1, నవంబర్ 2013, శుక్రవారం
కమల్‌కు వెయ్యి కోట్లు కావాలట!
Categories :
cinema . collections . entertainment . kamal hasan . kollywood . tamil cinema . TOP
లోకనాయకుడు, నటధీరుడు కమల్ హాసన్‌కు వెయ్యి కోట్లు కావాలట. అయితే ఇది విశ్వరూపం సినిమాలో, మర్మయోగి సినిమానో తీయడానికి కాదు... తన సినిమా కలెక్షన్లు వెయ్యికోట్ల కలెక్షన్లు రావాలన్నది ఆయన ఉద్దేశం. బెంగళూరులో జరిగిన మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ కాంక్లేవ్ కు చైర్మన్‌గా వ్యవహరించిన కమల్.. తన ప్రసంగంలో ఈ విషయాన్ని చెప్పారు. దేశంలో వందకోట్ల మంది సినీ అభిమానులున్నారని, సూపర్ హిట్ అయిన సినిమాను ఎంతలేదన్నా పదిశాతం మంది చూస్తారని ఆయన అంచనా వేశారు. ఈ పది శాతం మందే చూస్తే, థియేటర్ల ద్వారానే ఒక్కో సినిమాకు వెయ్యి కోట్ల కలెక్షన్లు వస్తాయన్నారు కమల్. అయితే, ఇందులో పారదర్శకత లోపించడం వల్లే, సినీ వ్యాపారం ఆశించినట్లుగా సాగడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ వ్యాపారంలో అంతా నీతినిజాయితీలతో వ్యవహరిస్తే, మన కలెక్షన్లు హాలీవుడ్ రికార్డులను సైతం బ్రేక్ చేస్తాయన్నారు కమల్ హాసన్.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్‌ను పోస్ట్ చేయండి