4, నవంబర్ 2011, శుక్రవారం
పాపమంతా బాబుదే..: జగన్
Categories :
chandrababu . gali . jagan . news . TOP
గాలి గనుల పాపంలో ప్రధాన పాత్ర ఎవరిదంటే, ఎవరైనా టక్కున చెప్పే సమాధానం వైఎస్ దని. అడ్డగోలుగా గనులను, గాలి బృందానికి కట్టిపెట్టారని, ఓబుళాపురంలో నిబంధనలను ఉల్లంఘించి మరీ ఖనిజాన్ని కొల్లగొట్టినా చూస్తూ ఉన్న ఘనత వైఎస్ కు మాత్రమే చెల్లింది. అయితే, ఈ విషయంలో ఓ కొత్త కోణాన్ని బయటపెట్టారు వైఎస్ జగన్. అసలు గాలి కుంభకోణంలో ప్రధాన పాత్ర చంద్రబాబుదే అంటున్నారు. అనడమే కాదు, సీబీఐ ఈ కోణంలోనూ దర్యాప్తు చేయాలని డిమాండ్ చేశారు. దానికి సంబంధించి బాబు హయాంలో జారీ అయిన ఓ జీవోను అందించారు. గాలి అక్రమాలపై దాదాపు రెండు గంటల పాటు సీబీఐ జగన్ ను విచారించింది. ఈ కేసు విషయంలో తాను నిందితుడిని కాదని, కేవలం సాక్షిని మాత్రమేనని, సీబీఐ కూడా తనను సాక్షిగానే పిలించిందని, దీన్నిబట్టి తనపై ఎలాంటి మచ్చలేదన్న విషాన్ని అర్థం చేసుకోవాలని జగన్ తెలిపారు. సాక్షిలో ఆర్.ఆర్.గ్లోబల్ పెట్టుబడులు ఉన్నాయన్నారు. గాలితో తనకు ఎలాంటి సాన్నిహిత్యం లేదని, మొత్తమీద నాలుగుసార్లు మాత్రమే అతన్ని కలిశానని సీబీఐకు జగన్ చెప్పారు.
బాబు పాత్రేమిటి?
1996లో చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు రామ్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి ఓబుళాపురం గనులను లీజుకు ఇచ్చారు. 2002కు వచ్చేసరికి, అదే చంద్రబాబు, రామ్మోహన్ రెడ్డి నుంచి 64.2 ఎకరాల భూమిని గాలి జనార్ధనరెడ్డికి బదలాయించారు. కాబట్టి, గాలి అక్రమాలకు వైఎస్కు ఎలాంటి సంబంధం లేదని, అంతా చంద్రబాబు తిప్పిన చక్రమేనని జగన్ ఆరోపిస్తున్నారు. మీడియా కూడా చంద్రబాబు పాత్రేమిటన్నది బయటపెట్టాలని సూచిస్తున్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
అవనవును, జగన్ బాబూ గత 9, 16 సంవత్స్రాలుగా జరిగిన అభివృధి అంతా వైఎస్సార్‌దే, అవినీతి, అసమర్ధత పాలన మటుకు చంద్రబాబుదే. కొద్ది సంవత్సరాలలో జగన్ రాజకీయ నాయకుడిగా ఎంత ఎదిగిపోయాడు.....మరి లైసెన్సు మటుకు చంద్రబాబు దగ్గర పుచ్చుకొన్న "గాలి" వైఎస్సార్ గారి పాలనలో అపసవ్యంగా వీస్తే సహకరించినది ఎవరు జగన్ బాబూ?