భారత క్రికెట్ కెప్టెన్ ధోనీ ఇంటిపై నిన్న రాత్రి రాళ్లదాడి జరిగింది. బుధవారం రాంచీలో జరిగిన నాలుగోవన్డే వర్షం కారణంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన కాసేపటికే ఈ దాడి జరగడం గమనార్హం. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి రాళ్లు విసిరి పరారైనట్లు తెలుస్తోంది. ఈ దాడిలో ఇంటి ముందున్న అద్దాలు ధ్వంసమయ్యాయి. ఆ సమయంలో ధోనీ ఇంట్లో ఎవరూ లేరు. కుటుంబ సభ్యులంతా మ్యాచ్ చూడడం కోసం రాంచీ స్టేడియంలో ఉన్నారు. దీనిపై ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ధోనీ నివాసం దగ్గరున్న సీసీకెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు.
Read more...
dhoni లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
dhoni లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
24, అక్టోబర్ 2013, గురువారం
5, మార్చి 2013, మంగళవారం
ఆస్ట్రేలియా పని అయిపోయిందా..?
ఉప్పల్ లోనూ ఆస్ట్రేలియాకు తిప్పలు తప్పలేదు. కనీసం చెన్నైలో భారత్ రెండో ఇన్నింగ్స్ ఆడాల్సి వచ్చింది. కానీ, ఉప్పల్ మాత్రం ఇన్నింగ్స్ 135 పరుగుల తేడాతో ఘోర పరాజయం పాలయ్యింది ఆస్ట్రేలియా. భారత్ గడ్డ పై వరసగా ఐదో టెస్ట్ ఓటమిని చవిచూసింది. నిరుడు ఆస్ట్రేలియాలో జరిగిన సిరీస్లో నాలుగు మ్యాచ్ లనూ గెలుచుకున్న కంగారూలకు.. ఇది శరాఘాతమే. ఈ సరిసీ్ లో ఇప్పటికే రెండు టెస్ట్ లను గెలుచుకున్న టీమ్ ఇండియా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీని అందుకోవడానికి రెడీ అయ్యింది. పైగా, ఉప్పల్ విజయం భారత క్రికెట్ చరిత్రలోనే రెండో అతిపెద్ద విజయం. కెప్టెన్సీపై విమర్శలు ఎదుర్కొంటున్న ధోనీకి కూడా ఇది అతిపెద్ద ఊరట. భారత కెప్టెన్లలో అత్యధిక టెస్ట్ విజయాలు అధించిన ఘనతను సొంతం చేసుకున్నాడు ధోనీ.
అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్ రంగాల్లో దారుణంగా విఫలమైన క్లార్క్ సేన, తమ ఆటతీరును సమీక్షించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. గతంలో ఆస్ట్రేలియా విజయాలకు వెన్నుదన్నుగా ఉన్న పాంటింగ్ లాంటి వాళ్లు రిటైర్ అవ్వడంతో బలహీనపడ్డ ఆస్ట్రేలియా.. ఇప్పుడు విజయాల కోసం వెంపర్లాడుతోంది. జట్టును నడిపిస్తున్న క్లార్క్ మినహా నిలకడా రాణిస్తున్నవారు తక్కువే. వరసగా రెండు టెస్టుల్లోనూ ఓడిపోవడంపై స్వదేశంలోనూ ఆస్ట్రేలియా ప్లేయర్లపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం పోరాటం కూడా చేయలేని పరిస్థితికి ఆసీస్ దిగజారడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. 12, ఫిబ్రవరి 2012, ఆదివారం
భారత్ ను గెలిపించిన ధోనీ
కూల్ కెప్టెన్ ధోనీ ఆపదలో ఆదుకున్నాడు. ముక్కోణపు సిరీస్ లో భాగంగా అడిలైడ్ లో ఆస్ట్రేలియాతో జరిగిన వన్డేలో భారత్ కు చిరస్మరణీయమైన విజయాన్ని అందించాడు. మొదట్లో ఎన్నో బంతులను వృథా చేసిన కెప్టెన్.. చివరి ఓవర్లో మాత్రం రెచ్చిపోయాడు. ఓటమి ఖాయం అనిపించిన తరుణం నుంచి.. గెలుపు దిశగా నడిపించాడు. అసలు చివరి ఓవర్లో ఏం జరిగిందంటే...
బంతులు.. 6.. లక్ష్యం.. 13 పరుగులు..
1. తొలి బంతికి అశ్విన్ స్ట్రైకింగ్ లో ఉన్నాడు. షాట్ మిస్ అయ్యింది. పరుగులేమి రాలేదు.
2. ఇంకా ఐదు బంతుల్లో 13 పరుగులు చేయాలి. అశ్విన్ మిడ్ వికెట్ దిశగా బంతిని తరలించాడు. రెండో పరుగును ధోనీ వద్దన్నాడు.. సింగిల్తోనే సరిపెట్టాడు..
3. నాలుగు బంతులు 12 పరుగులు. అవతల బౌలింగ్ చేస్తోంది అప్పటికే మూడు కీలక వికెట్లు తీసిన మెక్ కే. ధోనీ బాధ్యతలను భుజాన వేసుకున్నాడు. అందర్లోనూ టెన్షన్ మొదలయ్యింది. మెక్ కే చేతుల్లోంచి బంతి జారడం.. అది ధోనీ బ్యాట్ తగిలి గాల్లోకి లేవడం.. లాంగ్ ఆన్ దిశలో వెళ్లి బౌండరీ అవతల పడడం.. చకచకా జరిగిపోయాయి. అందరిలోనూ ఒక్కసారిగా ఉత్సాహం..
4. మూడు బంతులు.. ఆరు పరుగులు.. లక్ష్యం కాస్త తేలికయ్యింది. మెక్ కే ఈ సారి ఫుల్ టాస్ బాల్ వేశాడు. సిక్స్ బాదిన ఊపులోనే ధోనీ బ్యాట్ ఝలిపించాడు. టీవీలో మ్యాచ్ చూస్తున్న వారంతా సిక్స్ అని అనుకుంటున్న సమయంలో డీప్ స్క్వేర్ లెగ్లో బౌండరీ లైన్ కు కాస్త ముందు క్యాచ్ పట్టాడు.. అందర్లోనూ ఒక్కసారిగా నిస్సత్తువ. కానీ.. అది నో బాల్. ఎక్కువ ఎత్తులో వేయడంతో దాన్ని నోబాల్ గా ప్రకటించాడు ఎంపైర్. అప్పటికే రెండు పరుగులు తీసేశాడు ధోనీ. అందర్లోనూ మళ్లీ ఉత్సాహం.
5. మూడు బంతులు.. మూడు పరుగులు. మళ్లీ అందర్లో ఊపొచ్చింది. ఇక లక్ష్యం తేలిక పడింది. కానీ, అవతల ఉంది ఆస్ట్రేలియా. మెక్ కే వేసిన బంతిని ఆన్ సైడ్ లో నో మ్యాన్స్ ల్యాండ్లోకి నెట్టిన ధోనీ చక చకా పరుగులు తీయడం మొదలుపెట్టాడు. ఫోర్ వెళ్లకుండా వార్నర్ దాన్ని ఆపినా.. అప్పటికే మూడు పరుగులు తీసిన ధోనీ.. విజయగర్వంతో వికెట్ ను పీకాడు.. అంతే.. భారత్ గెలుపు.. జనంలో ఊపు..
కొసమెరుపు: 9 ఓవర్లలో కేవలం 39 పరుగులు మాత్రమే ఇచ్చి.. సెహ్వాగ్, కోహ్లీ, గంభీర్ వికెట్లను తన ఖాతాలో వేసుకుని టీమ్ ఇండియాను ఒత్తిడిలోకి నెట్టేసిన మెక్ కేనే చివరి ఓవర్లో ఒత్తిడికి లోనయ్యాడు.. భారత్ గెలుపుకు బాటలు పరిచాడు.. మరో విషయం.. గంభీర్ చేసిన 92 పరుగులు ఈ మ్యాచ్ లో విజయానికి కారణంగానే చెప్పొచ్చు.
Read more...
12, జనవరి 2012, గురువారం
టెస్ట్ క్రికెట్ కు ధోనీ బైబై..
భారత్ క్రికెట్ ప్రపంచానికి వరస విజయాల రుచి చూపించిన సూపర్ కెప్టెన్ ధోనీ టెస్ట్ క్రికెట్ కు గుడ్ బై చెప్పనున్నాడు. వచ్చే ఏడాదితో టెస్ట్ కెరీర్ ను ముగించాలని నిర్ణయించుకున్నాడు. 2015 వన్డే ప్రపంచ కప్ లో ఆడడానికి వీలుగా ఉండడం కోసమే ఈ నిర్ణయం తీసుకుంటున్నాడు. త్వరలోనో ఓ ఫార్మాట్ నుంచి తప్పుకుంటానని నేరుగా మహీనే ప్రకటించడంతో.. యావత్ క్రికెట్ ప్రపంచం షాక్ అయ్యింది. దేశం తరపున 66 టెస్టు మ్యాచ్ లు ఆడిన ధోనీ 36 మ్యాచ్ ల్లో కెప్టెన్ గా వ్యవహరించాడు. కెప్టెన్ గా 17 టెస్టుల్లో విజయాన్ని అందించాడు. మోస్ట్ సక్సెస్ ఫుల్ కెప్టెన్ గా , బ్యాట్స్ మెన్, కీపర్ గా పేరు గాంచిన ధోనీ ఇంత తక్కువ సమయంలోనే టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్ అవ్వాలనుకోవడం.. చాలామంది అభిమానులకు నిరాశనే కలిగిస్తోంది.
Read more...
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)


