తి ఎట్టకేలకు లొంగిపోయాడు. అతడే.. గాలి పీఏ అలీఖాన్. గాలి చేసిన అక్రమాలు, బినామీ కంపెనీలు, వాటి ఆదాయాలు, గాలి పెట్టుబడులు, గాలి అపార సంపద వివరాలు అన్నీ.. అలీఖాన్ దగ్గర ఉన్న ల్యాప్ టాప్ లో ఉన్నట్లు సీబీఐ అనుమానిస్తోంది. గాలి జనార్ధనరెడ్డిని అరెస్ట్ చేసిన సమయంలో ఈ ల్యాప్ టాప్ తో సహా అలీఖాన్ మాయమయ్యాడు. అతని కోసం సీబీఐ వెదుకుతున్నా ఇంతవరకూ అరెస్ట్ చేయలేకపోయింది. అయితే.. గాలి జనార్ధనరెడ్డి బెంగళూరు కోర్టులో హాజరుపరుస్తున్న సమయంలోనే అలీఖాన్ కూడా లొంగిపోయాడు. గాలి అక్రమాల నిగ్గు తేల్చడంలో అలీఖాన్ పాత్ర చాలాముఖ్యమైంది కావడంతో.. సీబీఐ అతడ్ని కస్టడీకి కోరింది. కోర్టు మార్చి 12 వరకూ కస్టడీకి అనుమతించింది. అలీఖాన్ చెప్పబోయే సమాచారం ఆధారంగానే, సీబీఐ దర్యాప్తు ముందుకు సాగనుంది.
Read more...
22, ఫిబ్రవరి 2012, బుధవారం
గాలి బృందానికి ర్యాగింగ్ బెడద..
Categories :
chanchalguda . gali . news . ragging . TOP
మైనింగ్ డాన్ గాలి జనార్ధరన్ రెడ్డి అండ్ కో కు చంచల్ గూడ జైల్లో వింత పరిస్థితి ఎదురవుతోంది. బయటిప్రపంచంలో తాము చెప్పిందే వేదంగా చెల్లించుకున్న గాలికి.. చంచల్ గూడ జైలు ఖైదీలు చుక్కులు చూపిస్తున్నారు. గాలిజనార్ధనరెడ్డి, విజయసాయిరెడ్డి, ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి, రాజగోపాల్, ఇలా అంతా కనపడడం ఆలస్యం చంచల్ గూడ ఖైదీలు ర్యాగింగ్ చేయడం మొదలుపెడుతున్నారు. మహేశ్ బాబు బిజినెస్ మేన్లోని సూపర్ హిట్ సాంగ్.. సార్ వస్తారొస్తారంటూ.. ఏడిపించుకుతింటున్నారట. ఇంతకాలం రాజభోగాలు అనుభవించిన తాము.. ఇలా ఖైదీల ముందు చులకనకావడం జీర్ణించుకోలేక.. ఈ వీఐపీ ఖైదీలు లోలోపల కుతకుతలాడిపోతున్నారు.
Read more...
29, జనవరి 2012, ఆదివారం
చంద్రబాబుపై గాలి మాటలు
Categories :
chandrababu . gali . POLITICS . tdp . TOP
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రధానిమంత్రి కావాలని దేశంలోని చాలా ప్రాంతాల్లో ప్రజలు కోరుకుంటున్నారని ఆ పార్టీ సీనియర్ నేత గాలి ముద్దుకృష్ణమ నాయుడు అన్నారు. బాబు ప్రధాని అయితే దేశాన్ని అభివృద్ధి చేసేందుకు అవకాశం దొరుకుతుందన్నారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయిలో రోజురోజుకు దిగజారుతోందని వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీకి మూడో స్థానం దక్కుతుందన్నారు. మొత్తానికి బాబు ప్రధాని అభ్యర్థి అయితే బాగుంటుందని గాలి చెప్పడంతో.. టీడీపీలో వచ్చే ఎన్నికలకు ఏదో బలమైన స్కెచ్చే వేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Read more...
4, నవంబర్ 2011, శుక్రవారం
పాపమంతా బాబుదే..: జగన్
Categories :
chandrababu . gali . jagan . news . TOP
గాలి గనుల పాపంలో ప్రధాన పాత్ర ఎవరిదంటే, ఎవరైనా టక్కున చెప్పే సమాధానం వైఎస్ దని. అడ్డగోలుగా గనులను, గాలి బృందానికి కట్టిపెట్టారని, ఓబుళాపురంలో నిబంధనలను ఉల్లంఘించి మరీ ఖనిజాన్ని కొల్లగొట్టినా చూస్తూ ఉన్న ఘనత వైఎస్ కు మాత్రమే చెల్లింది. అయితే, ఈ విషయంలో ఓ కొత్త కోణాన్ని బయటపెట్టారు వైఎస్ జగన్. అసలు గాలి కుంభకోణంలో ప్రధాన పాత్ర చంద్రబాబుదే అంటున్నారు. అనడమే కాదు, సీబీఐ ఈ కోణంలోనూ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. దానికి సంబంధించి బాబు హయాంలో జారీ అయిన ఓ జీవోను అందించారు. గాలి అక్రమాలపై దాదాపు రెండు గంటల పాటు సీబీఐ జగన్ ను విచారించింది. ఈ కేసు విషయంలో తాను నిందితుడిని కాదని, కేవలం సాక్షిని మాత్రమేనని, సీబీఐ కూడా తనను సాక్షిగానే పిలించిందని, దీన్నిబట్టి తనపై ఎలాంటి మచ్చలేదన్న విషాన్ని అర్థం చేసుకోవాలని జగన్ తెలిపారు. సాక్షిలో ఆర్.ఆర్.గ్లోబల్ పెట్టుబడులు ఉన్నాయన్నారు. గాలితో తనకు ఎలాంటి సాన్నిహిత్యం లేదని, మొత్తమీద నాలుగుసార్లు మాత్రమే అతన్ని కలిశానని సీబీఐకు జగన్ చెప్పారు.
బాబు పాత్రేమిటి?
1996లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రామ్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఓబుళాపురం గనులను లీజుకు ఇచ్చారు. 2002కు వచ్చేసరికి, అదే చంద్రబాబు, రామ్మోహన్ రెడ్డి నుంచి 64.2 ఎకరాల భూమిని గాలి జనార్ధనరెడ్డికి బదలాయించారు. కాబట్టి, గాలి అక్రమాలకు వైఎస్కు ఎలాంటి సంబంధం లేదని, అంతా చంద్రబాబు తిప్పిన చక్రమేనని జగన్ ఆరోపిస్తున్నారు. మీడియా కూడా చంద్రబాబు పాత్రేమిటన్నది బయటపెట్టాలని సూచిస్తున్నారు.
Read more...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)




