అది అన్ని సినిమాల్లాంటింది కాదు.. ఆరు పాటలు.. నాలుగు ఫైట్లున్న రోటీన్ సినిమా అంతకన్నా కాదు.. డబుల్ మీనింగ్ డైలాగులు, హీరోయిన్ల ఎక్స్ పోజింగ్ తో నడిచిపోయే ఫక్తు తెలుగు సినిమా అసలే కాదు.. కానీ, అదో అందమైన సినిమా, అందరి హృదయాలను హత్తుకునే సినిమా. ప్రతీ మనిషి జీవితాన్ని తెరపై చూపించిన సరికొత్త తెలుగు సినిమా.. అదే మనం. అవ్వడానికి అక్కినేని కుటుంబ సినిమా అయినా.. అది తెలుగువారందరి సినిమా.
అందరికీ తెలిసిన కథే. అందరి జీవితాల్లో జరిగే కథే. కానీ, మనం తేలిగ్గా తీసుకునే రొటీన్ లైఫే.. కానీ తెరపై చూస్తే తప్ప అందులోని లోతెంతో తెలియదు. ప్రతీ మాట వెనుక, ప్రతీ చర్య వెనుక మనసులు పడే మథనం అర్థం కాదు. దాన్నే చూపిస్తుంది మనం. ప్రతీ కుటుంబం, ఇంకా చెప్పలంటే ప్రతీ భార్యాభర్త చూడాల్సిన సినిమా ఇది. ఎందుకు చూడాలన్నది.. చూసిన తర్వాతే అర్థమవుతుంది. ప్రతీ చిన్న విషయాన్ని పెద్దది చేసుకుని తగువులు పెట్టుకునే నేటితరం భార్యాభర్తలైతే తప్పకుండా చూడాలి. చిన్నచిన్న గొడవలు ఎంతటి అనర్థాలను సృష్టిస్తాయో.. సూటిపోటి మాటలు జీవితాన్ని ఎలా కోల్పోయేలా చేస్తాయో సినిమా చూస్తేనే అర్థమవుతుంది.
ఒక్కో సన్నివేశం చూస్తూ కథలో లీనమైపోయే మనం.. అప్పుడే ఇంటర్వెల్ వచ్చేసిందా అని అనుకోకుండా ఉండలేం. కొన్ని సన్నివేశాలను చూడగానే.. మనసు పొరల్లోనుంచి మీదైన అనుభవాలు గుర్తుకొచ్చి.. మీ కళ్లలోనుంచి మీకు తెలియకుండానే నీళ్లు కారిపోతాయి. అలాగని ఇది ఏడుపుగొట్టు సినిమా అసలే మాత్రం కాదు. కావల్సినంత వినోదం ఉన్న సినిమా. చెప్పాలంటే అన్నింటినీ సమపాళ్లలో రంగరించిన ఉగాది పచ్చడి ఈ మనం. ఈ సినిమాను ఇంత అద్భుతంగా మలిచిన దర్శకుడు విక్రమ్ కుమార్ కు, ఈ సినిమాను నిర్మించిన అక్కినేని కుటుంబానికి ధన్యవాదాలు చెప్పాల్సిందే.

కామెంట్‌ను పోస్ట్ చేయండి